iDreamPost

బడ్జెట్ ధరలోనే.. Vivo నుంచి కొత్త స్మార్ట్ ఫోన్‌.. 6000 mAH బ్యాటరీతో..

కొత్త స్మార్ట్ ఫోన్ల కోసం వెయిట్ చేస్తున్నారా? తాజాగా బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ కంపెనీ కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. 6000ఎంఏహెచ్ బ్యాటరీ సామార్ధ్యంతో వస్తుంది. బడ్జెట్ ధరలోనే లభిస్తున్నది.

కొత్త స్మార్ట్ ఫోన్ల కోసం వెయిట్ చేస్తున్నారా? తాజాగా బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ కంపెనీ కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. 6000ఎంఏహెచ్ బ్యాటరీ సామార్ధ్యంతో వస్తుంది. బడ్జెట్ ధరలోనే లభిస్తున్నది.

బడ్జెట్ ధరలోనే.. Vivo నుంచి కొత్త స్మార్ట్ ఫోన్‌.. 6000 mAH బ్యాటరీతో..

స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. మార్కెట్ లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో. లేటెస్ట్ వర్షన్, మంచి బ్యాటరీ ప్యాకప్, మంచి కెమెరా క్వాలిటీ కలిగిన ఫోన్ కోసం వెయిట్ చేసే వారికి ఇది బెస్ట్ మొబైల్. యూజర్లను దృష్టిలో పెట్టుకుని మొబైల్ తయారీ కంపెనీలు క్రేజీ ఫీచర్లతో రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన ఫోన్లు అద్భుతమైన ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే లభిస్తున్నాయి. తాజాగా వివో ప్రవేశ పెట్టిన కొత్త స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలోనే లభిస్తున్నది.

టెలికాం కంపెనీలు 5జీ నెట్ వర్క్ పై ఫోకస్ చేయడంతో 5జీ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రముఖ ఫోన్ తయారీ కంపెనీలు 5జీ ఫోన్లను లేటెస్ట్ ఫీచర్లతో తీసుకొస్తున్నాయి. తాజాగా వివో వై58 5జీ అనే 5జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ప్రీమియం డిజైన్ తో వచ్చిన ఈ ఫోన్ యూజర్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. ర్యామ్‌ను వర్చువల్‌గా 8జీబీ, స్టోరేజ్‌ను 1 టీబీ వరకు విస్తరించుకోవచ్చు. వివో వై58 5జీ ధర రూ.19,499గా ఉంది. బడ్జెట్ ధరలోనే 5జీ స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

వివో వై58 5జీ హిమాలయన్ బ్లూ, సుందర్బన్స్ గ్రీన్ కలర్స్ లో అందుబాటులో ఉంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 120హెచ్ జెడ్ రీఫ్రెష్‌ రేటుతో కూడిన 6.72 అంగుళాల ఎల్‌సీడీ డిస్ల్పేను అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌14తో ఇది పనిచేస్తుంది. ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 ప్రాసెసర్‌ను పొందుపర్చారు. 44వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 6000 ఎంఏహెచ్ లిథియం ఐయాన్‌ బ్యాటరీని అందించారు. 50ఎంపీ+2ఎంపీ డ్యుయల్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం 8ఎంపీ కెమెరాను ఇచ్చారు. వైఫై, బ్లూటూత్‌ 5, యూఎస్‌బీ టైప్‌-సి కనెక్టివిటీ, డ్యుయల్‌ స్టీరియో స్పీకర్‌ ఫీచర్లు ఉన్నాయి. మరి మీరు ఈ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి