Tirupathi Rao
Samsung Galaxy S24 Ultra AI Features: ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ స్మార్ట్ ఫోన్లలోకి కూడా వచ్చేసింది. అయితే శాంసంగ్ కంపెనీ ఫోన్లో ఉన్న టాప్ 5 ఏఐ ఫీచర్స్ ఏంటో చూడండి.
Samsung Galaxy S24 Ultra AI Features: ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ స్మార్ట్ ఫోన్లలోకి కూడా వచ్చేసింది. అయితే శాంసంగ్ కంపెనీ ఫోన్లో ఉన్న టాప్ 5 ఏఐ ఫీచర్స్ ఏంటో చూడండి.
Tirupathi Rao
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు టెక్నాలజీలో అదొక విప్లవం అయిపోయింది. ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ ఏఐ టెక్నాలజీని స్మార్ట్ ఫోన్స్ లోకి కూడా తీసుకురావడం చూస్తున్నాం. ఏఐ స్మార్ట్ ఫోన్స్ లోకి వచ్చాక అనేక ఫీచర్స్ వినయోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా శాంసంగ్ గ్యాలెక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్ లో అదిరిపోయే 5 ఏఐ ఫీచర్స్ వచ్చాయి. ఇవి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. మరి.. ఆ ఫీచర్స్ ఏంటి? వాటిని ఎలా వాడాలి? లైవ్ కాల్ ట్రాన్స్ లేటర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం.
టెక్నాలజీ అనేది రోజురోజుకీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ విషయంలో టెక్నాలజీ అత్యంత వేగంగా మారుతోంది. ఇటీవల వచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ స్మార్ట్ ఫోన్స్ వల్ల వినియోగదారులకు మరింత దగ్గరవుతోంది. ఇప్పుడు శాంసంగ్ గ్యాలెక్సీ ఎస్24 అల్ట్రాతో అవి దగ్గర కావడమే కాకుండా.. యూజర్స్ మదిని దోచేలా ఉన్నాయి. గురువారం శాంసంగ్ కెంపెనీ ఇండియాలో ఎస్24 అల్ట్రా సిరీస్ ని లాంఛ్ చేసింది. ఈ ఫోన్లో అదిరిపోయే 5 ఏఐ ఫీచర్స్ ఉన్నాయి.
ఫీచర్స్ చూస్తే.. మీరు 60 గానీ 30 గానీ ఎఫ్పీఎస్ లో ఒక నార్మల్ వీడియో తీస్తున్నారు. వీడియో తీస్తున్న సమయంలో స్క్రీన్ మీద టచ్ చేస్తే.. ఏఐ టెక్నాలజీ దానిని స్లో మోషన్ వీడియోగా మార్చేస్తుంది. దానికోసం మీరు ప్రత్యేకంగా సెట్టింగ్స్ లోకి వెళ్లి స్లోమోషన్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మరో ఫీచర్ ఏంటంటే.. ఒకసారి ఫొటో తీసిన తర్వాత అందులో ఉండే సబ్జెక్ట్ ని మీరు కట్ చేసుకోవచ్చు. దాని ప్లేస్మెంట్ మార్చుకోవచ్చు. అసలు అక్కడ ఆ వ్యక్తి ఉండకూడదు అనుకుంటే మీరు సెలక్ట్ చేసి డిలీట్ కూడా చేయచ్చు. ఒకవేళ ఫొటో తీసిన తర్వాత మీరు పిక్ రొటేట్ చేస్తే.. ఆటేమోటిక్ గా గ్యాప్ ని కూడా ఫిల్ చేస్తుంది. ఇవి మాత్రమే కాదు.. మీరు ఏదైనా చూస్తున్న సమయంలో, ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఒక వస్తువు గురించి తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ గా దాని మీద సర్కిల్ గీస్తే.. ఆ వస్తువుకు సంబంధించిన వివరాలు, గూగుల్ సెర్చ్ అంతా పాప్ అప్ అవుతుంది. ఇదైతే నిజంగా క్రేజీ ఫీచర్ అనే చెప్పాలి. అదేంటంటే మీరు మీకు నచ్చిన భాషలో మాట్లాడితే.. అవతలి వాళ్లకు ఏ భాష అయితే అర్థమవుతుందో ఆ భాషలోకి మారిపోతుంది.
దీనిని లైవ్ ట్రాన్స్ లేటర్ అంటారు. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటే అది ఆటేమేటిక్ గా హిందీలోకి అయినా మారిపోతుంది. ఇది కూడా చాలా మంచి ఫీచర్.. అంతేకాకుండా మీ సమయాన్ని సేవ్ చేస్తుంది. మీరు ఏదైనా వార్తను చదువుతూ ఉంటారు. లేదా ఒక మంచి ఆర్టికల్ చదువుతూ ఉంటారు. స్క్రిప్ట్ చాలా ఎక్కువగా ఉంది. మీరు ఆ ఆర్టికల్ ని సెలక్ట్ చేసి సమురైజ్ చేయామని అడిగితే దానిని ఏఐ టూల్ చిన్నగా మార్చేస్తుంది. అంతేకాకుండా ఆ సమరీని హిందీలోకి కూడా ట్రాన్స్ లేట్ చేసుకోవచ్చు. ఇంక ఈ శాంసంగ్ ఎస్24 అల్ట్రా సిరీస్ ధరల విషయానికి వస్తే.. 12 జీబీ ర్యామ్- 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,16,999గా ఉంది. 12 జీబీ ర్యామ్- 512 జీబీ స్టోరేజ్ ధర అయితే రూ.1,17,999గా ఉంది. 12 జీబీ ర్యామ్- 1 టెరాబైట్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,59,999గా ఉంది. మరి.. ఈ శాంసంగ్ ఎస్24 అల్ట్రా సిరీస్ ఏఐ ఫీచర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.