iDreamPost
android-app
ios-app

అదిరిపోయే ఫీచర్లతో.. తక్కువ ధరకే Vivo నుంచి మరో కొత్త ఫోన్

  • Published Jul 28, 2024 | 5:00 AM Updated Updated Jul 28, 2024 | 5:00 AM

Vivo Y18i: స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో అదిరిపోయే ఫీచర్లతో తక్కువ ధరలోనే కొత్త ఫోన్ ను లాంఛ్ చేసింది.

Vivo Y18i: స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో అదిరిపోయే ఫీచర్లతో తక్కువ ధరలోనే కొత్త ఫోన్ ను లాంఛ్ చేసింది.

  • Published Jul 28, 2024 | 5:00 AMUpdated Jul 28, 2024 | 5:00 AM
అదిరిపోయే ఫీచర్లతో.. తక్కువ ధరకే Vivo నుంచి మరో కొత్త ఫోన్

స్మార్ట్ ఫోన్ కంపెనీలు తరచుగా సరికొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. క్రేజీ ఫీచర్లతో బడ్జెట్ ధరల్లోనే స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో మొబైల్ తయారీ కంపెనీలు లేటెస్ట్ వర్షన్ స్టన్నింగ్ డిజైన్ తో కొత్త ఫోన్లను రూపొందిస్తున్నాయి. కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి లాంఛ్ చేసింది. వివో వై18 ఐ పేరిట ఫోన్ ను రిలీజ్ చేసింది. కస్టమర్లకు తక్కువ ధరలోనే ఈ ఫోన్ లభ్యంకానున్నది. దీని ధర ఎంతంటే?

చైనా బ్రాండ్ కు చెందిన స్మార్ట్ ఫోన కంపెనీ వివో మరో కొత్త ఫోన్ ను పరిచయం చేసింది. వివో ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. మొబైల్ యూజర్లు వివో ఫోన్లను కొనేందుకు ఇంట్రెస్టు చూపిస్తుంటారు. అదిరిపోయే ఫీచర్లు, ధర కూడా తక్కువగా ఉండడంతో సేల్స్ లో దూసుకెళ్తుంటాయి. ఇక ఇప్పుడు వివో లాంఛ్ చేసిన వివో వై18 ఐ కూడా యూజర్లను ఆకట్టుకుంటోంది. జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వివో వై18ఐ ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,999లకు లభిస్తుంది.

వివో వై18ఐ ఫోన్ 6.56 అంగుళాల హెచ్డీ+ డిస్ ప్లే కలిగి ఉంటుంది. యూనిసోక్ టీ612 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ గా వస్తోంది. 13-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. 13-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 0.08 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీల కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14 వర్షన్ మీద పని చేస్తుంది. వివో వై18ఐ ఫోన్ వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, బైదూ, గ్లోనాస్, గెలీలియో, క్యూజడ్ఎస్ఎస్, ఓటీజీ, ఎఫ్ఎం రేడియో, యూఎస్బీ 2.0 పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom