iDreamPost
android-app
ios-app

WhatsApp: వాట్సాప్‌ నుంచి అదిరే ఫీచర్‌.. ఇంగ్లీష్‌ పూర్తిగా రాని వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్!

  • Published Jul 16, 2024 | 12:28 PM Updated Updated Jul 16, 2024 | 12:28 PM

WhatsApp-Message Translation: వాట్సాప్‌ నుంచి అదిరే ఫీచర్‌.. ఇంగ్లీష్‌ పూర్తిగా రాని వాళ్ళకి ఇది వరం అని చెప్పవచ్చు. ఇంతకు ఏంటా ఫీచర్‌ అంటే..

WhatsApp-Message Translation: వాట్సాప్‌ నుంచి అదిరే ఫీచర్‌.. ఇంగ్లీష్‌ పూర్తిగా రాని వాళ్ళకి ఇది వరం అని చెప్పవచ్చు. ఇంతకు ఏంటా ఫీచర్‌ అంటే..

  • Published Jul 16, 2024 | 12:28 PMUpdated Jul 16, 2024 | 12:28 PM
WhatsApp: వాట్సాప్‌ నుంచి అదిరే ఫీచర్‌.. ఇంగ్లీష్‌ పూర్తిగా రాని వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్!

స్మార్ట్‌ ఫోన్‌ వాడే ప్రతి ఒక్కరు కామన్‌గా ఉపయోగించే యాప్‌ వాట్సాప్‌. సాధారణ చిట్‌ చాట్‌ దగ్గర నుంచి.. ఆఫీసు వ్యవహరాల వరకు ప్రతి పని కోసం వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నాం. కొన్ని కీప్యాడ్‌ మొబైల్స్‌లో కూడా వాట్సాప్‌ యాప్‌ వినియోగించుకునేందుకు అవకాశం లభిస్తోంది. ఈ తరుణంలో కస్టమర్లకు మరింత నాణ్యమైన సేవలు అందించడం కోసం వాట్సాప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకుని వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వాట్సాప్‌ మరో అదిరిపోయే ఫీచర్‌ని తీసుకువచ్చింది. ఈ కొత్త ఫీచర్‌ ఇంగ్లీష్‌ రానివారికి అద్భుతమైన వరం అని చెప్పవచ్చు. ఇంతకు వాట్సాప్‌ నుంచి వచ్చిన ఆ ఫీచర్‌ ఏంటి.. పూర్తి వివరాలు మీ కోసం…

ఇప్పటికే వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్షన్, ఏఐ, వీడియో క్లిప్స్ పంపించుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్‌.. వినియోగదారుల కోసం మరీ ముఖ్యంగా ఇంగ్లీష్ రాని వారి కోసం అద్భుతమైన ఫీచర్‌ని తీసుకువచ్చింది. నేటికి కూడా చాలా మంది ఇంగ్లీష్‌ రాకపోవడం వల్ల వాట్సాప్‌ వాడకంలో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య పరిష్కారం కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.15.8 లో ఈ ఫీచర్ ను అందించింది. ఈ విషయాన్ని డబ్ల్యూఏబీటాఇన్ఫో నివేదించింది. ఈ ఫీచర్‌ను వివరించే స్క్రీన్ షాష్‌లను తన అధికారిక ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.

ఈ కొత్త ఫీచర్‌ ద్వారా.. మీరు డైరెక్ట్‌గా వాట్సాప్‌లోనే మెసేజ్‌ చేసే సమయంలోనే అనువాదం చేసుకునేందుకు అనుమతి లభిస్తుంది. ఏ భాష నుంచి ఏ భాషలోకి అయినా అనువాదం చేసుకోవచ్చు. ట్రాన్స్‌లేషన్‌ కోసం మీరు వేరే యాప్‌లపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇదే కాక.. వాట్సాప్ బీటా టెస్టర్స్ కోసం కొత్త వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్‌. దీని ద్వారా యూజర్లకు వచ్చిన వాయిస్ మెసేజ్‌లను వారికి అనువైన భాషలోకి అనువాదం చేసుకుని వినే అవకాశం లభించనుంది. ఈ ఫీచర్స్ ముందుగా బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంచిన వాట్సాప్, ఇప్పుడు అందరూ యూజర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది.

ఇక రెండవ ఫీచర్ ఫీచర్ విషయానికి వస్తే బోటమ్‌ కాలింగ్ కోసం కొత్త ఫీచర్‌ను తీసుకు వచ్చింది. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.24.12.14 తో కాలింగ్ స్క్రీన్ కోసం కొత్త ఇంటర్ ఫేజ్‌ను పరిచయం చేసింది. ఇది బోటమ్ కాలింగ్‌ ఫీచర్‌ను మరింత సౌకర్యవంతంగా మార్చనుంది. ఇప్పుడు యూజర్లందరూ దీన్ని విరివిగా వాడుతున్నారు. ఈ కొత్త అప్డేట్‌లతో వాట్సాప్ కాలింగ్‌లో కనిపించే స్క్రీన్‌లో బటన్స్ మరింత పెద్దగా, బ్రైట్ గా కనిపిస్తాయని చెబుతోంది. ఈ స్క్రీన్ సెమీ ట్రాన్స్పరెంట్ బ్యాగ్రౌండ్‌లో కూడా కనిపిస్తుందని ఈ రిపోర్టులో తెలిపింది.