iDreamPost
android-app
ios-app

దారుణం.. ఎండ దెబ్బకు 2 టన్నుల చేపలు మృత్యువాత!

ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం ఎండలు అదరగొడుతున్నాయి. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఈ భానుడి ప్రతాపాన్ని జనాలతో పాటు మూగ జీవాలు అల్లాడిపోతున్నాయి.

ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం ఎండలు అదరగొడుతున్నాయి. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఈ భానుడి ప్రతాపాన్ని జనాలతో పాటు మూగ జీవాలు అల్లాడిపోతున్నాయి.

దారుణం.. ఎండ దెబ్బకు 2 టన్నుల చేపలు మృత్యువాత!

ప్రస్తుతంఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు మండే అగ్నిగోళాన్ని తలపిస్తున్నాయి. ఉదయం 8 నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జనాలు భయంతో వణికిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైవుతున్నాయి. ఇక ఈ భానుడి ప్రతాపాన్ని జనాలతో పాటు మూగ జీవాలు అల్లాడిపోతున్నాయి. అంతేకాక  మనుషులతో పాటు జీవాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. తాజాగా వడదెబ్బ కారణంగా ఓ దారుణం చోటుచేసుకుంది. ఎండల తీవ్రకు వందల చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన  రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఎప్పుడు లేని విధంగా ఈ సారి ఎండలు అదరగొడుతున్నాయి. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఈ ఎండల ధాటికి భూమి కాలిపోతుందా అనే సందేహం వ్యక్తమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత్తలు నమోదు అవుతున్నాయి. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంటి నుంచి కాలు బయట పెట్టేందుకు జనం భయపడుతున్నారు. ఇదే సమయంలో ఎండల తీవ్రతకు, వడదెబ్బ కారణంగా పదుల సంఖ్యలో జనాలు మరణిస్తున్నారు. పలువురు వడదెబ్బకు గురై..మంచాన పడుతున్నారు. ఇక అనేక ప్రాంతాల్లో నీళ్లు లేక జనం అల్లాడిపోతున్నారు. ఇక మూగ జీవాల ఆవేదన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాహం వేసిన అడగలేని స్థితిలో అవి ఉంటాయి. ఎక్కడ నీరు దొరుకుతుందా అని చూస్తూ వెళ్తుంటారు. చివరకు కొన్ని జీవాలు దాహంతో మరణిస్తున్నాయి. అలానే ఎండల వేడికి తట్టుకోలేక అనేక జీవాలు మృతి చెందుతున్నాయి.

తాజాగా తెలంగాణ రాష్ట్రం  రంగారెడ్డి జిల్లాలో వడదెబ్బకు 2 టన్నుల చేపలు మృతి చెందాయి. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలో  ఎండతీవ్రతకు, వడదెబ్బ కారణంగా రెండు టన్నుల చేపలు మరణించాయి. దీంతో వాటిని సాగు చేస్తున్న అక్కడి కుటుంబాలు తీవ్ర వేదనకు గురయ్యారు. ఈ చెరువుపై  ఆధారపడి రెండు వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఎండల తీవ్రతకు నీటి కొరత ఏర్పడిందని, అయినా చేపలను బతికించుకోవడం కోసం కష్టపడి నీటిని ఏర్పాటు చేశామని బాధితులు తెలిపారు. అయినా లాభం లేకుండా పోయిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఆ చెరువులు చేపలు మృతి చెంది..కుప్పలుగా బయటకు తేలియాడుతున్నాయి. ఇలా ఎండల దెబ్బకు అనేక ప్రాంతాల్లో మూగజీవాలు, కోళ్లు వంటివి కూడా  మృత్యువాత పడుతున్నాయి.