iDreamPost
android-app
ios-app

క్రేజీ ఫీచర్లతో.. టెక్నో నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే

Tecno Spark Go 1: స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో మొబైల్స్ తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. టెక్నో కంపెనీ నుంచి 10 వేల లోపు ధరతో మరో కొత్త ఫోన్ అందుబాటులోకి రానున్నది.

Tecno Spark Go 1: స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో మొబైల్స్ తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. టెక్నో కంపెనీ నుంచి 10 వేల లోపు ధరతో మరో కొత్త ఫోన్ అందుబాటులోకి రానున్నది.

క్రేజీ ఫీచర్లతో.. టెక్నో నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరకే

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు తరచుగా కొత్త స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తూనే ఉన్నాయి. అడ్వాన్స్డ్ ఫీచర్లు, స్టన్నింగ్ లుక్ తో ఫోన్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లను విడుదల చేస్తున్నారు. 10 వేల లోపు ధరలతో స్మార్ట్ ఫోన్లు లభిస్తున్నాయి. ఎక్కువ ధరల కారణంగా స్మార్ట్ ఫోన్ కొనలేని వారికి ఈ ఫోన్లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానున్నది. స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో తన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ టెక్నో స్పార్క్ గో 1ను త్వరలో భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది.

టెక్నో స్పార్క్ గో1 బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో రానున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారు రూ. 8,400గా ఉండొచ్చునని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టెక్నో స్పార్క్ గో1 ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తోపాటు 13-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం 8-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ ఫోన్ 6.67 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంటుంది. యూనిసోక్ టీ615 ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుందని తెలుస్తోంది.

5000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో 15 వాట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. సెక్యూరిటీ ఫీచర్ల పరంగా చూస్తే.. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ సెన్సర్‌లను అందిచారు. డ్యూయల్‌ స్టీరియో స్పీకర్స్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ 4జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేస్తుంది. తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తుండడంతో మొబైల్ యూజర్లు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet