Dharani
యూజర్ల కోసం కొత్త కొత్త అప్‌డేట్స్ తీసుకు వస్తోన్న వాట్సాప్.. తాజాగా మరో అప్‌డేట్ తీసుకువచ్చింది. క్యూఆర్ కోడ్ ఆప్షన్‌తో ఆ సమస్యలకు చెక్ పెట్టడానికి రెడీ అవుతోంది. ఆ వివరాలు..
యూజర్ల కోసం కొత్త కొత్త అప్‌డేట్స్ తీసుకు వస్తోన్న వాట్సాప్.. తాజాగా మరో అప్‌డేట్ తీసుకువచ్చింది. క్యూఆర్ కోడ్ ఆప్షన్‌తో ఆ సమస్యలకు చెక్ పెట్టడానికి రెడీ అవుతోంది. ఆ వివరాలు..
Dharani
వాట్సాప్ అంటే తెలియని వారు నేటి కాలంలో చాలా అరుదు. గ్రామాల్లో ఉన్న వారికి సైతం దీని గురించి తెలుసు. వాట్సాప్ ద్వారా కేవలం మెసేజ్‌లు మాత్రమే కాక ఆడియో, వీడియోలు కూడా సెండ్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఎంత దూరంలో ఉన్న వారికి అయినా సరే వీడియో కాల్స్ చేసి మాట్లాడుకోవచ్చు. నేటి కాలంలో వృత్తిగత, వ్యక్తిగత జీవితాల్లో వాట్సాప్ అనేది తప్పనిసరి అయ్యింది. వినియోగదారులకు మెరుగైన సౌకర్యం కల్పించడం కోసం వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడూ అప్‌డేట్స్‌ని విడుదల చేస్తుంది. ఇప్పటికే వాట్సాప్‌లో మెటా ఏఐని అందుబాటులోకి తీసుకురాగా.. ఇప్పుడు మరో సూపర్ అప్డేట్ అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు..
ఇక వాట్సాప్ తీసుకువచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే.. యూజర్లు నంబర్లు చెప్పకుండానే ఈజీగా కాంటాక్ట్స్‌ను షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్.. ఒక ఆప్షన్‌ను అందిస్తోంది. అదే స్మార్ట్ వాట్సాప్ కాంటాక్ట్ షేరింగ్ ఆప్షన్. దీని సహాయంతో యూజర్లు నంబర్లు చెప్పకుండా.. ఇతరులతో కాంటాక్ట్స్ షేర్ చేసుకోవచ్చు. ఇది యూజర్ల ప్రైవసీని పెంచడంలో సహాయపడుతుంది అంటున్నారు.
ఇక వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్స్ తీసుకు వస్తూ.. యూజర్ల ప్రైవసీకి అధికా ప్రాధాన్యత ఇస్తోంది.