వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక నుంచి ఫోటోలు, వీడియోలు మరింత సులువుగా..

WhatsApp Introduced Album Picker Feature For Users: వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్, ఫీచర్స్ తో యూజర్స్ మంచి యూజర్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది. యూజర్ అభిరుచికి తగ్గట్టు మరింత సౌకర్యంగా ఉండేలా అప్డేట్స్ ని, ఫీచర్స్ ని రూపొందిస్తుంది. తాజాగా వాట్సాప్ మరో కొత్త అప్డేట్ ని తీసుకొచ్చింది.

WhatsApp Introduced Album Picker Feature For Users: వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్, ఫీచర్స్ తో యూజర్స్ మంచి యూజర్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది. యూజర్ అభిరుచికి తగ్గట్టు మరింత సౌకర్యంగా ఉండేలా అప్డేట్స్ ని, ఫీచర్స్ ని రూపొందిస్తుంది. తాజాగా వాట్సాప్ మరో కొత్త అప్డేట్ ని తీసుకొచ్చింది.

వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్స్ కోసం సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే మెటా వాట్సాప్ లో నెట్ లేకున్నా వీడియోలు, ఫోటోలు పక్కనున్న వారికి పంపించుకునే ఫీచర్ ని టెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా ఇప్పుడు వాట్సాప్ యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ లో చాట్ లో ఇమేజెస్ కి క్విక్ రిప్లై ఇవ్వడం కోసం కొత్త ‘రిప్లై బార్’ ఫీచర్ ని తీసుకొస్తుంది. ఈ ఫీచర్ తో యూజర్ వాట్సాప్ చాట్ విండో నుంచి బయటకు వెళ్లకుండా చాట్ సంభాషణలో ఉంటూనే ఇమేజెస్ ని ఎంపిక చేసుకుని మీడియాకి వేగంగా ప్రతి స్పందించవచ్చు. అంటే వాట్సాప్ చాట్ లో ఒక ఇమేజ్ ని పంపించాలంటే కెమెరా ఐకాన్ ని గానీ, పిన్ ఐకాన్ ని గానీ క్లిక్ చేస్తాం. అప్పుడు వాట్సాప్ చాట్ విండో నుంచి బయటకు వస్తే సెపరేట్ గా రీసెంట్స్ అని, గ్యాలరీ అని కనబడతాయి.

దీని వల్ల వాట్సాప్ చాట్ సంభాషణ అనేది కనబడదు. ఇమేజెస్ ని వెతుక్కునే క్రమంలో దేనికి రిప్లై ఇవ్వాలనుకుంటున్నామో అన్న విషయమే మర్చిపోతాం. అయితే వాట్సాప్ ఈ సమస్యకు పరిష్కారంగా ‘రిప్లై బార్’ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొస్తుంది. దీంతో యూజర్ కి ఫోటోలు, వీడియోలు వాట్సాప్ లో ఉంటూనే ఎంపిక చేసుకోవచ్చు. క్విక్ రిప్లైలు ఇచ్చుకోవచ్చు. గ్యాలరీలో పలు ఫోల్డర్ల నుంచి ఈజీగా వీడియోలు, ఫోటోలు వాట్సాప్ చాట్ విండో నుంచి బయటకు వెళ్లకుండా ఎంపిక చేసుకోవచ్చు. అంటే వాట్సాప్ లోనే ఫోటోలు, వీడియోలు సెండ్ చేయడం కోసం కొత్త ఆల్బమ్ పికర్ ఫీచర్ ని మనం చూడచ్చు. ఆండ్రాయిడ్ 2.24.16.5 అప్డేట్ లో ఈ ఫీచర్ ని తీసుకొచ్చింది. ఈ అప్డేట్ ప్రస్తుతం గూగుల్ ప్లేస్టోర్ లో అందుబాటులో ఉంది.

బీటా టెస్టర్లు ఈ ఫీచర్ ని గుర్తించడం ద్వారా.. ఒక ఆల్బమ్ నుంచి మరొక ఆల్బమ్ కి ఈజీగా, వేగంగా స్విచ్ అవ్వచ్చునని తెలిసింది. స్క్రీన్ షాట్ ని గమనిస్తే రీసెంట్స్, వీడియోస్, వాట్సాప్, సీమోర్ అని ఆప్షన్స్ కనబడతాయి. ఒక్కో ఆల్బమ్స్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయనేది కూడా కనబడుతుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్ చాట్ విండోలో ఉంటూనే ఇమేజెస్ అండ్ వీడియోస్ ని పంపించుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ బీటా యూజర్స్ కి అందుబాటులో ఉంది. ఇంకొన్ని వారాల్లో ఇది అందరికీ అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉంటే వాట్సాప్ అమెరికాలో 10 యూజర్స్ మార్క్ ని అందుకుంది. ఈ విషయాన్ని మార్క్ జుకర్ బర్గ్ వాట్సాప్ ఛానల్ ద్వారా వెల్లడించారు.

Show comments