iDreamPost
android-app
ios-app

ఇతడిపై 277 సైబర్ నేరాల కేసులు..! కన్ను పడితే ఇక అంతే!

  • Published Jan 05, 2024 | 4:40 PM Updated Updated Jan 05, 2024 | 4:40 PM

దేశవ్యాప్తంగా రోజురోజుకి సైబర్ నేరాగాళ్లు భారీగా పేరిగిపోతున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరిని టార్గెట్ చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. వీటిపై ఎన్ని చర్యలు తీసుకుంటున్న ఈ కేటుగాళ్ల అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. తాజాగా భారీ సంఖ్యల్లో అమాయకపు ప్రజలను మోసం చేస్తు ఆరితేరిన ఓ సైబర్ కేటుగాడు పోలీసులు చేతికి చిక్కాడు. అసలు ఏం జరిగిందంటే..

దేశవ్యాప్తంగా రోజురోజుకి సైబర్ నేరాగాళ్లు భారీగా పేరిగిపోతున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరిని టార్గెట్ చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. వీటిపై ఎన్ని చర్యలు తీసుకుంటున్న ఈ కేటుగాళ్ల అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. తాజాగా భారీ సంఖ్యల్లో అమాయకపు ప్రజలను మోసం చేస్తు ఆరితేరిన ఓ సైబర్ కేటుగాడు పోలీసులు చేతికి చిక్కాడు. అసలు ఏం జరిగిందంటే..

  • Published Jan 05, 2024 | 4:40 PMUpdated Jan 05, 2024 | 4:40 PM
ఇతడిపై 277 సైబర్ నేరాల కేసులు..! కన్ను పడితే ఇక అంతే!

దేశంలో రోజురోజుకి సైబర్ నేరాగాళ్లు సంఖ్య భారీగా పెరుగుతుంది. దీనిపై అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్న ఈ సైబర్ కేటుగాళ్లు అగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అటు సామాన్యులనే కాకుండా ప్రముఖులు, ఐపిఎస్ లను కూడా టార్గెట్ చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలిజీ సాయంతో వీరు చేసే మోసాలు మితిమీరుతున్నాయి. సైబర్ నేరగాళ్ల వలలో బాధితులు ఎక్కువ అయిపోతున్నారు. ఏ పోలీస్ స్టేషన్లలో చూసిన సైబర్ నేరాలకు సంబంధించిన కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా అమాయకపు ప్రజలను మోసం చేస్తు ఆరితేరిన ఓ సైబర్ కేటుగాడు పోలీసులు చేతికి చిక్కాడు. అసలు ఏం జరిగిందంటే..

ఇప్పటికే దేశంలో సైబర్ కేటుగాళ్ల హవా ఎక్కువగా నడుస్తోంది. వివిధ రకాలుగా మోసాలకు పాల్పడుతూ.. అమాయకపు ప్రజల భారీగా డబ్బులు గుంజుతున్నారు. అలాగే చదువుకున్నవారు ప్రముఖులు సైతం సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా.దేశంలో సైబర్ నేరాల్లో ఆరితేరిన ఓ కేటుగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే అతడు అనేక సైబర్ నేరాల్లో నిందితుడిగా ఉంటూ అరెస్ట్ అయ్యి చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జేపీ నగర్ కు చెందిన జితేందర్ సింగ్ అనే 30 ఏళ్ల వ్యక్తి అమాయక ప్రజల్ని అధిక మొత్తంలో డబ్బు ఆశ చూపిస్తూ మాయ చేసేవాడు. వివిధ రకాల జాబ్స్, లోన్స్, ఆన్ లైన్ గేమ్స్ అంటూ సైబర్ మోసాలకు పాల్పడి కోట్లాది రూపాయలు బురిడి కొట్టాడు. ఈ నేరాలకు పాల్పడటానికి ఆ కేటుగాడు 60 మొబైల్ ఫోన్లు, 63 సిమ్ములు, 13 బ్యాంక్ అకౌంట్లని వినియోగించి మరి ప్రజల వద్ద డబ్బును కొల్లగొట్టాడు. జనాలు కూడా జితేంద్ర సింగ్ మాయ చేస్తున్నడని తెలియక ఈజీగా డబ్బులు వస్తున్నాయని ఆశపడి అతడి చేతిలో మోసపోయారు. కాగా, జితేంద్రకు సంగారెడ్డి జిల్లాలో ఎక్కువ కేసులు ఉండటంతో అక్కడ కోర్టులో హాజారు పరిచి తిరిగి చర్లపల్లి జైలుకు తరలించారు.

ఇప్పటి వరకు జితేంద్ర దేశవ్యాప్తంగా 277 సైబర్ నేరాల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అలాగే తెలంగాణలో మరో 84 కేసుల్లో నిందితుడిగా ఉండగా.. సంగారెడ్డి జిల్లాలో బీడీఎల్ భానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, అమీన్ పూర్ పరిధిలో రెండు, గుమ్మడిదల పరిధిలో ఒకటి ఇలా మొత్తం ఐదు సైబర్ కేసుల్లో ఈ కేటుగాడు నిందితుడుగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే దేశంలో సైబర్ నేరాలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేరాలు మాత్రం ఆగడం లేదు.

కాగా, ఈ సైబర్ నేరాలు నమోదైయ్యే జాబితాలో చూస్తే.. 2021లో 32 సైబర్ కేసులు నమోదుకాగా అది కాస్తా 2023లో 323 కు చేరింది. అనగా.. ఈ రెండేళ్లలో పదింతలు కేసులు పెరుగుతునే ఉన్నాయి. అయితే అత్యాశతో ఈజీమనీకి ఆశపడి ఉన్న డబ్బు అంతా పొగుట్టుకోవద్దని పోలీసులు పదే పదే సూచిస్తున్నారు. ఎవరైనా సైబర్‌ మోసాలకు బారిన పడితే వెంటనే బాధితుకలు ‘1930’ నంబరు కాల్‌చేసి ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. అలాగే అనుమానస్పద లింక్‌లు, మెసేజ్‌లో ఓపెన్ చేయవద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు. మరి, భారీ స్థాయిలో సైబర్ నేరలకు పాల్పడిన ఈ కేటుగాడి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.