WhatsApp: మరో రెండు సూపర్ ఫీచర్లతో వచ్చేసిన వాట్సాప్!

WhatsApp: వాట్సాప్ నుంచి ఓ సూపర్ అప్డేట్ వచ్చింది. కొత్త ఫీచర్స్ ను యూజర్ల కోసం తీసుకొచ్చింది.

WhatsApp: వాట్సాప్ నుంచి ఓ సూపర్ అప్డేట్ వచ్చింది. కొత్త ఫీచర్స్ ను యూజర్ల కోసం తీసుకొచ్చింది.

వాట్సాప్ నుంచి ఇప్పటికే అనేక రకాల సూపర్ ఫీచర్స్ వచ్చాయి. ఇంకా వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. తాజాగా వాట్సాప్ నుంచి ఓ సూపర్ అప్డేట్ వచ్చింది.. ఇప్పటికే ఎన్నో ఉపయోగకరమైన ఫీచర్స్ ను ప్రవేశపెట్టిన వాట్సాప్, ఇప్పుడు మరిన్ని ఫీచర్స్ ను అందిస్తున్నట్లు ప్రకటన చేసింది. వాట్సాప్ ఇటీవల తీసుకు వచ్చిన మెటా ఏఐ ఫీచర్ ని మరింత సులభతరంగా ఉపయోగకరంగా మార్చడానికి సిద్ధం అయ్యింది. అందుకు వీలుగా ఈ సరి కొత్త ఫీచర్ ని తీసుకు వస్తుంది. ఇక ఈ ఫీచర్ పేరు ఏంటి? ఇది ఎలా పని చేస్తుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వాట్సాప్ కొత్త వాయిస్ చాట్ మోడ్ ఫీచర్ ను తీసుకు వస్తుందని వెబ్ బీటా ఇన్ఫో తెలిపింది. రాబోయే ఈ ఫీచర్ ను వాట్సాప్ బీటా అప్డేట్ వెర్షన్ 2.24.18.1లో అందిస్తుందని వెబ్ బీటాఇన్ఫో తెలిపింది.ఈ సరికొత్త ఫీచర్ మెటా ఏఐతో కమ్యూనికేట్ చేయడానికి వీలుగా ఉంటుంది. దీని పేరు వాయిస్ చాట్ మోడ్. వాట్సాప్ లోని మెటా ఎఐ ట్యాబ్ లో ఈ ఫీచర్ ఉంటుంది. ఇందులో, మెటా ఎఐలోకి వెళ్ళిన తర్వాత చాట్స్ కి పక్కనే వాయిస్ ఫీచర్ బటన్ ను ఇచ్చింది. ఇక ఈ బటన్ ను నొక్కగానే ఈ వాయిస్ చాట్ మోడ్ ఓపెన్ అవుతుంది. వాట్సాప్ మెటాలో ఇప్పటి దాకా కేవలం చాట్ సెక్షన్ నుండి చాటింగ్ ద్వారా మాత్రమే ఫోటోలు ఇంకా ఇతర వివరాలు పంపుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ తో వాయిస్ సెర్చ్ ద్వారా కూడా ఫోటోలు, ఇతర వివరాలు పంపుకోవచ్చు.

అలాగే మరో ఫీచర్ ని కూడా వాట్సాప్ తీసుకొచ్చింది. అదే GIPHY స్టిక్కర్ సెర్చ్. సాధారణంగా వినియోగదారులకు స్టిక్కర్లని కనుగొనడం కొంచెం టైం పడుతుంది. కానీ ఈ క్రేజీ ఫీచర్‌తో ఆ పని సులభం అవుతుంది. ఈ సూపర్ ఫీచర్ తో మనం ప్లాట్‌ఫారమ్‌లో మంచి స్టిక్కర్‌లను ఈజీగా కనుగొనవచ్చు. మన పర్సనల్ స్టిక్కర్ స్టోర్‌లో అందుబాటులో లేని స్టిక్కర్‌ను పంపించడంలో ఈ ఫీచర్ చాలా బాగా పని చేస్తుంది. ఈ విధంగా వాట్సాప్ ఎప్పటికప్పుడు సూపర్ ఫీచర్లని ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇక వాట్సాప్ ప్రవేశపెట్టిన ఈ సూపర్ ఫీచర్ల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments