iDreamPost
android-app
ios-app

చదువుపై ఆసక్తితో 70 ఏళ్ల వయసులో..’ఇంటర్‌’ పరీక్షలు!

చాలా మందికి వయస్సు మీద పడిన చదువుపై ఆసక్తి తగ్గదు. తమ విద్యార్హతను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలానే ఇప్పటికే ఎంతో మంది ఐదు పదులు దాటిన వాళ్లు టెన్త్ , ఇంటర్ పరీక్షలు రాస్తు విద్యార్థులకు గట్టి పోటీ ఇస్తున్నారు. అలానే 70 ఏళ్ల వయసులో ఓ పెద్దాయన అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

చాలా మందికి వయస్సు మీద పడిన చదువుపై ఆసక్తి తగ్గదు. తమ విద్యార్హతను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలానే ఇప్పటికే ఎంతో మంది ఐదు పదులు దాటిన వాళ్లు టెన్త్ , ఇంటర్ పరీక్షలు రాస్తు విద్యార్థులకు గట్టి పోటీ ఇస్తున్నారు. అలానే 70 ఏళ్ల వయసులో ఓ పెద్దాయన అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

చదువుపై ఆసక్తితో 70 ఏళ్ల వయసులో..’ఇంటర్‌’ పరీక్షలు!

చాలా మందికి వివిధ అంశాలపై ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా క్రీడలు, చదువు, సంగీతం, ఆర్ట్ వంటి అనేక రకాల అంశాలపై ఆసక్తి ఉంటుంది. అయితే అది వయస్సులో ఉన్నంత వరకు ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత చాలా మందిలో తమ హాబీలను వదిలేస్తుంటారు. అయితే కొందరు మాత్రం వయసు మీద పడిన కూడా తమకు ఆసక్తి ఉన్న అంశాల గురించి వదిలి పెట్టారు. ముఖ్యంగా చదువు విషయంలో చాలా మంది..వయస్సుతో సంబంధం లేకుండా పరీక్షలు రాస్తుంటారు. గతంలో  55 ఏళ్ల ఓ మహిళ పదో తరగతి పరీక్షలు రాసి..చదువుపై తనకు ఉన్న ఆసక్తిని చాటి చెప్పింది. తాజాగా ఓ 70 ఏళ్ల పెద్దాయన కూడా ఇంటర్ పరీక్షలు రాసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ అరుదైన దృశ్యం నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.

నిజామాబాద్‌కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్‌ చదువుకు వయసుతో పని లేదని నిరూపించారు. 78 ఏళ్ల వయసులో ఆయన ఇప్పుడు ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌ పరీక్షలు రాస్తున్నారు. ఆయన బీఎస్ ఎన్ఎల్ లో లైన్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహించారు. 2007లో రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన వ్యక్తిగత పనుల్లో నిమగ్నమయ్యారు. ఆయన ఏడో తరగతి వరకే చదువుకోవడంతో..టెన్త్, ఇంటర్ చదవాలనే కోరిక పుట్టింది. అయితే ఆ కల ఎప్పటి నుంచో ఉన్న కూడా నిరవేర్చుకోవడానికి సరైన సమయం రాలేదు. సరిగ్గా 2007లో తన విధులకు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత ఇంటర్ చదువును ప్రారంభించాడు. ఓపెన్ లో ఇంటర్ చదవడం ప్రారంభించారు.

ఈక్రమంలోనే ,ఈ నెల 25 నుంచి ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఎల్లాగౌడ్ కూడా పరీక్షలకు హాజరు అవుతున్నారు. ఆయన నిజామాబాద్‌ శివారులో బోర్గాం(పీ) కేంద్రంలో పరీక్షలు రాస్తున్నారు. శనివారం రోజున తన కుమారుడితో పరీక్ష కేంద్రానికి వచ్చాడు. చిన్నపిల్లల మాదిరిగా పరీక్ష ప్యాడ్, హాల్ టికెట్ తీసుకుని రావడంతో అందర ఆశ్చర్యంగా చూడటమే కాకుండా.. ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యానని తెలిపారు. తాజాగా ఇప్పుడు ఇంటర్‌ పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు.

చిన్నప్పుడు ఏడో తరగతి వరకు చదువుకున్నానని, అనివార్య కారణాలతో చదువును మానేశానని చెప్పారు. అనంతరం పెళ్లి,  జాబ్, కుటుంబ బాధ్యతలతో తీరిక ఉండేది కాదని తెలిపారు. అయినా కూడా తన మనసులో చదువుకోవాలనే కోరిక బలంగా ఉండేదని తెలిపారు. అందుకే రిటైర్మెంట్ తరువాత ఓపెన్‌ స్కూల్‌ విధానం ఎంచుకున్నానని ఎల్లాగౌడ్ చెప్పారు. మరి..70 ఏళ్ల వయస్సులో కూడా చదువుపై ఆసక్తి చూపిస్తున్న ఈ పెద్దాయనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.