Swetha
ఎంతో మంది ఉన్నత ఉద్యోగాలను సాధించాలని.. అనుకుంటూ ఉంటారు. కానీ, ఎన్నో కష్టాలు వారిని చుట్టూ ముడుతూ ఉంటాయి. ఆ సమయంలో ఎవరికైనా కావాల్సింది.. వాళ్ళని నమ్మే ఒక తోడు. సరిగ్గా ఇలానే తాగుడుకు బానిసైన తన భర్తను ప్రభుత్వ ఉద్యోగం చేసేలా మార్చింది తన భార్య.
ఎంతో మంది ఉన్నత ఉద్యోగాలను సాధించాలని.. అనుకుంటూ ఉంటారు. కానీ, ఎన్నో కష్టాలు వారిని చుట్టూ ముడుతూ ఉంటాయి. ఆ సమయంలో ఎవరికైనా కావాల్సింది.. వాళ్ళని నమ్మే ఒక తోడు. సరిగ్గా ఇలానే తాగుడుకు బానిసైన తన భర్తను ప్రభుత్వ ఉద్యోగం చేసేలా మార్చింది తన భార్య.
Swetha
ఉన్నత చదువులు చదవాలని, ఉన్నత ఉద్యోగాలు చేయాలనీ ప్రతి ఒక్కరు కలలు కంటారు. వారి కలలను సాకారం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనే తపనతో ఎంతో మంది ఉంటారు. ఈ క్రమంలో వారికీ ఎన్నో ఆటు పోట్లు ఎదురౌతూ ఉంటాయి. ప్రయత్నించిన ప్రతి సారి.. ఒక మార్క్ లోనో , అర మార్క్ లోనో ఆ ఉద్యోగాలను కోల్పోతూ ఉంటారు. ఆ సమయాల్లో వారు పడే ఆవేదన కేవలం వారికి మాత్రమే అర్ధమౌతుంది. అలా కఠిన సమయాలను చూసిన వారు.. ఇంకా మన వలన కాదులే అనుకుని ఆ ప్రయత్నాలను ఆపివేస్తూ ఉంటారు. మరికొంతమంది డిప్రెషన్ కు లోనయ్యి .. వ్యసనాలకు బానిస అయిపోతూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రియల్ లైఫ్ లోని ఓ వ్యక్తి కూడా ఈ కోవకు చెందిన వాడే. ఉద్యోగం రావట్లేదనే బాధలో తాగుడుకు బానిస అయిపోయాడు. కానీ,ఆ అతని భార్య మాత్రం అతనిని ప్రభుత్వ ఉద్యోగం చేసేలా చేసింది.
నల్గొండకు చెందిన అతను ఎంతో ఉన్నత విద్యను చదివాడు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని ఎన్నో కలలు కంటూ.. దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. కానీ, అతను ప్రభుత్వ పరీక్షలు రాసిన ప్రతి సారి ఒకటి అర మార్కులతో ఆ ఉద్యోగాన్ని కోల్పోయేవాడు. అతను ఓ వైపు ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా చేస్తూనే .. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలను చేస్తూ ఉండేవాడు. ఒకానొక సమయంలో ఇంత చదువు చదివి ఏంటి ఇలా అనే ఆలోచనలు .. అతనిని బాగా కృంగదీశాయి. దీనితో అతను డిప్రెషన్ కు లోనయ్యి.. తాగుడుకు బానిస అయ్యాడు. అటు కన్న తల్లిదండ్రులు కూడా అతనికి నచ్చ చెప్పలేకపోయారు. దీనితో అతనికి మందు లేకపోతే రోజు గడిచేది కాదు. దీనితో ఊరిలో వారంతా అంత చదువు చదువుకుని తాగుబోతు అయ్యాడని అతనిని ద్వేషిస్తూ, దూషిస్తూ ఉండేవారు. కానీ, అతని మరదలు మాత్రం అందరూ ఆశ్చర్యపోయేలా అతనిని పెళ్లి చేసుకుంది.
చుట్టాలు, చుట్టూ ఉన్న వారు అంతా ఆమెను.. ఆమె భర్తను హేళన చేస్తున్న సరే.. అవన్నీ పట్టించుకోకుండా ఆమె తన ప్రేమతో తన భర్తను దారిలోకి తెచ్చుకుంది. అతనికి ఒక ఆటో కొనిచ్చి.. ఆటో నడుపుకునేలా చేసింది . మెల్లగా అతనిని మద్యం అలవాటు మానేలా చేసింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతా సజావుగానే సాగిపోతున్న సరే.. ఎంఎస్సి బిఈడీ చదువుకుని తన భర్త ఆటో నడుపుకోవడం ఏంటని.. ఆమె మళ్ళీ తన భర్త దృష్టిని చదువు వైపు మళ్లే ప్రయత్నాన్ని చేసింది. అందుకోసం తన భర్త ఆటోని అమ్మేవేసి.. తానూ ప్రైవేట్ టీచర్ గా జాయిన్ అయ్యి.. ఆమె భర్త చదువుకునేందుకు పూర్తి స్వేచ్చని ఇచ్చింది. ఇదే చివరి అవకాశంగా భావించి అతను కష్టపడి చదివాడు .. సరిగ్గా అదే సమయానికి గురుకుల పాఠశాలలో ఉద్యోగ అవకాశాలు ఉండడంతో.. అతని కష్టానికి ప్రతిఫలంగా ఆ ప్రభుత్వ ఉద్యోగం అతనిని వరించింది. ఎంతో మంది అతనిని నమ్మకుండా దూషించిన సరే.. కట్టుకున్న భార్య మాత్రం అతని చేయి విడవకుండా .. అండగా నిలిచి అతని కల సాకారం అయ్యేలా చేసింది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.