iDreamPost
android-app
ios-app

వాట్సాప్ యూజర్స్‌కి గుడ్ న్యూస్.. మరింత అందంగా కనిపించేలా కొత్త ఫీచర్‌

WhatsApp Introduced AR Effects And Filters Feature In Video Calls: వీడియో కాల్ లో మాట్లాడుతున్నప్పుడు ఆధార్ కార్డు ఫోటోలో ఉన్నట్టు కనబడతాం. అంత అందంగా కనబడం. చుట్టూ బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. అయితే వాట్సాప్ ఇప్పుడు వీడియో కాల్ లో మరింత అందంగా కనిపించేలా, బ్యాక్ గ్రౌండ్ ని మార్చుకునేలా కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది.

WhatsApp Introduced AR Effects And Filters Feature In Video Calls: వీడియో కాల్ లో మాట్లాడుతున్నప్పుడు ఆధార్ కార్డు ఫోటోలో ఉన్నట్టు కనబడతాం. అంత అందంగా కనబడం. చుట్టూ బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. అయితే వాట్సాప్ ఇప్పుడు వీడియో కాల్ లో మరింత అందంగా కనిపించేలా, బ్యాక్ గ్రౌండ్ ని మార్చుకునేలా కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది.

వాట్సాప్ యూజర్స్‌కి గుడ్ న్యూస్.. మరింత అందంగా కనిపించేలా కొత్త ఫీచర్‌

వాట్సాప్ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్స్ ని తీసుకొస్తూనే ఉంది. ఇప్పటికే చాట్ లో ఉండగానే క్విక్ రిప్లైస్ కోసం ఆల్బమ్ పికర్ ఫీచర్ ని తీసుకొస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్.. తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని తీసుకొస్తుంది. వీడియో కాల్ ఎఫెక్ట్స్ కోసం వాట్సాప్ ఇప్పుడు ఏఆర్ ఫీచర్, ఫిల్టర్స్ మీద పని చేస్తుంది. డైనమిక్ ఫేషియల్ ఫిల్టర్స్, కాల్ ఎఫెక్ట్స్ తో వాట్సాప్ యూజర్లు ఇతరులతో వీడియో కాల్ లో కమ్యూనికేట్ అయ్యేలా వీడియో యొక్క విజువల్ ఎక్స్ పీరియన్స్ ని మెరుగుపరచడమే లక్ష్యంగా వాట్సాప్ ఈ ఫీచర్ ని డెవలప్ చేస్తుంది. వాట్సాప్ ప్రస్తుతం ఈ ఫీచర్ ని టెస్ట్ చేస్తుంది. బీటా టెస్టర్స్ కోసం ఈ ఫీచర్ ని వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులకు కాల్ ఎఫెక్ట్స్, ఫిల్టర్స్ ని పరిచయం చేయడానికి వాట్సాప్ ఈ ఏఆర్ ఫీచర్ ని డెవలప్ చేస్తుంది. వీడియో కాలింగ్ అనుభూతిని మెరుగుపరచడం కోసం వాట్సాప్ అధికారికంగా కొత్త ఫీచర్స్ ని లాంఛ్ చేసింది.

వాట్సాప్ వినియోగదారులు వీడియో కాల్స్ లో ఈ ఏఆర్ కాల్ ఎఫెక్ట్స్, ఫిల్టర్స్ ద్వారా ఫన్ పొందవచ్చు. ఈ ఏఆర్ ఎఫెక్ట్స్ ద్వారా వినియోగదారులు తమ వీడియో కాల్స్ ని పర్సనలైజ్ చేసుకోవచ్చు. అంటే డైనమిక్ ఫేషియల్ ఫిల్టర్స్ ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల స్మూత్ స్కిన్ అపీరెన్స్ కోసం కోసం టచప్ టూల్, లైట్ మోడ్ ని ఎనేబుల్ చేయడం వల్ల లైటింగ్ తక్కువ ఉన్న ప్రాంతాల్లో మెరుగైన విజిబిలిటీ ఉండడం వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. వాట్సాప్ బ్యాక్ గ్రౌండ్ ఎడిటింగ్ టూల్ ని సైతం తీసుకొస్తుంది. గ్రూప్ కాన్ఫిరెన్స్ లప్పుడు వీడియో కాల్ లో మాట్లాడుతున్నప్పుడు దృష్టి మరలకుండా ఉండేలా చుట్టుపక్కల ఉన్న బ్యాక్ గ్రౌండ్ ని బ్లర్ చేసుకునే టూల్ ని తీసుకొస్తుంది.

Beaty feature in whatsapp

అంతేకాదు బ్యాక్ గ్రౌండ్ ఎలిమెంట్స్ ని తొలగించి నచ్చిన బ్యాక్ గ్రౌండ్ ని పెట్టుకునేలా ఈ టూల్ ని రూపొందించింది. వివిధ సీన్స్, వివిధ చిత్రాలతో బ్యాక్ గ్రౌండ్ ని సెట్ చేసుకోవచ్చు. అయితే భవిష్యత్తులో ఈ ఫీచర్ ని డెస్క్ టాప్ యాప్స్ లో తీసుకొస్తుందేమో చూడాలి. అప్పుడు పెద్ద స్క్రీన్ లో వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ ని మరింత వివరంగా ఎడిటింగ్ చేసుకునేవారికి ఈ ఫీచర్ వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఈ అప్డేట్ తో వాట్సాప్ ఇన్నోవేటివ్ గా కాల్ ఎక్స్ పీరియన్స్ ని మెరుగుపరచడాన్ని కొనసాగిస్తుందని అర్థమవుతుంది. అటు ప్రొఫెషనల్ అవసరాలకి, ఇటు వినోదం కోరుకునే యూజర్స్ కి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమంది బీటా యూజర్స్ కి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే పూర్తిగా అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి