iDreamPost
android-app
ios-app

ఈ 6 చిట్కాలు పాటిస్తే.. AC బిల్లు సగానికి తగ్గిపోతుంది! ట్రై చేయండి!

  • Published Mar 14, 2024 | 3:32 PMUpdated Mar 14, 2024 | 3:32 PM

ప్రస్తుతం వేసవికాలం వచ్చేసింది. దీంతో ప్రతిఒక్కరూ ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి వెంటనే ఏసీలను కొనుక్కోవాలని నిర్ణయించుకుంటారు. కానీ, అలా ఏసీ వాడాలనుకునే వారు కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని భయపడుతంటారు. అలాంటి వారికి ఓ కరెంట్ బిల్లును తగ్గించే ఓ మంచి శుభవార్త అందింది.

ప్రస్తుతం వేసవికాలం వచ్చేసింది. దీంతో ప్రతిఒక్కరూ ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి వెంటనే ఏసీలను కొనుక్కోవాలని నిర్ణయించుకుంటారు. కానీ, అలా ఏసీ వాడాలనుకునే వారు కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందని భయపడుతంటారు. అలాంటి వారికి ఓ కరెంట్ బిల్లును తగ్గించే ఓ మంచి శుభవార్త అందింది.

  • Published Mar 14, 2024 | 3:32 PMUpdated Mar 14, 2024 | 3:32 PM
ఈ 6 చిట్కాలు పాటిస్తే..  AC బిల్లు సగానికి తగ్గిపోతుంది! ట్రై చేయండి!

ప్రస్తుతం వేసవికాలం వచ్చేసింది. భగ భగమని ఎండాలతో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా ఏప్రిల్, మే నెల వస్తే కానీ, సమ్మర్ వచ్చినట్టు అనిపించదు. ఎందుకంటే ఆయా నెలలో వేడి గాలులు అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ, ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరి నెలలోనే విపరీతమైన ఉక్కపోత మొదలైపోయింది. అలాగే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏండలు మండుతున్నాయి. మరి, ఇలాంటి సమయంలో అందరి ఇళ్లలో ఫ్యాన్లు రోజంతా నడవాల్సిందే.కానీ, ఆ ఫ్యాన్లుతో ఇళ్లలో తాత్కలిక ఉపశమనం తప్ప వేడిని తగ్గించి చల్లదనాన్ని నింపాలేవు. కనుక చాలామంది ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి వెంటనే ఏసీలను కొనుక్కోవాలని నిర్ణయించుకుంటారు. అలాగే ఇప్పటి వరకు ఇళ్లలో ఏసీలు ఆఫ్ చేసుకున్న వాళ్లు కూడా ఇప్పుడు ఆన్ లో పెట్టుకుంటున్నారు. అయితే ఇలా ఏసీలు నిరంతరం పెట్టుకున్న వారిలో తరుచుగా వచ్చే భయం ఏమిటంటే.. ఎక్కడ కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందని భయపడుతుంటారు. ఎందుకంటే.. వేసవిలో ఏసీ వాడితే బిల్లు వేలల్లో వస్తోందని అందరూ టెన్షన్ పడతారు.అయితే అలాంటి వారందరూ ఈ ఆరు సింపుల్ చిట్కాల్ పాటిస్తే ఏసీ బిల్లు తగ్గుతుంది. అదెలానో తెలుసుకుందాం.

సాధారణంగా వేసవి వచ్చిదంటే చాలు.. మధ్యతరగతి కుటుంబాలు కూడా ఏసీలను కొనుక్కోవాలని నిర్ణయించుకుంటారు. మరి అలా కొనుక్కోవాలనే అనుకున్నవారు.. వేలల్లో వచ్చే బిల్లును చూసి భయపడుతుంటారు. కానీ, అలాంటి వారందరూ ఇలా సింపుల్ చిట్కాన్ పాటిస్తే..24 గంటలూ ఏసీ ఆన్ చేసినా బిల్లు తగ్గుతుంది.అయితే ఇది చాలా తేలికైనది, వీటి ద్వారా ఎంతో ప్రయోజనం పొందవచ్చు.అదే ఎలా అంటే.. మొదట మీరు ఏసీని సరైన డిఫాల్ట్ ఉష్ణోగ్రతకు సెట్ చేస్తే.. అలా ఎలక్ట్రిసిటీ 6 శాతం ఆదా అవుతుంది. అప్పుడు మీరు AC ఉష్ణోగ్రతను ఎంత తగ్గించుకుంటే, మీ బిల్లు అంత తక్కువగా ఉంటుంది. ఇక ఏసీ ఏ ఒక్క పాయింట్ పెంచినా.. బిల్లు మాత్రం బాగా పెరగగలదు. కాబట్టి, ప్రతిఒక్కరూ డిఫాల్ట్ ఉష్ణోగ్రతను ఉంచడంపై దృష్టి పెట్టండి. ఇక మీ ACని 18 డిగ్రీల నుంచి 24 డిగ్రీల సెల్సియస్‌లో ఉంచండి.

AC bill tricks

సాధరణంగా పగటిపూట ఉష్ణోగ్రత బయట 34 నుంచి 38 డిగ్రీల వరకు ఉంటుంది. అందులో మన శరీర ఉష్ణోగ్రత 36 నుంచి 37 డిగ్రీలు ఉంటుంది. దీని ప్రకారం చూసుకుంటే అతి తక్కువ ఉష్ణోగ్రత మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. కాబట్టి, AC 23-24 దగ్గర ఉంచినట్లయితే సరైన కూలింగ్ పొందవచ్చు. తద్వారా బిల్లు కూడా పెరగదు. అలాగే AC ఆన్‌లో ఉన్నప్పుడు మరి ఏ ఇతర ఎలక్ట్రికల్ పరికరాల్ని వాడొద్దు. తద్వారా వాటి నుంచి వేడి రాకుండా ఉంటుంది. పైగా, అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఏసీ నడుస్తున్న గదిని సరిగ్గా మూసివేయాలి. ఇక సూర్యకిరణాలు ఆ గదిలో పడితే.. ఏసీపై భారాన్ని పెంచుతాయి. కాగా, మీరు గదిని ఎక్కువసేపు చల్లబరచాలనుకుంటే.. ముఖ్యంగా రాత్రి సమయంలో AC ఉష్ణోగ్రతను సెట్ చేసి, దానిని కొంతసేపు రన్ చేయండి. ఇక గది చల్లబడిన తర్వాత.. 2 గంటల పాటు AC స్విచ్ ఆఫ్ చేయండి. మళ్లీ ఆన్ చేసి.. చల్లబడిన తర్వాత 2 గంటలు ఆపివేయండి. ఇలా చేయడం వల్ల కూడా కరెంటు వాడకం బాగా తగ్గి, బిల్లు తగ్గుతుంది. ఇలా సరైన సమయంలో ఈ విధంగా చేస్తే కరెంటు బిల్లులు 5 నుంచి 15 శాతం తగ్గుతుంది. మరి, ఏసీలు వాడాలని అనుకొని భయపడే వాళ్ల కోసం అందుబాటులో ఉండే ఈ 6 చిట్కాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి