ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. ఈ యాప్‌ను వరల్డ్‌వైడ్‌గా కోట్లాది మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది వాట్సాప్. యూజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నూతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. స్క్రీన్ షేరింగ్, లాక్చాట్తో పాటు మల్టీ డివైజ్ ఫీచర్లను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇక మీదట ఒకే వాట్సాప్ యాప్‌లో రెండు వేర్వేరు ఖాతాలను వినియోగించే వెసులుబాటును కల్పించింది.
ఇప్పటిదాకా ఒక మొబైల్ ఫోన్లో కేవలం ఒకే వాట్సాప్ అకౌంట్‌ను ఉపయోగించడానికి మాత్రమే వాట్సాప్ అనుమతిస్తోంది. ఒకవేళ మరో వాట్సాప్ అకౌంట్‌ను ఉపయోగించాలంటే వేరే మొబైల్ అయినా ఉండాలి. లేదా క్లోన్డ్ వాట్సాప్ యాప్ అయినా వినియోగించాల్సి ఉంటుంది. రెండు వాట్సాప్ అకౌంట్లు ఉపయోగించడం కోసం రెండు ఫోన్లు వాడాలంటే చాలా కష్టం. అలాగని క్లోన్డ్ వాట్సాప్ వెర్షన్ వినియోగిద్దామంటే సెక్యూరిటీ పరమైన చిక్కులు ఎదురవుతాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే వాట్సాప్ ఈ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
కొత్త ఫీచర్ సాయంతో ఒకే వాట్సాప్‌తో రెండు వేర్వేరు అకౌంట్లు ఉపయోగించుకోవచ్చు. ఇది అందుబాటులోకి వచ్చిన వారు తమ వాట్సాప్ అకౌంట్లో క్యూఆర్ కోడ్ ఆప్షన్ దగ్గర ఉన్న ‘యారో’ (బాణం) ఐకాన్ సాయంతో మరో అకౌంట్‌ను యాడ్ చేసుకోవచ్చు. ఇదే ఐకాన్ సాయంతో వేరే అకౌంట్‌కు మారొచ్చు. అప్పుడు యూజర్లు ఒకే ఫోన్లో రెండు వేర్వేరు నంబర్లతో వాట్సాప్ అకౌంట్స్‌ను నిర్వహించే సౌలభ్యాన్ని పొందొచ్చు. ఒక ఖాతాలో ప్రైవేట్ చాట్లు, మరో ఖాతాలో జాబ్ లేదా బిజినెస్‌కు సంబంధించిన సంభాషణలు జరపొచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిందని వాట్సాప్ పేర్కొంది. మరి.. వాట్సాప్ నయా ఫీచర్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.