Krishna Kowshik
తెలంగాణలోని భూపాల పల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. కిలో మీటర్ మేర నిర్మాణం చేపట్టాల్సి ఉండగా.. నేల కూలింది. అయితే గాలులకు ఈ వంతెన కూలడం గమనార్హం.
తెలంగాణలోని భూపాల పల్లి జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. కిలో మీటర్ మేర నిర్మాణం చేపట్టాల్సి ఉండగా.. నేల కూలింది. అయితే గాలులకు ఈ వంతెన కూలడం గమనార్హం.
Krishna Kowshik
భూకంపాలకు, వానలకు, వరదలకు వంటి ప్రకృతి పెను విలయాలకు భవనాలు, కొత్త నిర్మాణాలు కూలిపోవడం గురించి చూశాం. కానీ ఈదురు గాలులకు వంతెన కూలిపోవడం గురించి విన్నారా.. అటువంటి సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో మానేరుపై నిర్మిస్తున్న కొత్త బ్రిడ్డి ఈదురుగాలులు తట్టుకోలేక కూలిపోయింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. ఈ నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేసినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. టేకు మట్ల మండలం గర్మిల్ల పల్లి నుండి పెద్ద పల్లి జిల్లా ఒడెడు గ్రామానికి దూరం తగ్గించేందుకు మానేరుపై వంతెన నిర్మిస్తున్న సంగతి విదితమే.
2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. 46 కోట్ల వ్యయంతో అప్పటి ప్రభుత్వం వంతెన నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. అప్పటి స్పీకర్ మధుసుధనాచారి, మంథని ఎమ్మెల్యే పుట్ట మధులు శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు సాగాయి. వంతెన కొంత వరకు నిర్మాణం జరిగింది. అయితే మధ్యలోనే నిర్మాణం ఆపేశాడు కాంట్రాక్టర్. నిధుల లేమి, కాంట్రాక్టర్లు మారడం వంటి కారణాలతో నిర్మాణం సగంలోనే ఆగిపోయింది. ఇంకా కిలో మీటర్ నిర్మాణం చేయాల్సి ఉండగా.. మధ్యలోనే కట్టడం నిలిచిపోయింది. ఇప్పుడు ఇదే వంతెనలో కొంత భాగం ఈదురు గాలులకు ఊడి పడింది.
సోమవారం రాత్రి వీచిన గాలులకు ఈ బ్రిడ్జి పడిపోయింది. అయితే అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం, ప్రాణాపాయం తప్పినట్లు అయ్యింది. బ్రిడ్జి నిర్మాణం పెండింగ్‌లో ఉండటంతో స్థానిక ప్రజలు.. తాత్కాలికంగా ఉన్న మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పగటి పూట, రాకపోకలు సాగించే సమయంలో ఈ వంతెన కూలి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేదని చెబుతున్నారు. ఈదురు గాలులకే వంతెన కూలిపోవడంపై విమర్శలు తలెత్తుతున్నాయి.
ఈదురుగాలికి కుప్పకూలిన బ్రిడ్జి..
భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిల్లపల్లి నుండి పెద్దపల్లి జిల్లా ఒడేడు గ్రామానికి మానేరుపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జి అర్థరాత్రి ఈదురుగాలులకు కుప్పకూలింది.
సుమారు కిలోమీటర్ మేర నిర్మాణం చేయాల్సి ఉండగా మధ్యలోనే నిర్మాణం ఆపేసిన… pic.twitter.com/4YNbWfcfcX
— BIG TV Breaking News (@bigtvtelugu) April 23, 2024