Tirupathi Rao
ఈ స్మార్ట్ యుగంలో స్మార్ట్ ఫోన్ లేని వాళ్లే లేరని చెప్పాలి. స్మార్ట్ ఫోన్ వినియోగం అనేది ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది. అందుకే కంపెనీలు పోటీని తట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ స్మార్ట్ యుగంలో స్మార్ట్ ఫోన్ లేని వాళ్లే లేరని చెప్పాలి. స్మార్ట్ ఫోన్ వినియోగం అనేది ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది. అందుకే కంపెనీలు పోటీని తట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
Tirupathi Rao
స్మార్ట్ ఫోన్ వాడకం ఏ స్థాయిలో పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేకుండా జీవితాన్ని ఊహించుకోలేం అనే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే మార్కెట్ లోకి రోచుకొక కొత్త కంపెనీ స్మార్ట్ ఫోన్లు తయారు చేయడం మొదలు పెడుతోంది. ఇప్పటికే ఉన్న కంపెనీలు భిన్నంగా ఎలాంటి పోన్లు తయారు చేయాలా అని ఆలోచిస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీతో మార్కెట్ లోకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. కొన్ని కొన్ని సరికొత్త ఫీచర్లు కూడా వినియోగదారులను విస్తుపోయేలా చేస్తున్నాయి. అలాంటి ఒక ఫీచర్ గురించే ఇప్పుడు చెప్పుకుందాం.
సాధారణంగా స్మార్ట్ ఫోన్ లో మీరు ఏదైనా యాప్ వాడాలి అంటే వేళ్లతో దాని ఐకాన్ పై టచ్ చేస్తే ఓపెన్ అవుతుంది. లేదంటే ఓకే గూగుల్, హే సిరి వంటి వాయిస్ కమాండ్ కంట్రోల్ ఫీచర్స్ తో ఫోన్ లో యాప్స్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు హానర్ కంపెనీ గురించి తెలిసే ఉంటుంది. హానర్ చాలా తక్కువ ప్రైస్ తో మంచి ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. సాధారణ స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే.. హానర్ కంపెనీ మోడల్స్ కాస్త ధర తక్కువగానే ఉంటాయి. ఇప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో హానర్ మ్యాజిక్ 6 మోడల్ రాబోతోంది. ఈ ఫీచర్స్ విన్నాక మీకు కచ్చితంగా మైండ్ బ్లాక్ అవ్వక మానదు. ఎందుకంటే అలాంటి ఫీచర్స్ తో హానర్ కొత్త ఫోన్ రాబోతోంది మరి.
ఆ ఫీచర్ ఏంటంటే.. మీరు మొబైల్ లో యాప్స్ ని మీ కంటి చూపుతో ఓపెన్ చేయచ్చు. మీ చూపుని బట్టి ఈ హానర్ మ్యాజిక్ 6 ఫోన్ వర్క్ అవతుందని చెబుతున్నారు. ఐ ట్రాకింగ్ అనే సరికొత్త ఫీచర్ తో ఈ స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ఈ ఒక్కటి మాత్రమే కాకుండా ఈ ఫోన్ లో చాలా మ్యాజిక్ ఫీచర్స్ ఉంటాయని చెబుతున్నారు. అలాగే ఈ ఫోన్ రూమర్డ్ ప్రైస్ వచ్చేసి.. రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు ఉండే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నరు. అయితే హానర్ లో ఇంత ప్రైస్ తో ఒక స్మార్ట్ ఫోన్ ని కొంటారా? అని ప్రశ్నిస్తే కష్టమనే చెప్పాలి. ముఖ్యంగా భారతీయ మార్కెట్ లో మాత్రం ఆ ఆస్కారం కచ్చితంగా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఆ ధరకి మంచి ఐఫోన్ వస్తుంది. కాబట్టి ఇండియాలో రిలీజ్ చేస్తే ఈ మోడల్ కు కాస్త నిరాశ తప్పదనే చెప్పాలి. ఇంక ఈ ఫోన్ కి సంబంధించి వినిపిస్తున్న స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా గొప్పగా ఉన్నాయి.