iDreamPost
android-app
ios-app

శాంసంగ్ నుంచి క్రేజీ డీల్.. 16 వేలకు రూ.40 వేల ఫోన్ లో ఉండే ఫీచర్స్!

Samsung Galaxy M35 5G Price And Specifications: మార్కెట్ లోకి శాంసంగ్ కంపెనీ నుంచి ఒక అదిరిపోయే బడ్జెట్ ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్ లో మీకు రూ.40 విలువచేసే ఫ్లాగ్ షిప్ ఫోన్ ఫీచర్స్ ఉండటం విశేషం.

Samsung Galaxy M35 5G Price And Specifications: మార్కెట్ లోకి శాంసంగ్ కంపెనీ నుంచి ఒక అదిరిపోయే బడ్జెట్ ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్ లో మీకు రూ.40 విలువచేసే ఫ్లాగ్ షిప్ ఫోన్ ఫీచర్స్ ఉండటం విశేషం.

శాంసంగ్ నుంచి క్రేజీ డీల్.. 16 వేలకు రూ.40 వేల ఫోన్ లో ఉండే ఫీచర్స్!

స్మార్ట్ ఫోన్స్ లో ఇప్పుడు పోటీ పెరిగిపోయింది. ఎలా అయితే వినియోగదారులు పెరుగుతున్నారో.. అలాగే కంపెనీలు కూడా పెరిగిపోయాయి. అందుకే క్రేజీ ఫీచర్స్ తో బడ్జెట్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి శాంసంగ్ 5జీ ఫోన్ చేరబోతోంది. ఇండియాలో లాంఛ్ అయిన ఈ శాంసంగ్ ఫోన్ ఫీచర్స్, ప్రైస్ డీటెయిల్స్ చూస్తే పిచ్చెక్కిపోతారు. ఎందుకంటే ఫ్లాగ్ షిప్ ఫోన్లలో ఉండే ఫీచర్స్ తో ఈ బడ్జెట్ ఫోన్ ని తీసుకొస్తున్నారు. పైగా దీనిపై అదనంగా ప్రముఖ ఇ-కామర్స్ స్పెషల్ సేల్ ఆఫర్స్ కూడా ఉంటాయి. మరి.. ఆ శాంసంగ్ కంపెనీ తీసుకొచ్చిన్న కొత్త మోడల్ ఏది? దాని ధర ఎంత? ఫీచర్స్ ఏంటి? చూద్దాం.

శాంసంగ్ కంపెనీ బడ్జెట్ ధరలో మంచి 5జీ ఫోన్స్ అందించడానికి ఎం సిరీస్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ M సిరీస్లోనే ఇంకో స్మార్ట్ ఫోన్ ని లాంఛ్ చేశారు. ఈ మోడల్ పేరు శాంసంగ్ గ్యాలెక్సీ ఎం35 5జీ ఫోన్. ప్రస్తుతం భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఇది వైరల్ అవుతోంది. ఎందుకంటే ఇందులో ఫ్లాగ్ షిప్ తరహా ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఎం35 5జీ మొత్తం 3 వేరియంట్లలో వస్తోంది. 6 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్+ 256 స్టోరేజీ వేరియంట్ తో వస్తోంది.

ఈ ఫోన్ బేసిక్ మోడల్ ధరను రూ.19,999గా నిర్ణయించారు. అయితే దీనిపై మీకు ఆఫర్స్ అయితే ఉంటాయి. అన్నీ బ్యాంక్స్ కి రూ.2 వేలు ఇన్ స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే ప్రైమ్ డే కూపన్ ద్వారా మీరు రూ.1000 డిస్కౌంట్ పొందచ్చు. కానీ, తొలి వెయ్యి మంది కొనుగోలుదారులకు మాత్రమే ఈ కూపన్ ద్వారా డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే సెలక్టెడ్ ఎం సిరీస్ యూజర్స్ కూడా అదనంగా రూ1000 డిస్కౌంట్ పొందచ్చు. అంటే ఓవరాల్ గా మీరు శాంసంగ్ ఎం35 5జీ ఫోన్ రూ.15,999కి పొందవచ్చు. జులై 21 నుంచి ఇ- కామర్స్ వెబ్ సైట్ లో అందుబాటులోకి రానుంది. ఈ శాంసంగ్ గ్యాలెక్సీ ఎం35 5జీ ఫోన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఎం35 5G ఫీచర్స్:

  • 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ+ ఆమోలెడ్ డిస్ ప్లే
  • 120 హెట్డ్ రిఫ్రెష్ రేట్
  • 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్
  • డాల్బీ అట్మాస్.. స్టీరియో స్పీకర్స్
  • శాంసంగ్ ఎక్సీనోస్ 1380 ప్రాసెసర్(40 వేల ఫోన్లలో ఈ ప్రాసెసర్ వాడారు)
  • గేమింగ్ పరంగా బెస్ట్ ఆప్షన్.. 60fpsలో బీజీఎంఐ ఆడచ్చు.
  • 5.95+ లక్షల అన్ టుటు స్కోర్ ఉంది.
  • హీట్ కంట్రోల్ కోసం వ్యాపర్ కూలింగ్ ఛాంబర్ ఉంది.
  • నాక్స్ సెక్యూరిటీ ఉంటుంది.
  • డిజిటల్ కార్డ్స్ క్రియేట్ చేసుకుని.. ఫోన్ తో ట్యాప్ అండ్ పే చేయచ్చు.
  • 50 ఎంపీ+ 8 ఎంపీ+ 2 ఎంపీ కెమెరా
  • 13 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • ఫొటో తీశాక కొన్ని మ్యాజిక్ ఫీచర్స్ వాడచ్చు.
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్
  • రివర్ ఛార్జర్ గా వాడుకోవచ్చు.. పవర్ బ్యాంక్ లా
  • 4 ఓఎస్ అప్ డేట్స్- 5 ఇయర్స్ సెక్యూరిటీ అప్ డేట్స్
  • సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్