Arjun Suravaram
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించిన సంగతి తెలిసింది. ఈయన ఇష్యూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆయన రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించిన సంగతి తెలిసింది. ఈయన ఇష్యూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆయన రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
Arjun Suravaram
హెచ్ఎండీఏ మాడీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపై, ఇతర ఆఫీసులపై ఏసీబీ దాడులు చేసిన సంగతి తెలిసింది. ఈక్రమంలోనే ఆయన భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాక ఆయనను ఏసీబీ అధికారుల అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణను ఏసీబీ మరో వారం రోజుల కస్టడీ కోరనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో బాలకృష్ణ ఆమోదించిన ఫైల్స్, బినామీ ఆస్తులపై ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మరోవైపు బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలను అధికారులు వెల్లడించారు. మరి.. ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, ప్రస్తుత రెరార కార్యదర్శి, మెట్రో రైల్ ప్రణాళిక విభాగంలో పని చేస్తున్న శివ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గురువారం ఆయన ఇళ్లు, బంధువులు నివాసాలు, ఇతర ఆఫీసులపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 14 బృందాలు గా ఏర్పడి.. ఈ తనిఖీలు నిర్వహించారు. బాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ దాడుల్లో వెల్లడైంది. దాదాపు రూ.400కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక తాజాగా బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
లేఅవుట్ అనుమతుల కోసం బాలకృష్ణ భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. దరఖాస్తుల్లో తప్పులు ఉన్నాయని లాభాలు పొందినట్టు తెలిపారు. భవనాల నిర్మాణాల్లో విల్లాలను సైతం లంచంగా బాలకృష్ణ తీసుకున్నట్లు గుర్తించారు. బాలకృష్ణ హెచ్‌ఎండీఏ, రెరా విభాగాల్లో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలోని హెచ్‌ఎండీఏలో మూడు జోన్లపై బాలకృష్ణకు గట్టిపట్టు ఉందని అధికారులు గుర్తించారు. హెచ్‌ఎండీఏలోని కీలక పోస్టులో బాలకృష్ణ సుదీర్ఘంగా పనిచేశారు. బాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నా తరువాత ఏసీబీ అధికారులు బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్నారు. ఇదే సమయంలో బాలకృష్ణకు సహాయం చేసిన ఇతర అధికారులను కూడా విచారించనున్నారు.
ఆయన పరిధిలో ఉన్న జోన్ లో ఎకరం రూ.20కోట్ల వరకు ఉన్నట్లు తేలింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కొద్ది రోజుల ముందే వట్టినాగులపల్లి పరిసరాల్లో భూ వినియోగ మార్పిడి ఉత్తర్వుల జారీ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ సమయంలో హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా లేకపోయినా ఫైల్స్ ఆమోదంలో బాలకృష్ణ పాత్రపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. వట్టి నాగులపల్లిలో పెద్ద ఎత్తున భూ వినియోగ మార్పిడి జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ అక్రమాలు జరిగిన భూముల ఫైల్స్‌పై సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.
ఇక బాలకృష్ణ విషయానికి వస్తే..6 నెలల క్రితమే హెచ్ఎండీఏ నుండి బదిలీ అయి తెలంగాణ రేరా సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో, బాలకృష్ణ హెచ్ఎండీఏ డైరెక్టర్ గా ఉన్న సమయంలో జరిగిన అక్రమ అనుమతులపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. బాలకృష్ణ సమీప బంధువులను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించుకుని అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. కొందరు రాజకీయ నాయకులు కూడా అక్రమాలకు మధ్యవర్తులుగా వ్యవహరించినట్టు సమాచారం. మరి. శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.