iDreamPost

ప్రపంచంలోనే మొట్ట మొదటి AI స్మార్ట్ కళ్ళజోడు.. ఇకపై అన్నీ ఇందులోనే!

World's 1st AI Smart Glasses: టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోతుంది. ఇంట్లో కూర్చుని కంప్యూటర్ లో ఆపరేట్ చేసేవి కూడా స్మార్ట్ ఫోన్ లో ఆపరేట్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కళ్ళజోడుతోనే స్మార్ట్ ఫోన్ లో చేసుకునే పనులు చేసుకునేలా కొత్త పరికరాన్ని తీసుకొచ్చిందో కంపెనీ.

World's 1st AI Smart Glasses: టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోతుంది. ఇంట్లో కూర్చుని కంప్యూటర్ లో ఆపరేట్ చేసేవి కూడా స్మార్ట్ ఫోన్ లో ఆపరేట్ చేసే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కళ్ళజోడుతోనే స్మార్ట్ ఫోన్ లో చేసుకునే పనులు చేసుకునేలా కొత్త పరికరాన్ని తీసుకొచ్చిందో కంపెనీ.

ప్రపంచంలోనే మొట్ట మొదటి AI స్మార్ట్ కళ్ళజోడు.. ఇకపై అన్నీ ఇందులోనే!

ఒకప్పుడు ఒక రూమ్ సైజు కంప్యూటర్ నుండి, చిన్న టేబుల్ మీద సరిపోయే డెస్క్ టాప్ కి వచ్చాం. ఆ తర్వాత ఒళ్లో పెట్టుకునే లాప్టాప్ కి వచ్చాం. కానీ ఇప్పుడు రోజులతో పాటు టెక్నాలజీ కూడా స్పీడ్ గా మారిపోతుంది. మన పనులని ఇంకా ఈజీ చేసేలా ఇప్పుడు ఒక కొత్త స్మార్ట్ కళ్ళజోడుని తీసుకుని వచ్చారు. ఇందులో దాదాపుగా మన ఫోన్ లో, అలానే ఒక ట్యాబ్ లో చేసుకునే అన్ని పనులు చేసుకోవచ్చు, పైగా ఈ కళ్ళజోడులో AI కూడా ఉంది. ఒకప్పుడు మనం చూసే సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కళ్ళజోడులోనే అన్ని పనులు చేసేస్తారు, కానీ అదంతా సినిమా క్రియేషన్. ఇప్పుడు అదే టెక్నాలజీని నిజం చేశారు హాంకాంగ్ కంపెనీ వారు. ‘సోలోస్ ఎయిర్ గో విజన్ స్మార్ట్ గ్లాసెస్ ని లాంచ్ చేశారు. ఇందులో ఆడియో స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి.

అలాగే ప్రపంచంలోనే మొట్ట మొదటి AI పోవర్డ్ గ్లాసెస్ ఇవి. అలాగే కంప్యూటర్ విజన్ కలిగి ఉన్న గ్లాసెస్ కూడా ఇవి. ఇందులో GPT-4o లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇన్ బిల్ట్ అయ్యి ఉంది. ఈ గ్లాస్సెస్ గూగుల్ జెమినీతో, యాన్త్రోపిక్స్ క్లోడీ AIతో కూడా వర్క్ చెయ్యగలదు.  గూగుల్  ప్రకారం ఈ సోలోస్ ఎయిర్ గో విజన్ అనేది ప్రపంచంలోనే మొట్ట మొదటి కెమెరాతో ఉన్న AI గ్లాసెస్. ఇది ఈ జూలై నెలలోనే లాంచ్ కాబోతుంది. ఈ కళ్ళజోడుకి కెమెరా ఉండడం వలన, మనం ఎక్కడ ఉన్నా కూడా మన కళ్ళ ముందు కనిపించిన వాటిని ఫోటో తీసుకుని, వెంటనే AI హెల్ప్ తో ఆ ఫోటో యొక్క  పూర్తి ఇన్ఫర్మేషన్ ని తీసుకోవచ్చు.

అలాగే ఈ కెమెరా ద్వారా వీడియోస్ కూడా రికార్డు చేసుకోవచ్చు.. అలాగే ఈ కళ్ళజోడే మనకి గూగుల్ మాప్స్ లాగా అన్ని దారులు చూపిస్తుంది. వంట చేసుకున్నేప్పుడు రెసిపీస్ చెప్తుంది, చూపిస్తుంది. అలానే చదువుకునేప్పుడు ఒక టీచర్ లాగా మన డౌట్స్ ని క్లియర్ చేస్తుంది. షాపింగ్ చేసేటప్పుడు ఆ ప్రొడక్ట్స్ గురించి పూర్తి వివరాలు మనకి అందిస్తుంది.  ఈ కెమెరాతో పాటు చిన్న LED లైట్ ఇంకా స్పీకర్ కూడా ఈ గ్లాసెస్ కి ఉన్నాయి. దీనికి రకరకాల ఫ్రేమ్స్ ని కూడా మార్చుకోవచ్చు. దీని ధర సుమారు 20,850/- రూపాయలు ఉంటుంది అని అంచనా. అలాగే ఇందులో ఉన్న ఇంకో వేరియంట్ రే బాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ కూడా 24,900/-  రూపాయలు వరకు ఉంటుందని విశ్లేషకుల అంచనా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి