Keerthi
పెంపుడు శునకాలపై మనుషులకు ఉన్న ప్రేమను మాటల్లో వర్ణించలేం. అందుకే చాలామంది కుక్కలను తమ కుటుంబసభ్యుల్లో ఒకరిగా భావిస్తారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్కలు మరణించిన, కనిపించకుండా పోయిన ఆ బాధను తట్టుకోలేరు. తాజాగా ఓ యాజమాని పెంచుకున్న కుక్క కనిపించకపోవడంతో అతను చేసిన పనికి అంతా ఆశ్చర్యపోయారు.
పెంపుడు శునకాలపై మనుషులకు ఉన్న ప్రేమను మాటల్లో వర్ణించలేం. అందుకే చాలామంది కుక్కలను తమ కుటుంబసభ్యుల్లో ఒకరిగా భావిస్తారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్కలు మరణించిన, కనిపించకుండా పోయిన ఆ బాధను తట్టుకోలేరు. తాజాగా ఓ యాజమాని పెంచుకున్న కుక్క కనిపించకపోవడంతో అతను చేసిన పనికి అంతా ఆశ్చర్యపోయారు.
Keerthi
మనుషులకు శునకాలకు మధ్య అనుబంధం ఎంతో అద్భుతమైనది. అందుకేనేమో మనలో చాలమంది కుక్కలను చాలా ఇష్టంగా పెంచుకుంటారు. ఎందుకంటే.. మనుషులకంటే కుక్కలకే చాలా విశ్వాసం ఉంటుంది. కొంచెం ప్రేమను చూపిస్తే చాలు ప్రాణం ఉన్నంత వరకు ఎంతో విశ్వాసంతో ఉంటాయి. అవసరమైతే యాజమానుల కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి వెనకడావు. అందుకే వాటిని కుటుంబసభ్యుల్లో ఒకరిగా భావించి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వాటికి ఏ చిన్న కష్టం వచ్చిన తట్టుకోలేరు. ఎంతో అప్యాయంగా తమ కన్నబిడ్డల వలె చూసుకుంటారు. ఇక మనుషులకు శునకాలపై ఉండే ప్రేమను మాటల్లో వర్ణించలేం. ఇప్పటికే చాలామంది ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్కలకు పుట్టనరోజులు చేయడం, సీమంతాలు జరపడం, అవి మరణించాక మనుషులకు చేసినట్టు శాస్త్ర ప్రకారంగా కర్మకండాలు చేస్తూ వాటి పై ఉండే ప్రేమను వ్యక్తపరుస్తున్నారు.
ప్రస్తుత కాలంలో చాలమంది జంతు ప్రేమికులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. మనుషులకన్నా ఎక్కువగా కుక్కలపై కేరింగ్ ను చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా ఓ యాజమాని తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్నా కుక్క కనిపించకుండా పోవడంతో వెతికి పెట్టాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. అంతేకాకుండా ఆ కుక్క ఆచూకి కోసం ఏకంగా బహుమతిని కూడా ప్రకటించాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన శివప్రసాద్ అనే యువకుడు బెల్జీయం మెల్మాస్ బ్రీడ్ రకానికి చెందిన ఒక కుక్క పిల్లను పెంచుకుంటున్నాడు. అయితే గత రెండేళ్లుగా ఎంతో అల్లరు ముద్దుగా పెంచుకుంటున్న ఆ కుక్క పిల్ల పై ఆ యువకుడికి వీడదీయలేని అనుబంధం ఏర్పడింది.
కానీ, ఇంతలోనే ఆ మూగ బంధం కనిపించకుండా దూరమైయ్యింది. గతనెల నవంబరు 12వ తేదిన ఆ కుక్క పిల్ల తప్పిపోయింది. అది తప్పిపోవడంతో ఎంతో అల్లాడిన శివప్రసాద్ దానికోసం వెతకని చోటు అంటూ లేదు. చివరికి తన గ్రామంలోనే కాకుండా.. పరిసర గ్రామాలన్నీ వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేది ఏమీ లేక ఈ నెల 13న శాలిగౌరారం పోలీస్ స్టేషన్ లో కుక్క కోసం కంప్లైట్ ఇచ్చాడు. అంతేకాకుండా ఆ కుక్క పిల్ల ఫోటోను కూడా పోలీసులకు ఇచ్చి వెతికిపెట్టమని కోరాడు.
ఇక శివప్రసాద్ పోలీసులను ఆశ్రయించి నెలరోజులు గడిచినా.. ఆ కుక్క ఆచూకీ పోలీసులు కనుక్కోలేకపోయారు. దీంతో తన కుక్క ఆచూకీ తెలిపినవారికి 5 వేల రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించాడు. ఆ ప్రకటన విన్న స్థానికులు ఆశ్చర్యనికి గురైయ్యారు. కాగా, ఆ కుక్క కోసం కొందరు వెతికే పనిలో కూడా పడినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా శివప్రసాద్ కు తన కుక్క మీద ఉన్న ప్రేమ ఎనలేనిది. మరి, ఆ కుక్క గురించి శివప్రసాద్ చేసిన ప్రకటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.