Param Rudra సూపర్ కంప్యూటర్లని ప్రారంభించిన మోడీ! వీటి వల్ల ఉపయోగాలు ఏంటి?

Param Rudra Supercomputers: 'పరమ్ రుద్ర సూపర్‌ కంప్యూటింగ్ సిస్టమ్‌'ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ కంప్యూటర్లు సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) ద్వారా అభివృద్ధి చేయబడ్డాయి.

Param Rudra Supercomputers: 'పరమ్ రుద్ర సూపర్‌ కంప్యూటింగ్ సిస్టమ్‌'ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ కంప్యూటర్లు సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) ద్వారా అభివృద్ధి చేయబడ్డాయి.

టెక్నాలజీ అభివృద్ధి దిశగా సాగే భారతదేశ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన ‘పరమ్ రుద్ర సూపర్‌ కంప్యూటింగ్ సిస్టమ్‌’ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) ద్వారా అభివృద్ధి చేయబడ్డాయి ఈ కంప్యూటర్లు. ఈ కంప్యూటర్ల విలువ సుమారు రూ. 130 కోట్లని తెలుస్తుంది. శాస్త్రీయ పరిశోధనలను సులభం చేసేందుకు ఈ సూపర్‌ కంప్యూటర్లను ఉపయోగించనున్నారు. ఈ మూడు సూపర్‌ కంప్యూటర్లు ఫిజిక్స్‌ నుంచి ఎర్త్‌ సైన్స్‌, కాస్మోలజీ వరకు ఎన్నో అధునాతన పరిశోధనలు చేయడానికి ఉపయోగపడతాయని ప్రధాని మోడీ చెప్పారు. నేటి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగాలు ప్రపంచం యొక్క భవిష్యత్తు అని అన్నారు. వాతావరణం, సంబంధిత పరిశోధనల కోసం తయారు చేయబడిన ఈ హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్‌పీసీ) సిస్టమ్‌ ప్రాజెక్ట్ ఏకంగా రూ. 850 కోట్లుగా ఉంది.

ఇక ఈ పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్ల విషయానికి వస్తే.. ఇవి సరికొత్త హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలతో తయారు చేశారు. వీటిల్లో అత్యధిక పార్ట్స్ లను భారతదేశంలోనే తయారు చేశారు. మన దేశంలోనే ఫిక్స్ చేశారు. పుణేలో జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ (జీఎంఆర్టీ), ఢిల్లీలోని ఇంటర్ యూనివర్సిటీ యాక్సిలరేటర్ సెంటర్ (ఐయూఏసీ), కోల్‌కతాలో ఎస్‌ఎన్ బోస్ సెంటర్ శాస్త్రవేత్తలు ఈ సూపర్‌ కంప్యూటర్లను ఉపయోగించనున్నారు. ఈ కంప్యూటర్ల ప్రత్యేకతలు ఏమిటంటే.. ఇవి వాతావరణ సూచన, క్లైమేట్ మోడలింగ్, డ్రగ్ డిస్కవరీ, మెటీరియల్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో పరిశోధన కోసం బాగా ఉపయోగపడతాయి. ఇవి అత్యంత సంక్లిష్ట లెక్కలను చాలా వేగంగా చేయగలవు.

శాస్త్రవేత్తలకు సవాలుగా మారుతున్న సమస్యలను పరిష్కరించడానికి, ముఖ్యమైన ఆవిష్కరణలు చేయడానికి అవసరమైన గణన సాధనాలకు ఈ సూపర్‌ కంప్యూటర్లు ఉపయోగపడతాయి.అలాగే జెయింట్ మీటర్ రేడియో టెలిస్కోప్ (జీఎంఆర్‌టీ), సూపర్ కంప్యూటర్ ఫాస్ట్ రేడియో బరస్ట్స్ (ఎఫ్ఆర్బీ), ఇతర ఖగోళ విషయాలని కనిపెట్టడానికి ఈ కంప్యూటర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఈ కంప్యూటర్ల వలన మెటీరియల్ సైన్స్, అటమిక్ ఫిజిక్స్ వంటి రంగాలలో పరిశోధనలు మెరుగవుతాయి. ఇంకా ఈ కంప్యూటర్ల సాయంతో ఎస్ఎన్ బోస్ సెంటర్ సూపర్‌ కంప్యూటర్‌తో ఫిజిక్స్, కాస్మోలజీ, ఎర్త్ సైన్స్ వంటి రంగాలలో అధునాతన పరిశోధనలను జరపవచ్చు. ఇక ఈ పరమ్ రుద్ర సూపర్‌ కంప్యూటర్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments