P Krishna
చేసేది ప్రభుత్వ ఉద్యోగాలే అయినా.. డబ్బుకు కక్కుర్తి పడుతూ లంచాల రూపంలో ప్రజలను దోచుకుంటున్నారు కొంతమంది అధికారులు.
చేసేది ప్రభుత్వ ఉద్యోగాలే అయినా.. డబ్బుకు కక్కుర్తి పడుతూ లంచాల రూపంలో ప్రజలను దోచుకుంటున్నారు కొంతమంది అధికారులు.
P Krishna
దేశంలో లంచం ఇవ్వడం నేరం.. తీసుకోవడం నేరం అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో చేయి తడపనిదే ఏ ఫైల్ ఇంచు కూడా కదలదని అంటారు. ప్యూన్ నుంచి పై ఆఫీసర్ల వరకు ఎంతోకొంత డబ్బులు సమర్పిస్తేనే ఏ పనైనా జరుగుతుందని చెబుతుంటారు. ప్రభుత్వ శాఖలో అందరూ కాకుండా కొంతమంది న్యాయంగా పనిచేసే ఆఫీసర్లు కూడా ఉన్నారు. చాలా వరకు ప్రభుత్వ పథకాలు, కాంట్రాక్ట్ ఇతర పనులకు డబ్బు ఇవ్వనిదే పని జరగదని తేల్చి చెబుతుంటారు కొంతమంది అధికారులు. లంచావతారులపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నా.. వీరిలో మార్పు రావడం లేదు. తాజాగా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది ఓ సబ్ రిజిస్ట్రార్. వివరాల్లోకి వెళితే..
ఒకప్పుడు ఆమె యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కరోనా కష్ట కాలంలో పేదలకు సాయం అందిస్తూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది. ఆమె ఎవరో కాదు మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లిమా. తాజాగా ఏసీబీ అధికారులు పన్నిన వలలో లంచం తీసుకుంటూ దొరికిపోయింది సబ్ రిజిస్ట్రార్ తస్లిమా. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రర్ ఆఫీస్ లో దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన హరీష్ ఇటీవల 128 గజాల స్థలం కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ కోసం గజానికి రూ.200 లంచం ఇవ్వాలని తస్లిమా డిమాండ్ చేసింది. తాను అంత ఇచ్చుకోలేనని.. రూ.150 వరకు ఇవ్వగలనని ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మార్చి 22 న తస్లిమాకు డబ్బులు ఇస్తుండగా పథకం ప్రకారం ఏసీబీ అధికారులు రంగంలోకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ సమయానికి తస్లిమా వద్ద రూ.19,200 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకున్నారు.
శుక్రవారం సాయంత్రం ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ఈ రైడ్ జరిగింది. తస్లిమాతో పాటు ఆఫీసులో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్ వెంకటేశం ని కూడా ఏసీబీ అధికారులు పట్టుకొని కేసు నమోదు చేసుకున్నాడు. ఆఫీస్ లో హరీష్ ఇచ్చిన 19 వేలు మాత్రమే కాకుండా మరో 1,72,000 రూపాయలు పోలీసులు తనిఖీల్లో వెంకటేష్ టేబుల్ వద్ద పట్టుబడ్డాయి. ఈ డబ్బుకు ఆధారాలు ఏవీ చూపించకపోవడవంతో ఆ మొత్తాన్ని లంచాల డబ్బులు అని ఆరోపణలు వస్తున్నాయి. బాధితుల నుంచి లంచాలు తీసుకోవడానికి వెంకటేశం కీల్ పాత్ర పోషిస్తారని అధికారులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో ఆఫీస్ లో పట్టుబడటంతో సిబ్బంది సైతం షాక్ తిన్నారు. ఆ డబ్బు మొత్తం స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు అధికారులు.