Arjun Suravaram
TS 10th Class Result-2024: మంగళవారం ఉదయం 11 గంటలకు పదో తరగతి 2024 ఫలితాలు విడుదలయ్యా. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్‌లో పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 6 స్కూల్స్ లో అందరు ఫెయిల్ అయ్యారు.
TS 10th Class Result-2024: మంగళవారం ఉదయం 11 గంటలకు పదో తరగతి 2024 ఫలితాలు విడుదలయ్యా. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్‌లో పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 6 స్కూల్స్ లో అందరు ఫెయిల్ అయ్యారు.
Arjun Suravaram
ఇటీవలే ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. వారి ఎదురు చూపులకు తెరదీస్తూ.. తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. మంగళవారం ఉదయం 11 గంటలు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఇక ఈ పరీక్ష ఫలితాల్లో 6 స్కూళ్లలో అందరూ ఫెయిల్ అయ్యారు.
మంగళవారం ఉదయం 11 గంటలకు పదో తరగతి 2024 ఫలితాలు విడుదలయ్యా. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్‌లో పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాదికి 5 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. వీరంతా టెన్త్ ఫలితాల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 13 నాటికి ముగిసింది. ఈ క్రమంలనే తాజాగా ఫలితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు.
తాజాగా విడుదలైన తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో బాలకలే పైచేయి సాధించారు. ఇంటర్ ఫలితాల మాదిరిగానే ఎస్ఎస్ఎస్సీ ఫలితాల్లోక డా అమ్మాయిలే తమ సత్తా చాటారు. 2024 పది ఫలితాల్లో అబ్బాయిలు 89.41శాతం.. అమ్మాయిలు 92శాతం ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి ఫలితాల్లో.. నిర్మల్ జిల్లా 99.06 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. అలానే వికారాబాద్ అత్యల్పంగా 66 శాతం ఫలితాలను సాధించింది. మొత్తంగా ఉత్తీర్ణతలో 91శాతం ఉత్తీర్ణత సాధించినట్టు చెప్పారు. ఈ టెన్త్ ఫలితాల్లో 6 స్కూళ్లలో జీరో పాస్ పర్సంటేజ్ నమోదైందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
ఇందులో ప్రైవేటు పాఠశాలు ఉండటం గమన్హారం. 2 ఎయిడెడ్ స్కూళ్లు ఉన్నాయని తెలిపారు. అలానే ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా జీరో పాస్ పర్సంటేజ్ లో లేదని ఆయన వెల్లడించారు. ఇక 3927 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత నమోదైందని, ఇందులో 1347 జెడ్పీ పాఠశాలలు ఉన్నాయి. వంద శాతం ఉత్తీర్ణత నమోదు అయిన పాఠశాలల్లో.. జిల్లా పరిషత్ 1347, ప్రభుత్వ 37, ప్రైవేట్ పాఠశాలలు 1814 ఉన్నాయి. అలానే కేజీవీబీ పాఠశాలలు, మోడల్ స్కూల్స్ లలో కూడా 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 98.71 శాతంతో అత్యధికంగా ఉత్తీర్ణత పొందాయి. ఇక 8,883 మంది విద్యార్థులకు 10/10 జీపీఏ సాధించారనే ఆయన పేర్కొన్నారు. గతేడాది 25 పాఠశాలల్లో జీరో ఉత్తీర్ణత శాతం నమోదు కాగా.. ఈ సారి మాత్రం 6 స్కూల్స్‌లో మాత్రమే సున్నా ఉత్తీర్ణత శాతం వచ్చింది. ఆరు స్కూల్స్, అందులోనూ 4 ప్రైవేటు స్కూల్స్ జీరో పర్సంటేజ్ పాస్ కావడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.