iDreamPost
android-app
ios-app

పది పరీక్షలకి.. పసివాడిని తెచ్చినట్టు! ఇది కదా అమ్మ ప్రేమ!

బిడ్డను ప్రయోజకుడిని చేయాలనే తపన, ఉన్నత చదువులు చదివించాలనే ఆరాటం ఆ తల్లిని ఎంతటి సమస్యలైనా ఎదుర్కొనేలా చేస్తుంది. దివ్యాంగుడైన కుమారుడిని పదోతరగతి పరీక్ష రాయించడానికి ఓ తల్లి పడుతున్న తపన స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

బిడ్డను ప్రయోజకుడిని చేయాలనే తపన, ఉన్నత చదువులు చదివించాలనే ఆరాటం ఆ తల్లిని ఎంతటి సమస్యలైనా ఎదుర్కొనేలా చేస్తుంది. దివ్యాంగుడైన కుమారుడిని పదోతరగతి పరీక్ష రాయించడానికి ఓ తల్లి పడుతున్న తపన స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

పది పరీక్షలకి.. పసివాడిని తెచ్చినట్టు! ఇది కదా అమ్మ ప్రేమ!

నేటి సమాజంలో చాలా మంది చిన్న చిన్న సమస్యలకే  ప్రాణాలు బలి తీసుకుంటారు. ముఖ్యంగా తమ కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోలేక  మానసిక ఒత్తిడికి గురువుతుంటారు. ఈ క్రమంలో చావే సమస్యకు పరిష్కారంగా భావిస్తుంటారు. అయితే కొందరు మాత్రం  కాలం ఎన్ని పరీక్షలు పెట్టిన..వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో మాతృమూర్తులు ముందుటారు. తాజాగా జరిగిన ఓ దృశ్యం అమ్మ ప్రేమకు నిర్వచనం తెలిపింది. నడవలేని స్థితిలో ఉన్న తన కుమారుడిని ఎత్తుకుని పదో తరగతి పరీక్షలు రాయించింది.  మనస్సు చలించే ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఈ భూమిపై అమ్మ ప్రేమకు సాటి అయినది మరొకటి లేదు. తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది. అంతేకాక పిల్లలను పెంచి పెద్ద చేసే క్రమంలో తాను ఇబ్బందులు పడుతుంది. అయినా బిడ్డల సంతోషమే కోసం అలాంటి కష్టాలు ఎన్నో అనుభవిస్తుంది. అలానే  కొందరు మాతృమూర్తులు తమ బిడ్డ అంగవైకల్యంగా పుట్టిన కూడా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసుకుంటారు. వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. అందుకే ప్రపంచంలో తల్లిని మించిన యోధులెవరూ లేరని చెబుతుంటారు. ఆ మాటను నిజం చేస్తూ ఎన్నో అమ్మ ప్రేమ ఘటనలు మనం చూశాం. తాజాగా ఓ మాతృమూర్తి ఆ జాబితాలో చేరింది.

This is mother's love

తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా లోని చించోలి(బి) అనే గ్రామంలో పద్మ అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు చరణ్ అనే కుమారుడు ఉన్నాడు. అతడికి పోలియో కారణంగా చిన్నతనంలోనే కాళ్లు పూర్తిగా పడిపోయాయి. అలానే చరణ్ పుట్టిన ఏడాదికే పద్మ భర్తను కోల్పోయింది. ఇలా భర్త మరణం, బిడ్డ అంగవైకల్యంతో పద్మ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక ఆ బిడ్డనే తన ప్రపంచంగా భావించిన పద్మ..చరణ్ ను అల్లారు ముద్దుగా చూసుకుంటుంది.  స్థానికంగా బీడీలు చుడుతూ  ఆ తల్లి.. తన బిడ్డ బాగోగులు చూస్తోంది. అలా చరణ్ ను పెంచి  పెద్ద చేసింది. అంతేకాక తన కొడుకును చదివిస్తుంది. ప్రస్తుతం చరణ్ పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. చరణ్ పదో తరగతి కావడంతో పద్మ రోజు చేతులపై చరణ్ మోస్తూ ఆటో ఎక్కించి తీసుకొచ్చి పరీక్షలు రాయిస్తోంది.

గతంలో తాత సహకారంతో బాలుడు పాఠశాలకు వెళ్లగా… ప్రస్తుతం ఆయన వయసు సహకరించడంలేదు. ఈ కారణంగా తల్లి తన కుమారుడిని పరీక్షా కేంద్రానికి ఆటోలో తీసుకొచ్చి…చేతులపై ఎత్తుకొని కేంద్రంలోకి తీసుకెళ్లింది. దివ్యాంగులకు కేటాయించిన స్క్రైబ్ విద్యార్థి సహకారంతో చరణ్ పరీక్షలు రాస్తున్నాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ అమ్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అమ్మ ప్రేమ అంటే ఇదే కదా అని కొందరు అంటుంటే, అసలైన పోరాట యోధురాలు నువ్వే అమ్మ అంటూ మరికొందరు పద్మపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలానే ఈ అమ్మ  ఆత్మస్థైర్యానికి స్థానికులు సెల్యూట్ చేస్తున్నారు. మరి.. ఈ మాతృమూర్తిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.