Vinay Kola
Google Chrome: చాలా మంది కూడా గూగుల్ క్రోమ్ సేఫ్ అని ఎలా పడితే అలా వాడేస్తుంటారు. కానీ కొన్ని సెట్టింగ్స్ మార్చుకోపోతే చాలా ప్రమాదంలో పడతారు.
Google Chrome: చాలా మంది కూడా గూగుల్ క్రోమ్ సేఫ్ అని ఎలా పడితే అలా వాడేస్తుంటారు. కానీ కొన్ని సెట్టింగ్స్ మార్చుకోపోతే చాలా ప్రమాదంలో పడతారు.
Vinay Kola
గూగుల్ క్రోమ్.. గూగుల్ తయారు చేసిన ఫేమస్ వెబ్ బ్రౌజర్. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉపయోగించే సర్చింగ్ యాప్ ఇది. చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ లో కూడా చాలా బాగా పనిచేయగలిగే విధంగా క్రోమ్ ను గూగుల్ తయారు చేసింది. ఓఎస్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ లో చాలా స్పీడ్ గా పనిచేసే గూగుల్ క్రోమ్ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. కొన్ని సెట్టింగ్స్ గురించి కూడా తెలుసుకోకపోతే అన్నే నష్టాలు ఉన్నాయి. గూగుల్ క్రోమ్ యూజర్లు కచ్చితంగా కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి లేదంటే ప్రమాదంలో పడినట్టే. ఇంతకీ ఆ సెట్టింగ్స్ ఏంటి? అవి మార్చుకోపోతే అసలేం జరుగుతుంది? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
గూగుల్ క్రోమ్ మీ ఫోన్ కెమెరాను వాడేస్తుంది. మీ లొకేషన్ ని ట్రాక్ చేస్తుంది. మీ ఫోన్ లో మీరు మాట్లాడే సమాచారాన్ని వింటుంది. మీ ఫోన్ లో మీ పర్సనల్ డేటాని ప్రమాదకరమైన థర్డ్ పార్టీ సైట్ లు యాక్సెస్ చేయడానికి సహకరిస్తుంది. అయితే గూగుల్ క్రోమ్ ఇలా చేయడానికి కారణం ఎవరో కాదు. అది మీరే. మీరే గూగుల్ క్రోమ్ కి పర్మిషన్ ఇస్తారు. మీరు చేసే ప్రతీ విషయాన్ని తెలిసేలా చేస్తారు. గూగుల్ క్రోమ్ లో మీకు తెలియకుండానే మీ ఫోన్ ఎక్కడికి వెళితే అక్కడికి కొన్ని సైట్స్ కూడా వచ్చేస్తున్నాయి. దాన్లో మీరు చేసే ప్రతీ పని కూడా రికార్డు అవుతుంది. నమ్మలేకపోతున్నారు కదా.. కానీ ఇదే నిజం. గూగుల్ క్రోమ్ లో బ్యాక్ గ్రౌండ్లో రన్ అవుతున్న కొన్ని తెలియని వెబ్సైట్స్ మీరు చేసే ప్రతి పనిని చూస్తున్నాయి. ప్రతీ విషయాన్ని కెమెరాతో చూసేస్తున్నాయి. అందువల్ల సైబర్ స్కామ్స్ జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇక ఈ విషయం ఇప్పటివరకు తెలియకపోతే ఇకనైనా ఇప్పుడు చెప్పే సెట్టింగ్స్ అన్నీ మార్చుకోండి. జాగ్రత్తగా ఉండండి.
ముందుగా క్రోమ్ ను ఓపెన్ చేయండి. కుడి వైపు పైన కనిపించే మూడు డాట్స్ ను క్లిక్ చేయండి. ఇందులో సెట్టింగ్స్ ను క్లిక్ చేయండి.అందులో సైట్ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయాలి. తరువాత అందులో పర్మిషన్స్ లో లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్ ఇంకా చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటన్నిటికీ పర్మిషన్స్ బ్లాక్ లో పెట్టుకోండి. లేదా ఆస్క్ ఫస్ట్ ఆప్షన్ లో పెట్టుకోండి. అలాగే కంటెంట్ ఆప్షన్ లో థర్డ్ పార్టీ కుకీస్, థర్డ్ పార్టీ సైన్ ఇన్, యాడ్స్ లాంటివి బ్లాక్ లో పెట్టుకోండి. అలాగే ఆన్ డివైజ్ సైట్ డేటా ఆప్షన్ ని ఆఫ్ లో పెట్టుకోండి.అలాగే అక్కడ డేటా స్టోర్ లో ఏమైనా లింక్స్ కనిపిస్తే వాటిని వెంటనే డిలేట్ చేయండి. కచ్చితంగా ఈ సెట్టింగ్స్ మార్చుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.