TS: పెంపుడు కుక్క మొక్కు.. ఏకంగా బంగారంతో తులాభారం!

ఈ మధ్యకాలంలో ప్రతిఒక్కరు మనుషులకంటే ఎక్కువగా కుక్కలకే విలువను ఇస్తూ, ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ కుటుంబం తమ పెంపుడు కుక్క ఆరోగ్యం క్షీణించడం పై ఏకాంగా ఆ దేవతాలకు మొక్కను మొక్కుకున్నారు. ఇంతకి కానుకగా ఏమిచ్చారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఈ మధ్యకాలంలో ప్రతిఒక్కరు మనుషులకంటే ఎక్కువగా కుక్కలకే విలువను ఇస్తూ, ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ కుటుంబం తమ పెంపుడు కుక్క ఆరోగ్యం క్షీణించడం పై ఏకాంగా ఆ దేవతాలకు మొక్కను మొక్కుకున్నారు. ఇంతకి కానుకగా ఏమిచ్చారో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరి ఇంట్లో పెంపుడు కుక్కలను పెంచుకోవడం సర్వ సాధారణం అయిపోయింది. అయితే ఈ క్రమంలోనే వాటిని మనుషుల కంటే ఎక్కువ విలువ ఇస్తున్నారు. అది ఎంతలా అంటే.. వాటికి ఏ చిన్న సమస్య వచ్చిన తల్లడిల్లిపోయే అంతా ఇష్టంగా పెంచుకుంటున్నారు. అలాగే వాటికి ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆహారం కూడా తినిపిస్తుంటారు ముఖ్యంగా వాటిని తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిలా భావిస్తు ఎంతో ముద్దుగా చూసుకుంటారు. మరి, ఈ మధ్యకాలంలో అయితే ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్కలు ఒక్కసారిగా కనిపించకుండా పోతే.. వాటి అచూకి తెలుసుకున్నా వారికి బహుమతులు కూడా ప్రకటిస్తున్నారు. మరి కొన్ని సందర్భల్లో అయితే అవి కనిపించకపోయినా, చనీపోయినా.. వాటి మరణాని జీర్ణించుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇలా రకరకాలుగా తాము పెంచుకున్న కుక్కలపై వారి ప్రేమను చాటుతుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణకు చెందిన ఓ కుటుంబ మాత్రం తాము ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క ఆనారోగ్యంకి గురైయ్యిందని ఏకంగా.. ఆ కుక్క పేరిట ‘సమక్క సారక్క’ దేవతలకు మొక్కుకున్నారు. ఇంతకి ఆ మొక్కు పేరిట వారు సమర్పించిన కానుక తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకి అదేమిటంటే..

తెలంగాణ హనుమకొండకు చెందిన బిక్షపతి – జ్యోతి దంపతులు ఎంతో అల్లారుముద్దుగా.. ఓ పెంపుడు కుక్కను పెంచుకుంటున్నారు. ఆ కుక్క పేరు ‘లియో’. అయితే ఆ కుక్క గతకొన్ని రోజులగా తీవ్ర అనారోగ్యంతో.. ఏమీ తినకుండా అస్వస్థతకు గురైంది. దీంతో ఆ కుటుంబ సభ్యులకు ఏం చేయాలో తోచక ఆ సమయంలో సమ్మక్క సారక్క దేవతలకు మొక్కుకున్నారు. అలాగే కుక్క ఆరోగ్యం కుదుటపడితే మళ్ళీ వచ్చే జాతరకు కచ్చితంగా నిలువెత్తు బంగారం (బంగారంలా భావించే బెల్లం) సమర్పిస్తామని మొక్కుకున్నారు. అయితే విచిత్రం ఏమిటంటే.. ఇలా మొక్కిన మూడో రోజులకే ఆ లియో ఫుల్ యాక్టీవ్ అయిపోయింది. దాని ఆరోగ్యం కూడా కుదిటపడింది. దీంతో కోరిన మొక్కు ఫలించిదని ఆ కుటుంబ సభ్యులు సంబర పడ్డారు.

 

దీంతో వెంటనే సమ్మక్క సారక్క దేవతలకు ఆ కుటుంబం లియోను తీసుకెళ్లి కాంటాలో కూర్చోబెట్టి నిలువెత్తు బంగారం( బెల్లంను) తులాభారం వేశారు. కాగా, ఈ పెంపుడు కుక్క 13 కేజీలు తూగడంతో.. వారు కూడా’ 13 కేజీల నిలువెత్తు బంగారం’ను తీసుకెళ్లి మేడారం సమ్మక్క సారక్క దేవతలకు మొక్కును సమర్పించారు. అయితే పెంపుడు కుక్కకు తులాభారం వేయడం చూసి అక్కడున్న వారంతా వింతగా చూశారు. కాగా, సమ్మక్క సారక్క దేవతలకు మనుషులు నిలివెత్తు బంగారం సమర్పించడం చూశాం కానీ, ఇలా కుక్కలకు కూడా నిలివెత్తు బంగారం సమర్పిస్తారా అని అంతా ఆశ్చర్య పోయారు. మరి, పెంపుడు కుక్కకు నిలువెత్తు బంగారం తులాభారం వేసి మొక్కును తీర్చుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments