P Krishna
Adilabad: టెక్నాలజీ రంగంలో ప్రపంచం ఎన్నో అద్భుతాలు సాధించింది. మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించాడు. అంతరిక్షంలో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. ఇంత సాధించినా మూఢ నమ్మకాలను వదల్లేకపోతున్నారు.
Adilabad: టెక్నాలజీ రంగంలో ప్రపంచం ఎన్నో అద్భుతాలు సాధించింది. మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించాడు. అంతరిక్షంలో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు. ఇంత సాధించినా మూఢ నమ్మకాలను వదల్లేకపోతున్నారు.
P Krishna
ప్రపంచ దేశాలతో పోటీ పడి భార దేశం అన్ని రంగాల్లో అభివృద్ది సాధిస్తుంది.. చంద్రయాన్ 3 నింగిలోకి పంపించి ప్రపంచ దేశాలన్ని మనవైపు తిప్పుకునేలా చేశాం. టెక్నాలజీ పరంగా ఎన్నో కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నాం. ఎంత అభివృద్ది సాధించినా.. ఒక్క విషయంలో మనిషి విఫలమవుతున్నాడు.. అదే మూఢనమ్మకం. సమాజంలో నెలకొన్న మూఢ నమ్మకాలను ప్రాలదోలేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. దెయ్యాలు, భూతాలు అంటే ఇప్పటికీ భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే మంత్రాలకు చింతకాలు రాలగొడతాం అంటున్న బాబాలు, దొంగసాములను నమ్ముతూనే ఉన్నారు. ఓ స్కూల్ లో దెయ్యం ఉందని పుకార్లు షికార్లు చేశాయి. పిల్లల్లో ధైర్యం నింపేందుకు ఉపాధ్యాయుడు చేసిన పనికి అందరూ హ్యాట్సాఫ్ అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
గత వారం రోజులుగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం ఆనంద్ పూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో దెయ్యాలు ఉన్నాయంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. విద్యార్థులకు పాఠాలు చెబుతున్న సమయంలో బయట ఓ చెట్టు హఠాత్తుగా కూలిపోయింది. ఇలా రక రకాల పరిణామాలు జరుగుతున్నాయని.. స్కూల్ కి రావాలంటే భయమేస్తుందని విద్యార్థు తెలిపారు. ఈ విషయం గ్రామంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇలా అయితే విద్యార్థుల చదువు పాడవుతుందని భావించిన ఉపాధ్యాయుడు, జన విజ్ఞాన వేధిక జిల్లా ప్రధాన కార్యదర్శి నూతల రవీందర్ పిల్లల్లో ధైర్యం నింపేందుకు సిద్దమయ్యారు. శుక్రవారం రాత్రి అమావాస్య రోజు స్కూలు, పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఉండొద్దని చెప్పి ఒంటరిగా తరగతి గదిలో నిద్రించారు. దీనికి సంబంధించిన లైవ్ వీడియో తీశాడు.
దెయ్యాలు, భూతాలు ఉన్నాయని అన్నారు కదా? ఏదీ దెయ్యం నాకు కనిపించలేదు.. నన్ను ఏం చేయలేదు అని విద్యార్థులతో చెప్పి వారిలో ధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా నూతన రవీందర్ మాట్లాడుతూ.. దెయ్యాలు ఉన్నాయనే భ్రమ పిల్లల్లో అస్సలు రావొద్దు.. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎన్నో అద్భుతాలు సాధించాం.. వాటి గురించి పిల్లకు చెప్పి వారిలో చైతన్యం తీసుకురావాలని అన్నారు. విద్యార్థులు సైతం అమావాస్య రోజు తమ సార్ ఒంటరిగా పడుకున్నాడు.. ఆయనకు ఏం కాలేదని ధైర్యంగా చెబుతున్నారు. తమకు దెయ్యాల భయం పోయిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే గత ఏడాది ఓ విద్యార్థి స్కూల్ లో దెయ్యం ఉందని భయంతో ప్రైవేట్ పాఠశాలలో చేరారు. ఇటీవల ఆనంద్ పూర్ ప్రాథమికోన్నత పాఠశాలకు కొత్తగా వచ్చిన రవీందర్ విద్యార్థుల్లో పాతుకుపోయిన నమ్మకం, భయం తొలగించిన తీరుపై సహ ఉపాధ్యాయులు, గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.