P Krishna
పండగులు వచ్చాయాంటే పెద్దల కన్నా పిల్లలు సంతోషంలో ఉంటారు.. ఎందుకంటే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తారని.. హాయిగా ఇంటివద్ద ఆడుకోవచ్చని అనుకుంటారు. కరోనా సమయంలో విద్యావ్యవస్థపై ఎంతో ప్రభావం పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సెలవుల విషయంలో విద్యాసంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
పండగులు వచ్చాయాంటే పెద్దల కన్నా పిల్లలు సంతోషంలో ఉంటారు.. ఎందుకంటే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తారని.. హాయిగా ఇంటివద్ద ఆడుకోవచ్చని అనుకుంటారు. కరోనా సమయంలో విద్యావ్యవస్థపై ఎంతో ప్రభావం పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సెలవుల విషయంలో విద్యాసంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
P Krishna
ఇటీవల విద్యావ్యవస్థ చాలా కఠినంగా ఉంటుంది.. విద్యార్థులకు మంచి ర్యాంకులు రావాలని చిన్నప్పటి నుంచి ప్రాజెక్ట్ వర్కులు, ప్రిపరేషన్స్ కోసం ప్రత్యేక సమయం కేటాయించడం.. ఇలా ఎన్నో రకాలుగా విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు ఇలాంటి కఠిన నిబందనలు అమలు చేస్తేనే మంచి విద్య అందుతుందని అభిప్రాయపడుతున్నారు. కానీ విద్యార్థులు మాత్రం తీవ్ర ఒత్తిడి తట్టుకోలేక ఒక్కరోజు సెలవు దొరికినా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇక పండగల సీజన్ వస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు.. వరుస సెలవులతో రిలాక్స్ అవుతుంటారు. తాజాగా విద్యావ్యస్థకు నాలుగు రోజుల సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.. ఎందుకు అన్న వివరాల్లోకి వెళితే..
విద్యార్థులకు గుడ్ న్యూస్ క్రిస్మస్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మిసనరీ స్కూళ్లకు డిసెంబర్ 22 అంటే నేటి నుంచి 26వ తేదీ సోమవారం వరకు సెలవులు ప్రకటించారు. కొన్ని పాఠశాలలకు డిసెంబర్ 26 (బాక్సిండ్ డే) తేదీల్లో సెలవు ప్రకటించినా, మరికొన్ని స్కూళ్లకు మాత్రం డిసెంబర్ 25 వరకు మాత్రమే సెలవులు ఇచ్చారు. కాకపోతే డిసెంబర్ 26 వ తేదీని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు జాబితాలో చేర్చింది. ఇటీవల తెలంగాణ సర్కార్ 2024 కు సంబంధించిన సెలవుల జాబితా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఈ నెల క్రిస్మస్, బాక్సింగ్ డే సందర్భంగా సెలవు ప్రకటించాయి. డిసెంబర్ 24 ఆదివారం, డిసెంబర్ 25 క్రిస్మస్ పండగ సోమవారం రావడంతో పాఠశాలలు, కాలేజీలకు వరుస సెలవు ప్రకటించారు. దీంతో విద్యార్థులకు కాస్త రిలాక్స్ దొరకడంతో సంతోషంలో ఉన్నారు.
జనవరిలో విద్యాసంస్థలకు సెలవులు రాబోతున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే భోగి, సంక్రాంతి, కనుమ పండుగలతకు కలిపి వరుసగా ఆరు రోజుల సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కాగా, 2024 ఏడాదికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 27 సాదారణ సెలవులు ప్రకటించింది. 24 ఆఫ్షనల్ హాలిడేస్ ను ఇచ్చింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన సాధారణ సెలవుల్లో ఆదివారాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఏపీలో పాఠశాలలకు 25,26 రెండు రోజులు సెలవు ప్రకటించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చలికాలం.. విద్యార్థులకు సెలవులు రావడంతో పట్టణాల్లో ఉన్నవారంతా తమ సొంత ఊళ్లకు వెళ్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.