Tirupathi Rao
Tino Bao Creates His Daughter AI Version: తైవాన్ కు చెందిన ప్రముఖ నటుడు, సింగర్ టినో బావో అద్భుతాన్ని సృష్టించారు. కుమార్తెపై తండ్రికి ఉండే ప్రేమ ఏదైనా చేయించగలదు అనే విషయాన్ని టినో బావో నిరూపించారు.
Tino Bao Creates His Daughter AI Version: తైవాన్ కు చెందిన ప్రముఖ నటుడు, సింగర్ టినో బావో అద్భుతాన్ని సృష్టించారు. కుమార్తెపై తండ్రికి ఉండే ప్రేమ ఏదైనా చేయించగలదు అనే విషయాన్ని టినో బావో నిరూపించారు.
Tirupathi Rao
కూతురంటే ఓ తండ్రికి ఎంత ప్రేమ ఉంటుంది? అంతా ఇంతా అని మాటల్లో చెప్పలేం.. తూకంతో కొలవలేం. సింపుల్ గా చెప్పాలంటే కూతురు అడగాలే గానీ.. కొండమీద కోతిని కూడా తెచ్చేస్తారు. అవసరమైతే ఈ లోకాన్ని కూడా జయించి చిరు బహుమతిగా ఇచ్చేస్తారు. అలాంటి ఓ గొప్ప తండ్రి కథే ఇది. అయితే అందరిలా ఈ తండ్రి అంత అదృష్టవంతుడు కాదు. ఆయన కుమార్తె 22 ఏళ్ల వయసులోనే అరుదైన రక్త సంబంధిత వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. కుమార్తె చివరి క్షణాల్లో ఆప్యాయంగా మాట్లాడే ఆస్కారం కూడా వారికి దొరకలేదు. ఎందుకంటే ఆమే గాత్రాన్ని కోల్పోయింది. కుమార్తె మరణం తర్వాత ఆ కుటుంబమే మూగబోయింది. అలాంటి క్షణాల నుంచి ఆ తండ్రి ప్రపంచమే నివ్వెరపోయే ఆవిష్కరణ చేశాడు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో తన కుమార్తెకు డిజిటల్ రూపంలో ప్రాణం పోశాడు.
ఈ కథ ప్రముఖ తైవాన్ నటుడు, సింగర్ టినో బావోది. అతని కుమార్తె బావో రాంగ్ 22 ఏళ్ల వయసులో అరుదైన రక్త సంబంధిత వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత టినో బావో దంపతులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మానేశారు. ఎందుకంటే వారి సంభాషణల్లో ఎక్కడ కూతురి ప్రస్తావన వస్తుందో? ఎక్కడ మళ్లీ ఆ క్షణాలు గుర్తో బాధేస్తుందో అని మాట్లాడుకోవడమే మానేశారు. ఆ తర్వాత ఒకరోజు టినో బావో తన భార్య పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ఒక వీడియో చూపించాడు. ఆ వీడియో ఒక యువతి టినో బావో భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. చివర్లో మిస్ యూ మామ్ అండ్ డాడ్ చెప్తుంది.
బావో రాంగ్ వీడియో చూసిన తర్వాత ఆ అమ్మాయి అచ్చం మన బావో రాంగ్ లా ఉంది కదూ అంటుంది. అప్పుడు టినో బావో.. ఆమె కుమార్తె బావో రాంగ్ అని చెప్తాడు. టినో బావో మాటలు విన్న భార్య ఎంతో ఆశ్చర్యపోతుంది. మన కుమార్తె మాట్లాడటం ఏంటి? ఎలా సాధ్యం అంటూ ప్రశ్నిస్తుంది. కూతురు మృతి తర్వాత వాళ్లు మాట్లాడుకోవడం అదే ప్రథమం. అప్పుడు టినో బావో జరిగింది చెప్తాడు. అసలు ఏం జరిగిందంటే.. చనిపోయేంత వరకు బావో రాంగ్ ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. అదే టినో బావోలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించింది. ఎలాగైనా చనిపోయిన తన కుమార్తెను తిరిగి తమ మధ్యకు తీసుకురావాలి అనుకున్నారు.
ఆర్టిఫిషియల్ ఇటిలిజెన్స్ సాయంతో తన కుమార్తెను డిజిటల్ గా బ్రతికించాలని నిర్ణయించుకున్నారు. టినో బావో అనుకున్నదే తడవుగా ఏఐ టెక్నాలజీలో PHD కూడా చేశారు. ఆ తర్వాత తన లక్ష్యాన్ని చేరుకునేందుకు మెయిన్ ల్యాండ్ అనే కంపెనీలోని టీమ్ తో కలిసి పనిచేశారు. తన కుమార్తెను డిజిటల్ గా రూపొందించేందుకు బావోకు పెద్ద ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే బావో రాంగ్ చేసిన వీడియోలు, రీల్స్ వంటివి ఉన్నాయి. వాటి సాయంతో బావో రాంగ్ రూపాన్ని తయారు చేశారు. కానీ, ఆమె వాయిస్ విషయంలోనే చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఆమె చివరి క్షణాల్లో ఏం మాట్లాడలేకపోయింది. బావో రాంగ్ తన భార్యతో మాట్లాడిన వీడియో కాల్ లో 3 ఆంగ్ల పదాలు ఉన్న వీడియో లభించింది. ఆ 3 ఇంగ్లీష్ వార్డ్స్ సాయంతో బావో రాంగ్ వాయిస్ ని టినో బావో సృష్టించారు.
ఇప్పుడు తన డిజిటల్ బావో రాంగ్ మాట్లాడగలదు, పాడ గలదు, డాన్సులు చేయగలదు. ఇదంతా వారి కుమార్తెను తిరిగి బతికంచలేకపోవచ్చు. కానీ, వారి కుమార్తె వారి మధ్య లేదు అనే బాధను, భావనను తొలగిస్తుంది. అంతేకాకుండా అలా చిన్న వయస్సులోనే తమ పిల్లలను కోల్పోయిన ఎంతోమందికి ఇది ఎంతోకొంత ఉపశమనాన్ని ఇస్తుంది. కుమార్తె అంటే బావోకి ఎంత ప్రేమ అంటే.. తన జుట్టు అంటే కూతురుకి ఇష్టం అని ఆమె చనిపోయాక జుట్టు కత్తిరించుకోలేదు. అలాగే ఆమె ఎముక ఒకటి లాకెట్ లా తన మెడలో వేసుకున్నారు. కుమార్తెపై తండ్రికి ఉండే ప్రేమ ఏదైనా చేయిస్తుంది.. ఎంతటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయిస్తుంది అనడానికి ఇది ప్రత్యక్ష సాక్షం అనే చెప్పాలి. మరి.. కుమార్తెపై ఉన్న ఎనలేని ప్రేమతో టినో బావో సృష్టించిన ఏఐ ఆవిష్కరణపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.