iDreamPost
android-app
ios-app

GMAIL యూజర్లకు గూగుల్ షాక్! రేపటి నుంచి ఈ అకౌంట్లు బ్లాక్.. ఇలా చేస్తే మీ అకౌంట్ సేఫ్..

  • Published Sep 19, 2024 | 4:33 PM Updated Updated Sep 19, 2024 | 4:33 PM

GMAIL: సెప్టెంబర్ 20 నుండి గూగుల్ జీమెయిల్‌ ఖాతాలను బ్లాక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. కొంతమంది గూగుల్‌ అకౌంట్ ని మూసివేయాలని నిర్ణయించుకుంది.

GMAIL: సెప్టెంబర్ 20 నుండి గూగుల్ జీమెయిల్‌ ఖాతాలను బ్లాక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. కొంతమంది గూగుల్‌ అకౌంట్ ని మూసివేయాలని నిర్ణయించుకుంది.

GMAIL యూజర్లకు గూగుల్ షాక్! రేపటి నుంచి ఈ అకౌంట్లు బ్లాక్.. ఇలా చేస్తే మీ అకౌంట్ సేఫ్..

ప్రతి ఒక్కరికీ జీమెయిల్ అకౌంట్ ఉంటుంది. కొందరు జిమెయిల్ అకౌంట్ ని యాక్టివ్‌గా వినియోగిస్తున్నారు. అయితే చాలా మంది మాత్రం దానిని వాడకుండా అలాగే వదిలేస్తున్నారు. అలా చేస్తున్న వారి కోసం ఇప్పుడు గూగుల్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 20 నుండి గూగుల్ చాలా జీమెయిల్‌ ఖాతాలను బ్లాక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. కొంతమంది వినియోగదారుల గూగుల్‌ అకౌంట్ ని మూసివేయాలని గూగుల్  నిర్ణయించుకుంది. గూగుల్ జిమెయిల్ ఖాతాను యాక్టివ్‌గా ఉంచమని ఎప్పుడు చెబుతూనే ఉంది. అందుకే ఇప్పుడు జీమెయిల్ ని యాక్టివ్ గా వాడని వారి అకౌంట్లను పూర్తిగా క్లోజ్ చేయనుంది..

అయితే అందరివి కావు కేవలం 2 సంవత్సరాల నుంచి యాక్టివ్‌గా లేని ఖాతాలను మాత్రమే గూగుల్ బ్లాక్ చేయబోతుంది. అటువంటి పరిస్థితిలో మీరు గత రెండు సంవత్సరాల నుంచి కనుక మీ జీమెయిల్‌ ఖాతాను ఉపయోగించకుంటే, మీ ఖాతాని గూగుల్ క్లోజ్ చేస్తుంది. గూగుల్ ఇనాక్టివ్ పాలసీ ప్రకారం.. రెండు సంవత్సరాల పాటు వాడని గూగుల్‌ ఖాతాలను తొలగించే హక్కు గూగుల్‌కి ఉంది. అయితే మీరు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మీ జీమెయిల్‌ ఖాతాను గూగుల్ బ్లాక్ చెయ్యకుండా సేవ్ చేయవచ్చు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటి? వాటి గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.

మీరు మీ అకౌంట్ ని బ్లాక్ కాకుండా చేయాలనుకుంటే మీ జిమెయిల్ లో కచ్చితంగా లాగిన్ అవ్వండి. తరువాత ఏదైనా ఇమెయిల్ పంపండి. లేదా మీ ఇన్‌బాక్స్‌లోని ఇమెయిల్‌ను చదవండి. అలాగే మీరు గూగుల్ ఫోటోల యాప్ లో సైన్ ఇన్ అయ్యి ఫోటోలను అప్‌లోడ్ చేసి మీ అకౌంట్ ని సేవ్ చేయవచ్చు.ఇంకా దీనితో పాటు, మీరు మీ జీమెయిల్‌ ఖాతాతో యూట్యూబ్ లో లాగిన్ అయ్యి ఏదైనా వీడియోను చూడవచ్చు. ఇందువల్ల మీ యాక్టివిటీ రికార్డ్ చేయబడి మీ జీమెయిల్ సేవ్ అవుతుంది. అలాగే గూగుల్‌ డ్రైవ్‌ను ఉపయోగించడం ద్వారా కూడా మీ అకౌంట్ ని యాక్టివేట్ చేయవచ్చు. గూగుల్‌ డ్రైవ్ లో లాగిన్ అయ్యి అందులో ఏదైనా ఫైల్‌ని అప్‌లోడ్ చేయండి. లేదా అందులో ఏదైనా ఫైల్ ఉంటే డౌన్‌లోడ్ చేయండి. మీ గూగుల్‌ ఖాతాలో సైన్ ఇన్ అయ్యి గూగుల్‌ సెర్చ్ ఇంజిన్‌లో ఏదైనా సెర్చ్ చెయ్యండి. అప్పుడు మీ అకౌంట్ యాక్టీవ్లో ఉంటుంది. ఇలా ఈ టిప్స్ తో మీరు మీ జిమెయిల్ ఖాతా బ్లాక్ అవ్వకుండా సేవ్ చేసుకోవచ్చు. మరి ఈ టిప్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.