iDreamPost

మోస్ట్ అడ్వాన్స్డ్ గాడ్జెట్.. దీన్ని మీరు ఇప్పటి వరకూ చూసుండరు!

TapXR : మీరు ఇప్పటి వరకూ ఎన్నో గాడ్జెట్స్ చూసి ఉంటారు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గాడ్జెట్ మాత్రం నెక్స్ట్ లెవల్ గాడ్జెట్. ఎందుకంటే దీని ప్రయోజనాలు అలాంటివి మరి. చూడ్డానికి రిస్ట్ వాచ్ లా స్టైలిష్ గా ఉంది. దాంతో పాటు ఎన్నో పనులు చేసుకోవచ్చు. ఇది ఉంటే మీకు కీబోర్డు, మౌస్ తో పని లేదు. మీకు కంప్యూటర్ డెస్క్ మీద చాలా స్పేస్ కవర్ అవుతుంది. అంతేకాదు ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. 

TapXR : మీరు ఇప్పటి వరకూ ఎన్నో గాడ్జెట్స్ చూసి ఉంటారు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గాడ్జెట్ మాత్రం నెక్స్ట్ లెవల్ గాడ్జెట్. ఎందుకంటే దీని ప్రయోజనాలు అలాంటివి మరి. చూడ్డానికి రిస్ట్ వాచ్ లా స్టైలిష్ గా ఉంది. దాంతో పాటు ఎన్నో పనులు చేసుకోవచ్చు. ఇది ఉంటే మీకు కీబోర్డు, మౌస్ తో పని లేదు. మీకు కంప్యూటర్ డెస్క్ మీద చాలా స్పేస్ కవర్ అవుతుంది. అంతేకాదు ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. 

మోస్ట్ అడ్వాన్స్డ్ గాడ్జెట్.. దీన్ని మీరు ఇప్పటి వరకూ చూసుండరు!

ట్యాప్ ఎక్స్ఆర్ డివైజ్.. ఇదొక రిస్ట్ బ్యాండ్. ఇది కీబోర్డు, మౌస్, హ్యాండ్ హెల్డ్ కంట్రోలర్లని రీప్లేస్ చేస్తుంది. ఇది రిస్ట్ వోర్న్ కీబోర్డు, ఎయిర్ మౌస్ గానే కాకుండా వీఆర్, ఏఆర్, ఎంఆర్, పీసీ, ట్యాబ్ లెట్స్, ల్యాప్ టాప్స్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ ఫోన్స్, టీవీలు, ప్రాజెక్టర్స్ వంటి డివైజెస్ ని కంట్రోల్ చేసే కంట్రోలర్ గా ఉపయోగపడుతుంది. ఇది ఎలాంటి సర్ఫేస్ మీద అయినా పని చేస్తుంది. సోఫా మీద, కంప్యూటర్ టేబుల్ మీద, మంచం మీద ఇలా ఎక్కడైనా ఈ డివైజ్ చేతి మణికట్టుకి ధరించి వేళ్ళు ట్యాప్ చేస్తే చాలు మీ పని సులువు అవుతుంది. దీన్ని చేతి మణికట్టుకి ధరించి.. అదే చేతి వేళ్ళతో ట్యాప్ చేస్తా ఉంటే టీవీ రిమోట్లు, కీబోర్డు, మౌస్, కంట్రోలర్లు వంటివి అవసరం లేదు. దీన్ని కంప్యూటర్ కి కనెక్ట్ చేస్తే కీబోర్డుగా, ఎయిర్ మౌస్ గా పని చేస్తుంది. మౌస్, కీబోర్డుతో జరిగే పనులన్నీ దీంతో చేయవచ్చు.

కీబోర్డు, మౌస్ లేకుండా కంప్యూటర్, ల్యాప్ టాప్ ని ఆపరేట్ చేయవచ్చు. ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. డేటా ఎంట్రీ వర్క్ చేసుకోవచ్చు. నిమిషంలో 70 కంటే ఎక్కువ పదాలను టైప్ చేయవచ్చు. కీబోర్డులో ఉన్న అన్ని లెటర్స్ ని, సింబల్స్ ని, నంబర్స్ ని టైప్ చేసుకోవచ్చు. ఇది అన్ని భాషలను సపోర్ట్ చేస్తుంది. దీన్ని ఎయిర్ మౌస్ గా టీవీలకు కనెక్ట్ చేసుకుని టీవీ రిమోట్ లా వాడుకోవచ్చు. టీవిలో యాప్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ట్యాబ్ లెట్స్ లో డిజిటల్ ఆర్ట్స్ గీసుకోవచ్చు. మీరు మ్యూజిక్ ప్రొడ్యూసర్స్ అయితే ఈ డివైజ్ ని యూజ్ చేసి మ్యూజిక్ ని ప్రొడ్యూస్ చేయచ్చు. స్మార్ట్ వాచ్ టైపింగ్, కంట్రోల్ గా కూడా యూజ్ అవుతుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 8 గంటల పాటు పని చేస్తుంది.  

మీ దగ్గర వీఆర్ డివైజ్ లు ఉంటే దానికి కూడా కనెక్ట్ చేసుకుని రోడ్డు మీద, పార్క్ దగ్గర ఇలా మీకు నచ్చిన ప్లేస్ లో ఆపరేట్ చేసుకోవచ్చు. మీరు ఫోన్ లో కుకింగ్ వీడియోలు లేదా ఎంటర్టైన్మెంట్ వీడియోలు చూస్తూ చపాతీ పిండి పిసుకుతూ వీడియోస్ లో వచ్చే యాడ్స్ ని మీరు ఫోన్ ని టచ్ చేయకుండానే చపాతీ పిండి పిసుకుతున్న చోటే వేలితో ట్యాప్ చేసి స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఈ ఒక్క డివైజ్ లో ఉన్నాయి. ఈ మోస్ట్ అడ్వాన్స్డ్ డివైజ్ ని ఏ డివైజ్ కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. దీని అసలు ధరను 199 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది. అయితే కంపెనీ వెబ్ సైట్ లో 179 డాలర్స్ కే అందుబాటులో ఉంచింది. మన కరెన్సీ ప్రకారం 14,966 రూపాయలు. ఈ రేటుకి ఇంత అడ్వాన్స్డ్ డివైజ్ వస్తుందంటే గ్రేట్ అనే చెప్పాలి. అయితే ఈ డివైజ్ ప్రస్తుతం ఇండియాలో అందుబాటులో లేదు. త్వరలో మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.    

ట్యాప్ ఎక్స్ఆర్ కిట్ తో వచ్చేవి ఇవే:

  • ఒక చిన్న స్టార్ లైట్ బ్యాండ్ 
  • ఒక పెద్ద స్ప్రింగ్ బ్లూ బ్యాండ్ 
  • ఒక యూఎస్బీ ఛార్జింగ్ కేబుల్ 
  • ఒక మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ క్రేడిల్ 
  • ఒక ట్యాప్ ఎక్స్ఆర్ మాడ్యూల్ 
  • క్విక్ స్టార్ట్ గైడ్ 
  • పోకెట్ సైజ్ ట్యాప్ ఆల్ఫాబెట్ గ్లాసరీ (కీబోర్డు టైపింగ్ గైడెన్స్)
  • యూజర్ మ్యాన్యువల్ 

ట్యాప్ ఎక్స్ఆర్ డివైజ్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి