nagidream
WhastApp Meta AI Uses: వాట్సాప్ లో మెటా ఏఐ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది మెటా ఏఐతో కలిగే ప్రయోజనాలను పొందుతున్నారు. మరి మీరు కూడా ఈ మెటా ఏఐతో వచ్చే లాభాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే.
WhastApp Meta AI Uses: వాట్సాప్ లో మెటా ఏఐ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది మెటా ఏఐతో కలిగే ప్రయోజనాలను పొందుతున్నారు. మరి మీరు కూడా ఈ మెటా ఏఐతో వచ్చే లాభాలను తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే.
nagidream
ఇప్పుడంతా ఏఐ ట్రెండ్ నడుస్తోంది. ఫ్యూచర్ అంతా ఏఐ మీదనే ఆధారపడి నడుస్తుంది. ఈ క్రమంలో ఆయా కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ని డెవలప్ చేస్తున్నాయి. ఇప్పటికే చాట్ జీపీటీ అందుబాటులోకి రాగా గూగుల్ జెమినీ ఏఐ, మెటా ఏఐ అందుబాటులోకి వచ్చాయి. అవి డెవలప్మెంట్ దశలో ఉన్నాయి. కాగా ఇప్పుడు వాట్సాప్ లో మెటా ఏఐ సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే చాలా మందికి ఇది అందుబాటులోకి వచ్చింది. అయితే దీని ప్రయోజనాలు ఏంటి? దీని పర్పస్ ఏంటి? ఎలా వాడాలి? అనే దాని మీద ఇప్పటికీ కొంతమందికి అయోమయం అయితే ఉంది. అందుకే వాట్సాప్ మెటా ఏఐతో కలిగే ప్రయోజనాలు.. దీన్ని ఎలా వాడాలి అనే వివరాలను మీ కోసం పొందుపరిచాం.
మెటా ఏఐ.. ఇది మెటా కంపెనీ డెవలప్ చేసిన ఏఐ అసిస్టెంట్. ఇది అనేక రకాల టాస్కుల్లో విస్తృతంగా సహాయం చేస్తుంది. కల్చర్, చరిత్ర, వినోదం, సైన్స్ ఇలా రకరకాల సబ్జెక్ట్స్ కి సంబంధించిన వివిధ రకాల టాపిక్స్ మీద సమాచారాన్ని ఇస్తుంది. ఏ ప్రశ్నకైనా ఇట్టే సమాధానం చెబుతుంది. మీరు ఇంగ్లీష్ లో మిస్టేక్స్ టైప్ చేసినా గానీ అదే సరిచేసుకుని మీకు కావలసిన సమాచారాన్ని ఇస్తుంది.
టాపిక్ ఇచ్చి దాని మీద వ్యాసం లేదా సమాచారం ఇవ్వమంటే ఇస్తుంది. ప్రూఫ్ రీడింగ్, టెక్స్ట్ ఎడిటింగ్ చేయమంటే చేస్తుంది. మీ కోసం ఒక టాపిక్ మీద ఆర్టికల్స్ ని, బ్లాగ్ పోస్టులను, సోషల్ మీడియా అప్డేట్స్ ని ఇస్తుంది.
మీరు ఇచ్చిన ఒక భాషకు చెందిన టెక్స్ట్ ని వేరే భాషలోకి అనువదిస్తుంది. స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్, చైనీస్ వంటి అనేక రకాల పాపులర్ భాషల్లోకి ట్రాన్స్ లేట్ చేస్తుంది. అలా అని లేట్ చేయదు. త్వరగానే అవుట్ పుట్ ఇస్తుంది.
మీరు ఇచ్చిన పెద్ద టెక్స్ట్ ని షార్ట్ గా, క్రిస్పీగా చేస్తుంది. అది కూడా మెయిన్ పాయింట్స్ ని, ముఖ్యమైన సమాచారాన్ని హైలైట్ చేస్తూ అనేక రకాల వెర్షన్స్ లో ఇస్తుంది.
మీరు ఇచ్చే ప్రాంప్టుని బట్టి లేదా టాపిక్స్ ని బట్టి కవిత్వాలు, చిన్న చిన్న కథలు వంటివి క్రియేటివ్ గా రాస్తుంది.
