iDreamPost
android-app
ios-app

రోడ్డుపై శంషాబాద్ KGBV ఆడబిడ్డల ధర్నా…ఒకేసారి 10 మందిపై బదిలీ వేటు!

Palamakula KGBV School: తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థునులు రోడ్డెక్కారు. తమకు న్యాయం కావాలంటూ ఆందోళన చేశారు. ఫలితంగా ఒకేసారి పది మందిపై బదిలీ వేటు పడింది. మరి.. ఎక్కడ జరిగిందంటే..

Palamakula KGBV School: తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థునులు రోడ్డెక్కారు. తమకు న్యాయం కావాలంటూ ఆందోళన చేశారు. ఫలితంగా ఒకేసారి పది మందిపై బదిలీ వేటు పడింది. మరి.. ఎక్కడ జరిగిందంటే..

రోడ్డుపై శంషాబాద్ KGBV ఆడబిడ్డల ధర్నా…ఒకేసారి 10 మందిపై బదిలీ వేటు!

ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోరాడితే ఫలితం అనేది కచ్చితంగా లభిస్తుంది. అయితే తమ సమస్యలపై గళం విప్పి తెగు, ధైర్యం అందరిలో ఉండాలి. అలా ఎంతో మంది మహిళలు, యువతలు, విద్యార్థులను తరచూ వివిధ సమస్యలపై పోరాటం చేస్తుంటారు. ఈ క్రమంలో వారి ఆవేదనను అర్థం చేసుకుని ప్రభుత్వాలు పరిష్కారా మార్గాలు చూపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా  శంషాబాద్ లో చోటుచేసుకుంది. పాలమాకులలోని కస్తూర్బగాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థునులు ధర్నా చేశారు. ఈ ప్రభావంతో అక్కడ పని చేస్తున్న 10 మంది పై వేటు పడింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మడంలంలోని పాలమాకులలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం ఉంది. అక్కడ అనేక మంది ఆడపిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. ఇటీవలే హాస్టల్ లో పురుగలుల అన్నం పెడుతున్నారని, అడిగితే టీచర్లు వేధిస్తున్నారంటూ విద్యార్థినులు రోడ్డుపై ఆందోళన చేశారు.ఉపాధ్యాయుల వేధింపులను భరించలేకపోతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా హాస్టల్లో పెట్టే అన్నం సాంబార్ టిఫిన్లలో పురుగులు వస్తున్నాయని అక్కడి విద్యార్థునులు తెలిపారు. మినరల్ వాటర్ కి బదులు బోరు వాటర్ ఇస్తున్నారని  తెలిపారు. తమ సమస్య పరిష్కరించకపోగా.. ఇంకా వేధిస్తున్నారంటూ న్యాయం కోసం రోడ్డెక్కమని విద్యార్థునులు తెలిపారు. ఇక విద్యార్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు ఇటీవలే ఆ పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులతో కలిసి భోజనం చేసి.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాక విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహించిన ఎవరిని వదలమని తెలిపారు. ఈ ఇష్యుపై ప్రత్యేక కమిటీ వేసి.. నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈక్రమంలో తాజాగా పాలమాకుల కేజీబీవీ లో పని చేస్తున్న 10 మందిపై  బదీలీ వేటు పడింది. దీంతో తమ సమస్యలపై గళం విప్పి జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన కేజీబీవీ విద్యార్థినులకు ఊరట లభించినట్లు  అయింది. పాలమాకుల కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో పని చేస్తున్న పదిమందిని ఒకేసారి బదిలీ చేశారు. వీరిలో బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు. పాఠశాల ఎస్ఓతో పాటు ఉపాధ్యాయులను వేరే చోట్లకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వూలు జారీ అయ్యాయి. వీరి స్థానంలో కొత్త వారిని నిలయమించారు. మొత్తంగా ఆడబిడ్డలు ధర్నా చేయడంతో ఒకే సారి పదిమందిపై బదిలీ వేటు పడింది. ఇకనైన తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని విద్యార్థునులు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.