iDreamPost
android-app
ios-app

తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల!

  • Published Feb 26, 2024 | 7:33 PM Updated Updated Feb 26, 2024 | 7:33 PM

TS SSC Time Table 2024 Released: తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సందడి మొదలైంది.. ఈ క్రమంలోనే పదోతరగతి పరీక్షలకు విద్యార్థులు, అధికారులు సిద్దమవుతున్నారు.

TS SSC Time Table 2024 Released: తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సందడి మొదలైంది.. ఈ క్రమంలోనే పదోతరగతి పరీక్షలకు విద్యార్థులు, అధికారులు సిద్దమవుతున్నారు.

తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల!

తెలంగాణలో పదీ, ఇంటర్ పరీక్షలకు విద్యార్థులు, అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28 ఇంటర్ పరీక్షలు మొదలవుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరీక్షల విషయంలో ఎలాంటి అవకతవకలు లేకుండా, లీకేజీల్ లేకుండా పకడ్భందీగా వ్యవహరించాలని అధికారులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల్లోల రిజల్ట్స్ వచ్చేలా కృషి చేస్తున్నారు. తాజాగా పదవ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేశారు అధికారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో పదవ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు సమీపిస్తున్న సమయంలో పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో 40 రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.. ఇందులో భాగంగా ఉదయం, సాయంత్రం విద్యార్థులకు స్టడీ అవర్స్ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. వివిధ రకాల పరీక్షలు నిర్వహించి వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు తీసుకుంటున్నారు. ఈ సారి తెలంగాణలో పదవ తరగతిలో మంచి ఉత్తీర్ణత శాతం తీసుకు వచ్చేందుకు అధికారలు గట్టి పట్టుమీదే ఉన్నారు.  తాజాగా పదవ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ సోమవారం అధికారులు రిలీజ్ చేశారు.

ఇక టెన్త్ పరీక్షల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 21న థార్డ్ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. 23న గణితం, 26న ఫిజికల్ సైన్స్, 28న బయోలాజికల్ సైన్స్, 30న సాంఘిక శాస్త్రం, ఏప్రిల్ 1, 4న సంస్కృతం, అరబిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక పరీక్షలకు హాజరు కావాల్సిన సమయం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నారు. పదవ తరగతి విద్యార్థులు ఆలస్యం నిర్ధారించిన సమయానికి హాజరు కావాలని.. ఆలస్యం కాకుండా చూసుకోవాలని అధికారులు తెలిపారు. విద్యార్థులూ.. పరీక్షలకు బాగా ప్రిపేర్ అయి మంచి ఉత్తీర్ణత సాధించేందుకు సిద్దం కండి.