iDreamPost
android-app
ios-app

80 ఏళ్ల వయస్సులో 20 పీజీలు చేసిన వృద్ధుడు! ఆయన టార్గెట్ అదే…

చదువుకు వయస్సు ఎప్పుడూ అడ్డంకి కాదు. చదవాలనే కసి.. ఏదైనా కొత్తగా సాధించాలనే తపన నీలో ఉంటే.. ఎంత వయస్సు వచ్చినా.. యువతతో పోటీపడి మరీ సాధించవచ్చు. అందుకు నిదర్శనమే ఓ 80 ఏళ్ల వృద్దుడు

చదువుకు వయస్సు ఎప్పుడూ అడ్డంకి కాదు. చదవాలనే కసి.. ఏదైనా కొత్తగా సాధించాలనే తపన నీలో ఉంటే.. ఎంత వయస్సు వచ్చినా.. యువతతో పోటీపడి మరీ సాధించవచ్చు. అందుకు నిదర్శనమే ఓ 80 ఏళ్ల వృద్దుడు

80 ఏళ్ల వయస్సులో 20 పీజీలు చేసిన వృద్ధుడు! ఆయన టార్గెట్ అదే…

ప్రతి ఒక్కరి ఏదో ఒక అంశంపై ఆసక్తి ఉంటుంది. మంచి విషయాలపై ఉంటే..గుర్తింపు సంపాదిస్తారు. చెడు అంశాలపై ఉంటే అపకీర్తి సంపాదిస్తారు. ఈ సంగతి పక్కన పెడితే.. చాలామందికి చదువుకోవాలనే కసి ఉంటుంది. అంతేకాక అవకాశం దొరికితే చదువుతూనే  ఉండేందుకు చూస్తుంటారు. ఇక చదవుకు వయస్సు ఎప్పుడు అడ్డం కాదని,చదువుపై కసి, ఏదైనా సాధించాలనే కోరిక ఉంటే.. ఎంత వయస్సు వచ్చినా సరే..యువతో పోటీ పడొచ్చు.  అలా పోటీ పడి విజయం సాధించిన వ్యక్తులు చాలా మందే ఉన్నారు. తాజాగా ఓ 80ఏళ్ల పెద్దాయన చదువుపై చూపిస్తున్న ఆసక్తి చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పటికే 20 పీజీలు చేసి.. ఇంకా చదువును కొనసాగిస్తున్నాడు. మరి.. పెద్దయాన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వరంగల్ జిల్లాకు చెందిన డాక్టర్ అంకతి వీరాస్వామి అనే 80 ఏళ్ల వృద్ధుడు నిత్య విద్యార్థిగా చదువుతూనే ఉన్నాడు. ఎనిమిది పదుల వయస్సులో కూడా ఆయన 20 పీజీలు పూర్తి చేశాడు. అంతేకాక మరో ఐదు పీజీలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అంకతి వీరస్వామి 1962లో హెచ్‌ఎస్సీ ఉత్తీర్ణులయ్యారు. అనంతరం టీచర్ ట్రైనింగ్ పూర్తిచేసి 1968లో గవర్నమెంట్ జాబ్ సాధించాడు. వరంగల్‌లోని ఎయిడెడ్‌ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఉద్యోగంలో చేరినా కూడా ఆయనకు చదువుపై ఆసక్తి తగ్గలేదు. అందుకే జాబ్ చేస్తూనే చదువును కొనసాగించాడు.

1973లో ఓపెన్ లో బీఏ పూర్తి చేశారు. 1978లో బీఈడీ పూర్తి చేశారు. ఇక 1981లో హిమాచల్‌ప్రదేశ్‌లో ఎంఈడీ చదువుతున్న సమయంలో ఒక ప్రొఫెసర్‌ మూడు పీజీలు పూర్తి చేయటం చూసి ఆయన షాకయ్యాడు. ఆయన నుంచి స్ఫూర్తి పొంది… దూరవిద్య ద్వారా వివిధ యూనివర్సిటీల నుంచి వరుసగా పీజీలు చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓయూ నుంచి 3, కేయూ నుంచి 7, ఇందిరాగాంధీ వర్సిటీ నుంచి 4, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం  నుంచి 3 పీజీలను చేశారు. అలానే  పలు రాష్ట్రాలకు చెందిన ఇతర యూనివర్సిటీల నుంచి మరో మూడు పీజీలు చేశారు. ఇక మొత్తంగా 25 పీజీలను చేయాలనేది తన లక్ష్యమని వీరస్వామి వెల్లడించారు. 2002లో ఉద్యోగం నుంచి పదవి విరమణ తీసుకున్న వీరస్వామి.. ఆ తర్వాత వరంగల్‌ జిల్లాలో తన పేరిటే ఏవీఎస్‌ స్కూల్‌ను ప్రారంభించారు.

80 ఏళ్ల వయస్సులో కూడా ఆయన నిత్యం యోగా చేస్తూ ఎంతో యాక్టీవ్ గా కనిపిస్తున్నారు. యోగా, ఎయిడ్స్‌ వంటి పలు సామాజిక అంశాలపై ఇప్పటికీ రేడియో, టీవీల్లో బుర్ర కథలు వంటివి చెబుతారు. గతంలో న్యూయార్క్‌కు చెందిన ఒక యూనివర్సిటీ వీరస్వామికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తాజాగా ఇగ్నో నుంచి ఎంఏ ఆంత్రోపాలజీ పరీక్షలు రాసిన వీర స్వామి ఫలితాల కోసం వేచిచూస్తున్నారు. మొత్తంగా 80 ఏళ్ల వయస్సులో కూడా చదువుపై ఆయన చూపిస్తున్న ఆసక్తి అందరూ ఫిదా అవుతున్నారు. చదువుకోవాలనే కోరిక ఉండి ఆగిపోయిన వారికి వీరాస్వామి స్పూర్తిగా నిలుస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి