iDreamPost
android-app
ios-app

తెలంగాణ వరదలు.. మానవత్వం చాటుకున్న పదో తరగతి అమ్మాయి!

Telangana Floods: ఇటీవల కురిసిన వానలకు తెలంగాణ రాష్ట్రం అల్లాడిపోయింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలపై ఈ వరద ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ క్రమంలో వరద బాధితుల విషయంలో పదో తరగతి విద్యార్థిని తన మంచి మనస్సును చాటుకుంది.

Telangana Floods: ఇటీవల కురిసిన వానలకు తెలంగాణ రాష్ట్రం అల్లాడిపోయింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలపై ఈ వరద ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ క్రమంలో వరద బాధితుల విషయంలో పదో తరగతి విద్యార్థిని తన మంచి మనస్సును చాటుకుంది.

తెలంగాణ వరదలు.. మానవత్వం చాటుకున్న పదో తరగతి అమ్మాయి!

గతకొన్ని రోజులుగా కురిసిన వానలకు తెలంగాణ రాష్ట్రం అల్లాడిపోయింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలపై ఈ వరద ప్రభావం ఎక్కువగా కనిపించింది. మున్నేరు నది ఉద్దృతంగా ప్రవహించడంతో  ఈ రెండు జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లు నీట మునిగాయి. భారీగా ఆర్థిక నష్టం జరిగింది. చాలా మంది వరద కారణంగా సర్వం కోల్పోయారు. ఈ క్రమంలో వరద బాధితులకు పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం చేశారు. అంతేకాక ఇంకా  పలువురు ప్రముఖులు కూడా ఆర్థిక సాయం చేశారు. ఇదే సమయంలో పదో తరగతి చదువుకుంటున్న విద్యార్థిని చేసిన పని అందరిని ఆకట్టుకుంది. అంతేకాక ఆ పాప చేసిన పనికి.. ఆమె ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ అమ్మాయిను అభినందించారు. ఆ పాప ఏమి చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం…

మహబూబాబాద్ జిల్లాకు చెందిన ముత్యాల సాయి సింధు అనే యువతి పదో తరగతి చదువుతుంది. ఇటీవల కురిసిన వానలను ఆ యువతి కళ్లారా చూసింది. ఎంతో మంది తిండి, గుడ్డ, గూడు లేక అల్లాడిపోవడం సింధూను కలచి వేసింది. తన వంతుగా సాయం చేయాలని భావించింది. ఈ క్రమంలో అతి చిన్న వయస్సులోనే సింధూ గొప్ప మనసు చాటుచుకుంది. తాను దాచుకున్న డబ్బులను వరద బాధితుల కోసం  విరాళంగా ఇచ్చింది. తన కిట్టీ బ్యాంకు నుంచి రూ.3 వేలను వరద బాధితుల కోసం సీఎం రేవంత్ రెడ్డికి అందించింది. దీంతో సింధును సీఎం ప్రత్యేకంగాఅభినందించారు. ఇది చిన్న సాయమే అయినా సింధుది గొప్ప మనసంటూ నెటిజన్లు  సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు.

ఇప్పటికే వరద బాధితులకు సినీ హీరోలు ఆర్థిక సాయం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం సహాయనిధికి రూ.50 లక్షలు ఇచ్చాడు. అలానే నందరమూరి బాలకృష్ట కూడా సీఎం సహాయనిధికి రూ.50 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. వీరి బాటలోనే సిద్దు జొన్నలగడ్డ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.30 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మరో యంగ్ హీరో, మాస్​ కా దాస్ విశ్వక్​సేన్ ఏపీ, తెలంగాణకు రూ.5 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్​, స్టార్ ప్రొడ్యూసర్స్ సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), సూర్యదేవర నాగవంశీ కలసి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్​కు రూ.25 లక్షలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్​కు రూ.25 లక్షలు ఇస్తున్నట్లు ఓ ప్రకనటలో వెల్లడించారు. ఇలాంటి వారి మధ్యలో సింధు కూడా తనకు చేతనైనంత ఆర్థిక సాయం చేసి..గొప్ప మనస్సు చాటుకుంది. మరి.. ఈ  అమ్మాయి చేసిన గొప్ప పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.