Arjun Suravaram
40 Poll Officers Suspended: హైదరాబాద్ నగరంలో తరచూ అనేక సంచలన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నెలల క్రితమే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని ఒకేసారి దాదాపు 70 మంది సిబ్బంది బదిలీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఏకంగా 40 మంది ఉద్యోగులసస్పెన్షన్ వేటు పడింది.
40 Poll Officers Suspended: హైదరాబాద్ నగరంలో తరచూ అనేక సంచలన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నెలల క్రితమే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని ఒకేసారి దాదాపు 70 మంది సిబ్బంది బదిలీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఏకంగా 40 మంది ఉద్యోగులసస్పెన్షన్ వేటు పడింది.
Arjun Suravaram
ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో అనేక సంచలన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నెలల క్రితమే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని దాదాపు 70 మంది సిబ్బంది బదిలీ చేస్తూ..సిటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వ్యూల జారీ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ వార్త పెను సంచలనం సృష్టించింది. వివిధ కారణాలను ప్రస్తావిస్తూ..సీపీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బందిని బదిలీ చేశారు. తాజాగా 40 ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. ఈసారి హైదారాబాద్ సిటీ ఎన్నికల అధికారి.. 40 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. మరి.. అందుకు గల కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సమరం మంచి వేడీ మీద ఉంది. మే 13 పొలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ప్రజల్లోకి వెళ్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ కూడా ఎక్కువ స్థానాల్లో గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఇలా అన్ని పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు పోలింగ్ కు ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే వర్క్ ఫ్రమ్ ఓటు, సర్వీస్ ఓట్లు, ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు వేసే ప్రాసెస్ ప్రారంభమైంది. అలానే మే 13న జరగనున్న పోలింగ్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.
ఎన్నికల విధుల్లో పాల్గొన్నే అధికారులకు శిక్షణ తరగతులు ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల విధులకు గైర్హాజరైన 40 మంది పీవో, ఏపీవోలను హైదరాబాద్ ఈవో రోనాల్డ్ రాస్ సస్పెండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలింగ్ విధుల నిర్వహణ డ్యూటీలు, కేటాయించిన వివిధ శాఖలకు చెందిన 40 మంది అధికారులు శిక్షణ తరగతులకు గైర్హాజరయ్యారు. వారికి రిమాండ్ సమాచారం ఇచ్చినా కూడా స్పందన లేదు.
సదరు ఉద్యోగులు ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చిన లేకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం ఉల్లంఘన కింద ఆ 40 మంది సస్పెండ్ చేశారు. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో పొలింగ్ జరగనుంది. నాలుగో విడతలో మే 13న ఈ 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సమయంలో ఏపీలో కూడా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతేడాది తెలంగాణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలోనే కొద్ది నెలల గ్యాప్ లోనే లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు.. ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తొన్నాయి.