కాటేసిన పాముతో ఆసుపత్రికి వెళ్లిన మహిళ

బల్లులు, పాములు పేర్లు తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది ఇక కనిపిస్తే గుడ్డు తేలేస్తుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు పాము పేరు వినబడితేనే ఆమడ దూరం పరిగెడుతుంటారు. కానీ ఈ మహిళ మాత్రం..

బల్లులు, పాములు పేర్లు తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటిది ఇక కనిపిస్తే గుడ్డు తేలేస్తుంటారు. ముఖ్యంగా ఆడవాళ్లు పాము పేరు వినబడితేనే ఆమడ దూరం పరిగెడుతుంటారు. కానీ ఈ మహిళ మాత్రం..

పాము అనే పదం వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. అక్కడ ఎక్కడే పాము కనబడితే.. ఇక్కడ నుండి ఇంట్లోకి పరుగులు పెడతాం. అలాంటిది మన కంటి ముందు కనిపిస్తే.. ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకుంటుంది.. అంతే వేగంతో ఒక్కోసారి ఆగిపోతుంది. స్నేక్ కనిపించిన వెంటనే దాన్ని నుండి తప్పించుకోవాలని అనుకుంటాం కానీ.. చంపేయాలన్న ధైర్యం చాలా తక్కువ మందికి వస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్లు అయితే పాము కనిపిస్తే చాలు..రెండు, మూడు రోజులు అటు వైపు కూడా వెళ్లరు. కానీ ఈ మహిళ మాత్రం.. మామూలు లేడీ కాదు.. డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఉమెన్. అనుకోకుండా ఆమె పాము కాటుకు గురైంది. ఇతరులు అయితే.. వెంటనే కుప్పకూలిపోతారు. కానీ ఈవిడ మాత్రం..

తనను కాటేసిన పామును చంపి.. దాన్ని తీసుకుని ఆసుపత్రికి వచ్చింది. ఈ ఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెంకటాపురం మండలం ముకునూరు పాలెంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు వెళుతున్నారు కొంత మంది మహిళలు. వారిలో ఒకరు మిడియం శాంతమ్మ. సోమవారం యాథావిధిగా గ్రామ సమీపంలో ఉపాధి హామీ పనులకు వెళ్లింది. పనులు చేస్తుండగా.. ఆమెను పాము కాటు వేసింది. సాధారణంగా పాము కాటేస్తే.. ఒక్కసారిగా గుండె బేజారు అవుతుంది. వెంటనే మానసిక స్థైర్యాన్ని కోల్పోతారు. కానీ శాంతమ్మ తనను కాటు వేసిన పామును చంపింది.

పామును చంపి వాటర్ బాటిల్‌లో వేసి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. ఆమె వెంట.. కొంత మంది కూలీలు కూడా వెళ్లారు. శాంతమ్మ పామును తీసుకుని ఆసుపత్రికి తీసుకు వస్తుంటే అక్కడ సిబ్బంది, వైద్యులు వింతగా, ఆశ్చర్యంగా చూశారు. వెంటనే తనను ఈ పాము కాటేసింది అంటూ వైద్యులకు చూపించి.. తనకు చికిత్స అందించాలని కోరింది శాంతమ్మ. వైద్యులు వెంటనే ఆమెకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. పాము పేరు వింటేనే భయంతో ఒళ్లు వణికిపోతుంది. కానీ తనను కాటేసిన పామును చంపి.. దాన్ని తీసుకుని ఆసుపత్రికి వెళ్లిందంటే.. ఆమె గుండె ధైర్యానికి హ్యాట్సాఫ్.

Show comments