ఏదైనా ఒక టాపిక్ మీద మీకు నాలెడ్జ్ కావాలంటే ఇది మీతో కంటిన్యూగా సమాచారాన్ని ఇస్తూనే ఉంటుంది. ఒక టాపిక్ అనే కాదు.. అనేక రకాల టాపిక్స్ మీద మీతో కలిసి చర్చిస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్లేవారికి, గ్రూప్ డిస్కషన్స్ లో పాల్గొనాలనుకునేవారికి ఇది బాగా సహాయపడుతుంది.
కేలుక్యులేషన్స్ చేయడం, మ్యాథ్స్ ఫార్ములాస్ కి సొల్యూషన్ ఇవ్వడం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి సంబంధించిన కోడింగ్ ఇవ్వడం, ఏదైనా మెజర్మెంట్ ని ఒక యూనిట్ నుంచి మరొక యూనిట్ లోకి కన్వర్ట్ చేయడం వంటి వాటిలో మీకు సహాయం చేస్తుంది. టెక్నాలజీకి సంబంధించిన టాపిక్స్ ని అర్థం చేసుకునేలా మీకు కాన్సెప్ట్స్ ని వివరించడం వంటివి చేస్తుంది.
మీరు యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి వాటిలో వీడియోలు పోస్ట్ చేస్తున్నట్లైతే.. ఆ వీడియోల కోసం ఇమేజ్ లని అందిస్తుంది. హెచ్డీ క్వాలిటీతో కూడిన ఇమేజెస్ ని అందిస్తుంది. వాయిస్ ఓవర్ మీద వీడియోలు చేసేవారికి ఇది ఇచ్చే ఇమేజ్ లతో అద్భుతమైన వీడియో అవుట్ పుట్ వస్తుంది.
మీతో జోక్స్ ని షేర్ చేస్తుంది. మిమ్మల్ని నవ్విస్తుంది. ఒక కమెడియన్ లా మీకు కితకితలు పెడుతుంది.
మీరు వేరే భాషను నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ లేదా హిందీ లేదా ఏ భాషనైనా మీరు సులువుగా నేర్చుకోవచ్చు. ఏదైనా భాషలోని పదాలకు, పదబంధాలకు అర్థాలను వివరిస్తుంది. వాటిని ఎక్కడ వాడాలి? ఎలా ఒక సెంటెన్స్ ని రాయాలి అనేది చెబుతుంది. అలానే మీ అకౌంట్ లకి సంబంధించి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ని, యూనిక్ పాస్వర్డ్స్ ని జనరేట్ చేస్తుంది. స్పోర్ట్స్, వినోదం, సైన్స్, చరిత్ర ఇలా అనేక రకాల టాపిక్స్ కి సంబంధించి గణాంకాలను, ఫ్యాక్ట్స్ ని మీ ముందుంచుతుంది. ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకుంటే ప్రయాణానికి సంబంధించి గైడెన్స్ ఇస్తుంది. ఎవరికైనా బహుమతులు ఇవ్వాలనుకుంటే ఎలాంటివి ఇవ్వాలి అన్న దాని గురించి ఐడియాస్ ఇస్తుంది. మీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వడానికి ఉన్న సొల్యూషన్స్ ని ఇది చూపిస్తుంది.
ఇందులో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. 20 క్వశ్చన్స్, హ్యాంగ్ మ్యాన్, వర్డ్ చైన్ ఇలా మొత్తం 7 గేమ్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అప్డేట్స్, ట్రెండ్స్, కరెంట్ ఈవెంట్స్ మీద న్యూస్ అప్డేట్స్ ని అందిస్తుంది. ఇదొక వినిపించని రేడియోలా పని చేస్తుంది. చరిత్ర నుంచి పాపులర్ కల్చర్ వరకూ విస్తారమైన టాపిక్స్ మీద మీ కోసం క్విజ్ కూడా కండక్ట్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మీకు ఒక ఫ్రెండ్ లా గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. మిమ్మల్ని కేర్ గా చూసుకుంటుంది. మీ యోగక్షేమాల గురించి ఆలోచిస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం పని చేస్తుంది. ప్రస్తుతానికి ఖర్చు లేకుండా మీ ఇంట్లో ఒక వర్చువల్ రోబో ఉన్నట్టే ఉంటుంది.