iDreamPost
android-app
ios-app

Samsung Galaxy M55s: అద్భుతమైన కెమెరాతో లాంచ్ కానున్న శాంసంగ్ గెలాక్సీ M55s!

  • Published Sep 21, 2024 | 8:24 AM Updated Updated Sep 21, 2024 | 8:24 AM

Samsung Galaxy M55s: శాంసంగ్ గెలాక్సీ M55s స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు కీలకమైన ఫీచర్స్ ను అనౌన్స్ చేసింది.

Samsung Galaxy M55s: శాంసంగ్ గెలాక్సీ M55s స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు కీలకమైన ఫీచర్స్ ను అనౌన్స్ చేసింది.

Samsung Galaxy M55s: అద్భుతమైన కెమెరాతో లాంచ్ కానున్న శాంసంగ్ గెలాక్సీ M55s!

శాంసంగ్ కంపెనీ గెలాక్సీ M55s స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు డిజైన్, ఫీచర్స్ ను కూడా అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే.. శామ్సంగ్ ఫోన్ లలో ఇప్పటి దాకా చూడని సరికొత్త డిజైన్ తో ఈ ఫోన్ రానుంది.ఇక ఈ శామ్సంగ్ గెలాక్సీ ఎం 55s స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది సరికొత్త ఫ్యూజన్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ చాలా సన్నగా ఇంకా బ్యాక్ ప్యానల్ లో ఆకర్షణీయమైన డబుల్ డిజైన్ ప్యాట్రన్ ను కలిగి వుంది. నిజానికి ఇప్పటి దాకా శామ్సంగ్ కేవలం రెగ్యులర్ సింగిల్ కలర్ తో మాత్రమే తన ఫోన్ లను తీసుకొచ్చింది.

అయితే, ఇప్పుడు ఈ కొత్త గెలాక్సీ M55s ఫోన్ ను మాత్రం సరికొత్త డిజైన్ తో వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ 50MP OIS మెయిన్ + 8MP అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో సెన్సార్లు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇది షేక్ అవ్వని వీడియోలని బ్లర్ ఫ్రీ ఫోటోలు అందిస్తుందని శామ్సంగ్ కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో ఏకంగా 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ సెల్ఫీ కెమెరాతో గ్రూప్ ఫోటోలు ఇంకా వీడియో రికార్డింగ్ తో పాటు క్వాలిటీ వీడియో కాలింగ్ ఫీచర్ కూడా ఉంటుందని శామ్సంగ్ కంపెనీ తెలిపింది. అలాగే ఈ ఫోన్ లో 6.67 అంగుళాల సూపర్ AMOLED స్క్రీన్ ఉంటుందని శామ్సంగ్ తెలిపింది.

శాంసంగ్ కంపెనీ గెలాక్సీ M55s స్మార్ట్ ఫోన్ స్క్రీన్ FHD+ రిజల్యూషన్ తో వస్తుంది. ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇక కలర్స్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ థండర్ బ్లాక్ ఇంకా అలాగే కోరల్ గ్రీన్ రెండు కలర్ ఆప్షన్ లలో లాంచ్ అవుతుంది. శామ్సంగ్ కంపెనీ ఈ సరికొత్త గెలాక్సీ ఎం 55s స్మార్ట్ ఫోన్ ను సెప్టెంబర్ 23న లాంచ్ చేస్తునట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త డిజైన్ తో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ స్పెషల్ గా తీసుకు వస్తోంది. అందుకే, అమెజాన్ ఇండియా ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజి కూడా టీజ్ చేస్తోంది. ఇక సెప్టెంబర్ 23న లాంచ్ కాబోయే ఈ సరికొత్త గెలాక్సీ ఎం 55s స్మార్ట్ ఫోన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.