iDreamPost
android-app
ios-app

మీ AI టెక్నాలజీపై అవగాహన ఉందా? ఏకంగా రూ.4 లక్షలు గెలుచుకునే అవకాశం!

Miss AI Beauty: ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా AI అందాల పోటీలు జరగనున్నాయి. కంప్యూటర్ నుంచి క్రియేట్ చేసిన మోడళ్లను ప్రదర్శించనున్నారు. విజేతకు ప్రైజ్ మనీ కూడా ఎంత అనేది నిర్ణయించబడింది. మరి..ఈ పోటీ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Miss AI Beauty: ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా AI అందాల పోటీలు జరగనున్నాయి. కంప్యూటర్ నుంచి క్రియేట్ చేసిన మోడళ్లను ప్రదర్శించనున్నారు. విజేతకు ప్రైజ్ మనీ కూడా ఎంత అనేది నిర్ణయించబడింది. మరి..ఈ పోటీ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మీ AI టెక్నాలజీపై అవగాహన ఉందా? ఏకంగా  రూ.4 లక్షలు గెలుచుకునే అవకాశం!

డబ్బులను సంపాదేంచేందుకు అనేక రకాల మార్గాలు ఉంటాయి. కొందరు  ఏళ్ల తరబడి కష్టపడుతుంటే, మరికొందరు మాత్రం షార్ట్ రూట్ లో డబ్బులను పొందే మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇదే సమయంలో కొన్ని కొన్ని పోటీల ద్వారా లక్షల్లు పొందే అవకాశాలు వస్తుంటాయి. అలా లక్షలు, కోట్లు పొందిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా మీరు కూడా 4 లక్షలు పొందే ఛాన్స్ వచ్చింది. మీకు ఆర్టిఫియల్ టెక్నాలజీపై అవగాహన ఉంటే 4 లక్షలు పొందే అవకాశం మీకు ఉంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఇప్పటి వరకు మనం విశ్వసుందరి, ప్రపంచ సుందరి వంటి వివిధ పోటీలు మాత్రమే చూశాం. ఈ పోటీల్లో ఎంతో మంది యువతులు పాల్గొన్ని తమ అందాలతో ఆకట్టుకుంటారు. ఇప్పటికే ఎంతో మంది విజేతలుగా నిలిచి గుర్తింపు పొందారు.  అయితే తొలిసారిగా ఏఐ బ్యూటీ పోటీలు జరగనున్నాయి. ఏఐ బ్యూటీల పోటీ ఏంటి అనే సందేహం మీకు రావచ్చు. ఈ అందాల పోటీల్లో కంప్యూటర్ ద్వారా క్రియేట్ చేసిన మోడళ్లను ప్రదర్శించనున్నారు. అంతేకాదు ఈ పోటీలో గెలిచిన వారికి 4 లక్షల రూపాయల ప్రైజ్ మనీతో పాటు మిస్ ఏఐ అనే టైటిల్ ను సైతం అందజేస్తారు. ఈ పోటీలను వరల్డ్  ఏఐ క్రియేటర్ అవార్డ్స్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ పోటీలలో ఏఐ క్రియేటర్ అయినా వాళ్లు పాల్గొనొచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా ఏఐ సాయంతో రూపొందిన మోడల్స్ ప్రదర్శనకు ఈ సంస్థ ఆహ్వానిస్తుంది. ఈ పోటీల్లో పాల్గొనే వారికి మొత్తంగా మొత్తం 20 వేల డాలర్లు బహుమతిగా అందజేయనున్నారు. ఇండియన్ కరెన్సీలో వాటి విలువ దాదాపు రూ.16.70 లక్షలు ఉంటుంది. మిస్  ఏఐ ఎంట్రీలు ఏప్రిల్ 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇక పోటీలు పాల్గొనేందుకు కొన్ని అర్హతలు ఉండాలి. ఏఐ ఆధారిత మోడల్స్ రూపొందించే వారంతా పోటీల్లో పాల్గొనొచ్చు. అంతేకాదు 18 ఏళ్లకు పైబడి ఉండాలి. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

ఈ అందాలో పోటీలతో పాటు ఏఐ ఆధారిత ఫ్యాషన్ కంటెంట్ తో పాటు మేల్ మోడ్సల్‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ఏఐ అవతార్ లో తయారు చేసిన కొన్ని ప్రముఖ టూల్స్  ఓపెన్ ఏఐ దాల్-ఈ, మిడ్ జర్నీ, కోపిలట్ అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మంది యూజర్లు వీటి నుంచి ఏఐ అవతార్‌లను క్రియేట్ చేస్తారు. ప్రాంఫ్ట్ నుంచి రూపొందించబడితన అత్యుత్తమ ఏఐ మోడల్ ప్రపంచంలోనే తొలి మిస్ AIగా ఎంపిక చేయబడుతుంది.

ఇక ఈ పోటీల్లో బ్యూటీ, టెక్నాలజీ అండ్ సోషల్ మీడియా ఐడెంటిటీ అనే మూడు అంశాల ఆధారంగా తుది నిర్ణయం ఉంటుంది. ఏఐ మోడల్ లుక్స్ బ్యూటీ పరంగా డిజైన్, బట్టలు మొదలైనవి కనిపిస్తాయి. ఈ మోడల్ రూపొందించడానికి క్రియేటర్లు ఎలాంటి టూల్స్ అయినా వాడొచ్చు.  ఇక బెస్ట్ ఏఐ మోడల్ ను ఎంపిక చేసేందుకు నలుగురు న్యాయ నిర్ణేతలు ఉంటారు. ఉత్తమ AI మోడల్‌కు 5 వేల డాలర్లును బహుమతిగా మే 10వ తేదీన ప్రకటించనున్నారు. 5 వేల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.4.1 లక్షలు ఉంటుంది.  ఇక  ఏఐ టెక్నాలజీపై అవగాహన, అనుభవం ఉన్నవాళ్లకు చక్కగా నాలుగు లక్షలు గెలుచుకునే మంచి అవకాశం ఇది.