Tirupathi Rao
ప్రస్తుతం మార్కెట్ లో చాలానే ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్స్, యాప్స్ ఉన్నాయి. అందరూ కూడా ఆన్ లైన్ లోనే షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే ఇప్పుడు అలాంటి సైట్స్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్ లో చాలానే ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్స్, యాప్స్ ఉన్నాయి. అందరూ కూడా ఆన్ లైన్ లోనే షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే ఇప్పుడు అలాంటి సైట్స్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు.
Tirupathi Rao
ఆన్ లైన్ షాపింగ్, ఇ-కామర్స్ సైట్స్ గురించి ఇప్పుడు అందరికీ తెలిసిందే. ఏ చిన్న వస్తువు కొనుగోలు చేయాలన్నా ఇ-కామర్స్ వెబ్ సైట్స్ లోనే ఎక్కువగా షాపింగ్ చేస్తున్నారు. ఇలా ఆన్ లైన్ షాపింగ్ చేసే వారికి తప్పకుండా మీషో పేరు తెలిసే ఉంటుంది. నిజానికి చాలా తక్కువ సమయంలోనే ఈ షాపింగ్ సైట్ కి మంచి ఆదరణ లభించింది. ఇక్కడ మీరు డైరెక్ట్ గా మీ వస్తువులు సేల్ చేసుకోవచ్చు. అలాగే వేరే వాళ్ల ప్రొడక్టులను కొనుగోలు చేసి మళ్లీ మీరు సేల్ చేయచ్చు. అంతేకాకుండా ఈ సైట్ లో వస్తువులు కాస్త తక్కువ ధరలకే లభిస్తాయి. అందుకే మీషోకి చాలా మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ ఆదరణను అడ్డుపెట్టుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో మీషో స్కామ్ ఒటకి అందరినీ భయపెడుతోంది. మీషో అనేది అందరికీ తెలిసిన ఇ-కామర్స్ సైట్ కాబట్టి అందరూ ఇట్టే మోసపోతున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ఒక అమ్మాయికి మీషో నుంచి ఒక ఫామ్, ఒక స్క్రాచ్ కార్డును పంపారు. ఆ స్క్రాచ్ కార్డులో ఆమెకు మహీంద్రా XUV 500 కారు వచ్చినట్లు పేర్కొన్నారు. రిజిస్టర్ చేసుకునేందుకు అక్కడున్న క్యూర్ కోడ్ ని కాపీ చేయాల్సిందిగా సూచించారు. ఆమె అలా క్యూఆర్ కోడ్ ని స్క్రాచ్ చేయగానే వెంటనే ఆమె గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ నుంచి అకౌంట్లో ఉన్న అన్నీ డబ్బులు విత్ డ్రా అయిపోయాయి.
మీరు వాళ్ల ట్రాప్ లో పడరు అనే ఉద్దేశంతో ఫామ్ మీద కస్టమర్ కేర్ నంబర్ ని కూడా పెడతారు. మీరు ఆ నంబరుకు ఫోన్ చేస్తే మీకు నిజంగానే కారు వచ్చిందని మిమ్మల్ని నమ్మిస్తారు. ఎలాగైనా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేలా మిమ్మల్ని ఇన్ ఫ్లుఎన్స్ చేస్తారు. ఇలాంటి మోసాలు ఒక్క మీషో కంపెనీ పేరు మీదనే కాదు.. అన్నీ ప్రముఖ కంపెనీల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారు. ఫామ్స్ పంపడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిందిగా చెప్పడం చేస్తున్నారు. కారు గెలుచుకున్నారని, రూ.10 లక్షల నగదు గెలుపొందారంటూ మోసం చేస్తున్నారు. ఆ ఫామ్స్ మీద ఉండే క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయగానే వారి ఖాతాల నుంచి డబ్బులు పోతున్నాయి. ఇలాంటి బాధితులు చాలా మందే ఉన్నారు.
నెట్టింట వారు మోసపోయిన తీరును పోస్టుల రూపంలో పెడుతున్నారు. ఒకళ్లు రూ.15 వేలు మోసపోయామని, మరొకరు మా ఖాతా నుంచి రూ.5 వేలు కట్ అయ్యాయని కామెంట్ చేస్తున్నారు. మీషో కస్టమర్ కేర్ కి కాల్ చేసినా కాడ వాళ్లు స్పందించడం లేదని చెబుతున్నారు. అయితే మీషో కంపెనీకి ఈ మోసాలకు ఎలాంటి సంబంధం ఉండదు. అందుకే వాళ్లు రెస్పాండ్ కారు. మీషో వాల్లు ఏమైనా ఆఫర్స్, కార్స్ గిఫ్ట్ గా ఇవ్వాలి అంటే ముందు వారి వెబ్ సైట్ లో మెన్షన్ చేస్తారు. కావాలంటే సెలబ్రిటీలతో యాడ్స్ చేయిస్తారు. ఇలా నేరుగా ఇంటికి వచ్చే ఫామ్స్, స్క్రాచ్ కార్డులను స్కాన్ చేసి మోసపోకండి. ఇలాంటి ఎన్నో రకాల మోసాల భారిన పడకుండా ఉండేందుకు చైతన్యంతో ఉండండి. ఈ మీషో తరహా మోసాల నుంచి మీ బంధుమిత్రులను కాపాడేందుకు ఈ విషయాన్ని వారికి షేర్ చేయండి.