iDreamPost
android-app
ios-app

తెలంగాణలో మరోసారి భారీగా IASల బదిలీలు.. అమ్రపాలికి కీలక పోస్టు!

Telangana: ప్రభుత్వ అధికారుల బదిలీలు అనేది సర్వసాధారణంగా జరిగేది. అయితే కొన్నిసార్లు భారీగా ఐఏఎస్,ఐపీఎస్ ల బదిలీలు జరుగుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో పోస్టింగ్స్ విషయంలో అనేక సంచలన, ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి.

Telangana: ప్రభుత్వ అధికారుల బదిలీలు అనేది సర్వసాధారణంగా జరిగేది. అయితే కొన్నిసార్లు భారీగా ఐఏఎస్,ఐపీఎస్ ల బదిలీలు జరుగుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో పోస్టింగ్స్ విషయంలో అనేక సంచలన, ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి.

తెలంగాణలో మరోసారి భారీగా IASల బదిలీలు.. అమ్రపాలికి కీలక పోస్టు!

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు అధికారుల బదిలీలు జరిగాయి. అలానే తెలంగాణలో భారీగా ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీ జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి 22 ఐఏఎస్ ల బదిలీలు జరగడం ఇదే తొలిసారి. తాజాగా మరోసారి భారీగా ఐఏఎస్ లను తెలంగాణ సర్కార్ బదిలీ చేసింది. ఈ నేపథ్యంలోనే హెచ్ఎండీఏ ఎండీగా ఉన్న అమ్రపాలికి కీలక పోస్టు వచ్చింది.  మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

కొన్ని రోజుల క్రితం  తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగిన సంగతి తెలిసింది. మొత్తం 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాలకు నూతన కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా 20 ఐఏఎస్ అధికారుల బదిలీలతో ఆయా జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమాకం జరిగింది. ఇది ఇలా ఉంటే.. తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈసారి మరో 22 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది.

ప్రస్తుతం హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రాస్ ను మరో పోస్టుకు బదిలీ చేసింది. ఇక ఆయన స్థానంలో అమ్రపాలిని హైదరబాద్ కమిషనర్ గా నియమించింది. ప్రస్తుతం ఆమె హెచ్ఎండీఏ ఎండీగా విధులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా 44 మంది ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బల్దియా కమిషనర్ గా ఉన్న రోనాల్డ్ రాస్ ను ట్రాన్స్ కో సీఎండీగా నియమించింది. అలానే సందీప్ కుమార్ సుల్తానియాను ఆర్థిక  శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అలానే పర్యాటక, క్రీడల డైరెక్టర్‌గా వాణిప్రసాద్, దేవాదాయ కమిషనర్‌గా శైలజా రామయ్యర్‌ నియమించారు.

అదే విధంగా జలమండలి ఎండీగా అశోక్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వూలు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 20 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ అధికారుల బదిలీలు అనేది సర్వసాధారణంగా జరిగేది. అయితే కొన్నిసార్లు భారీగా ఐఏఎస్,ఐపీఎస్ ల బదిలీలు జరుగుతుంటాయి. మరికొన్ని సందర్భాల్లో పోస్టింగ్స్ విషయంలో అనేక సంచలన, ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇలా  భారీగా  ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి