iDreamPost
android-app
ios-app

TS:పై ఇంట్లో ఇల్లాలు.. కింద ఇంట్లో ప్రియురాలు! ఇంకో 10రోజులు ఆగుంటే!

  • Published Jan 29, 2024 | 1:56 PM Updated Updated Jan 29, 2024 | 1:56 PM

ప్రేమించిన వ్యక్తితో మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కలిసిన యువతి ఇంతలో ఆత్మహత్య చేసుకుంది. అసలు ఏం జరిగిదంటే..

ప్రేమించిన వ్యక్తితో మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కలిసిన యువతి ఇంతలో ఆత్మహత్య చేసుకుంది. అసలు ఏం జరిగిదంటే..

  • Published Jan 29, 2024 | 1:56 PMUpdated Jan 29, 2024 | 1:56 PM
TS:పై ఇంట్లో  ఇల్లాలు.. కింద ఇంట్లో ప్రియురాలు! ఇంకో 10రోజులు ఆగుంటే!

ఇటీవలే కాలంలో ప్రేమ ముసుగులో అనేక దారుణాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రేమ పేరుతో మోసం చేయడం, వేధింపులకు పాల్పడటం, హత్యలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటి నేరాలు తరుచుగా చూస్తున్నాం. నచ్చినంత కాలం తిరుగుతూ, సహజీవనం చేస్తారు. చివరికి పెళ్లి అనగానే వివదాలు మొదలవుతాయి. ఈ క్రమంలోనే వదిలించుకోవాలని హత్యలు చేయడం, మోసపోయనని ఆత్మహత్యలు చేసుకోవడం ఎక్కువగా వింటున్నాం. ఇలా ఎంతోమంది ప్రేమించిన పాపానికి మోసపోయి బలైపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా హైదరాబాద్ లోని  ఓ యువతి ప్రేమించిన వ్యక్తితో మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కలసింది పోయి, ఇంతలోనే ఆత్మహత్య చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా హైదరాబాద్ అత్తాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆదివారం తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మరో 15 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. ఇంతలోనే ఆమె ఈ ఘోరానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థాలానికి వెళ్లి కేసును నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. బిహార్‌ రాష్ట్రానికి చెందిన అదితి భరద్వాజ్‌ (34) కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఇక్కడే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా స్థిరపడింది. కాగా, ఈమె గతంలో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోగా..ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావటంతో అతడితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత.. అదితి మణికొండలో అద్దెకు దిగింది. కాగా, ఈమెతో పాటు కలిసి పనిచేస్తున్న చింతల్‌మెట్‌కు చెందిన మహ్మద్‌అలీతో,అదితికి పరిచయం ఏర్పాడింది. ఆ పరిచయం కాస్తా సహజీవనానికి దారి తీసింది. ఈ క్రమంలోనే.. అతడు అత్తాపూర్‌ పీఎస్ పరిధిలోని హ్యాపీ హోమ్స్‌ కాలనీలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని అందులో అదితిని ఉంచాడు.అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. మహ్మాద్ కి కూడా గతంలో వివాహం జరిగగా భర్యా పిల్లలతో కలిసి అదే అపార్ట్‌మెంట్‌లోని పై పోర్షన్ లోనే ఉంటున్నాడు.

అయితే వీరిద్దరూ వచ్చే నెల 12న పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడ్ అయ్యారు. కానీ, ఇంతలో అదితి అనారోగ్యానికి గురైంది. వెంటనే హాస్పిటల్ వెళ్లి డాక్టర్‌కు చూపించుకోగా.. ఆమె గర్భంతో ఉన్నట్లు తెలిసింది. ఇక అప్పటి నుంచి అదితి తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. కాగా, నిన్న అనగా ఆదివారం (జనవరి 28న) తెల్లవారుజామున మహ్మద్‌ అలీకి ఫోన్‌చేసి తాను తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు చెప్పింది. అయితే ఏం జరిగిందో తెలియక మహ్మద్ ఆందోళనకు గురైయ్యాడు. వెంటనే అదితి ఉన్న ఫ్లాట్ కి చేరుకొగా.. అప్పటికే అదితి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే మహ్మద్‌అలీ అత్తాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు సమాచారం అందించడాని పోలీసులు తెలిపారు. మరి, త్వరలో పెళ్లి పీటలెక్కలసిన అదితి ఆత్మహత్య చేసుకోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio