P Krishna
Nalgonda: పేదరికం అడ్డు వచ్చినా చిన్నప్పటి నుంచి కష్టపడి చదవి ఉన్నత విద్యనభ్యసించి సమాజంలో మంచి పొజీషన్ కి వచ్చిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో పేదరికాన్ని జయించి ఏకంగా నాలుగు ఉద్యోగాలు సంపాదించింది ఓ చదువుల తల్లి.
Nalgonda: పేదరికం అడ్డు వచ్చినా చిన్నప్పటి నుంచి కష్టపడి చదవి ఉన్నత విద్యనభ్యసించి సమాజంలో మంచి పొజీషన్ కి వచ్చిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో పేదరికాన్ని జయించి ఏకంగా నాలుగు ఉద్యోగాలు సంపాదించింది ఓ చదువుల తల్లి.
P Krishna
తమ పిల్లలు ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగాలు సంపాదించి సమాజంలో గౌరవంగా.. గొప్పగా బ్రతకాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. అందుకోసం తమకు ఆర్థిక భారమైనప్పటికీ చిన్నప్పటి నుంచి ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివిస్తుంటారు. కానీ, పేదరికంలో ఉండే విద్యార్థులకు ఆ అవకాశం ఉండదు.. అందుకే ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంటూ ఆర్థిక కష్టాలు ఎదుర్కొని ఉన్నవిద్యనభ్యసించి తమ లక్ష్యాన్ని చేరుకుంటారు. కృషీ, పట్టుదల ఉంటే ఏలాంటి లక్ష్యం అయినా సాధించవొచ్చు అని నిరూపించింది ఓ యువతి. పేదరికాన్ని జయించి ఏక కాలంలో నాలుగు ఉద్యోగాలు సంపాదించింది ఆ చదువుల తల్లి. పూర్తి వివరాల్లోకి వెళితే..
నల్లగొండ జిల్లాకు చెందిన చింతల వెంకన్న, లక్ష్మీ దంపతుల మూడో సంతానం చింతల తులసి. చిన్నప్పటి నుంచి గొప్ప చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలన్న కోరికతో ఉండేది. తులసికి చిన్నతనం నుంచి పేదరికం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాల్సి వచ్చింది. ఎప్పటికైనా తన లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదలతో కష్టపడి చదవి మంచి ర్యాంకులు సంపాదించింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేసిన తులసి ఏక కాలంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. గతంలో గ్రూప్-4, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించింది. ఏప్రిల్ 24 న ఏఈ, ఆగస్టు 2 న ఏఈఈ ఉద్యోగాలకు ఎంపికైంది. తులసి జేఎన్‌టీయూహెచ్‌లో బీటెక్, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలనే లక్ష్యంతో రెండేళ్లుగా పోటీ పరీక్షలకు సిద్దమవుతూ వచ్చింది.
ఈ క్రమంలోనే పోటీ పరీక్షల్లో తన సత్తా చాటుతూ నాలుగు ఉద్యోగాలకు ఎంపికైంది. గ్రూప్ – 1 సాధించడమే తన ఏకైక లక్ష్యం అంటుంది ఈ చదువుల తల్లి. తులసి ఏఈఈ పరీక్షలకు సిద్దమవుతున్న సమయంలో ఆర్థికంగా చాలా కష్టాలు పడాల్సి ఉంది.. ఆ సమయంలో ట్యూషన్లు చెప్పగా వచ్చిన డబ్బుతో పుస్తకాలు, హాస్టల్ ఫీజు కట్టి తన లక్ష్యాన్ని సాధించింది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే చదువును నిర్లక్ష్యం చేయకూడదని చిన్నప్పటి నుంచి తన తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ రావడం వల్లనే తాను ఈ స్థాకియి వచ్చినట్లు తులసీ చెబుతుంది. ఎన్ని కష్టాలు పడైనా సరే తన తల్లిదండ్రులు ఆశలు వమ్ము చేయకుండా గ్రూప్ – 1 సాధిస్తానని చెబుతుంది.