P Krishna
Samsung: మొబైల్, టీవీ, హోమ్ అప్లయెన్సెస్ రంగంలో ఇలా అన్ని రంగాల్లో తన మార్క్ ని క్రియేట్ శాంసంగ్. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకొని కొత్త ప్రాడక్ట్స్ మార్టెట్ లోకి తెస్తుంది.
Samsung: మొబైల్, టీవీ, హోమ్ అప్లయెన్సెస్ రంగంలో ఇలా అన్ని రంగాల్లో తన మార్క్ ని క్రియేట్ శాంసంగ్. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకొని కొత్త ప్రాడక్ట్స్ మార్టెట్ లోకి తెస్తుంది.
P Krishna
టెక్ మార్కెట్ దిగ్గజాలలో ఒకటైన సామసంగ్ మొబైల్ రంగంలో, టీవీ రంగంలో, హోమ్ అప్లయెన్సెస్ రంగంలో ఇలా అన్ని రంగాల్లో తన మార్క్ ని క్రియేట్ చేసుకుంది. ఎప్పటికప్పుడు అధునాతనమైన టెక్నాలజీ ని పరిచయం చేస్తూ ప్రజలను మెప్పిస్తునే ఉంటుంది. అదే కోవలో ఇప్పుడు సరి కొత్త టీవీని మన ముందుకు తీసుకుని వచ్చింది.
జనాలకి 4G అలావాటు అయినప్పటి నుండి విషువల్స్ లో క్వాలిటీని చాలా బలంగా కోరుకుంటున్నారు. టెక్ సంస్థలు కూడా వారి ఫోన్ స్క్రీన్ అయినా లేదా TV స్క్రీన్ అయినా విషువల్ డెప్త్ ఉండేలా చుసుకుంటున్నాయి. ఒకప్పుడు 1280*720 ఉండే రీసొల్యూషన్ ని 1920*1080 స్టాండర్డ్ సైజు గా అయిపొయింది, కాని 4G ఇంటర్నెట్ జి ప్రజలు ఎక్స్పీరియన్స్ చేసిన తరవాత గ్లోబల్ కంటెంట్ యాక్సెస్ రావడంతో అత్యద్భుతమైన క్వాలిటీ ని అన్ని వర్గాల ప్రజలు అనుభూతి చెందడం మొదలు పెట్టారు, డిమాండ్ ని బట్టే సప్లై కూడా ఉండాలి కాబట్టి టెక్ సంస్థలు కూడా ఆ ఎక్స్పీరియన్స్ ని ఈ మాత్రం తగ్గించకుండా 4K రీసొల్యూషన్ ని తీసుకుని వచ్చారు.
ఈ సామసంగ్ 2024 QLED 4Kని ఇండియన్ మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఈ సిరీస్ రూ.65,990 నుంచి ప్రారంభమవుతాయి. ఈ తాజా లైనప్ మోడరన్ ఫీచర్‌లతో, ప్రీమియం విషువాల్ ఎక్స్పీరియన్స్ ని అందించాలని సంకల్పించుకున్నారు. 2024 QLED 4K టీవీ సిరీస్ మూడు స్క్రీన్ సైజుల్లో ఉంటుంది. 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్ అందుబాటులో ఉంది. ఈ టీవీ ఇప్పటికే సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లో సేల్ కి అందుబాటులో ఉంది. ఈ టీవీలో క్వాంటం ప్రాసెసర్ లైట్ 4కేతో ఉంటుంది. అంతే కాకుండా ఇందులో క్వాంటం టెక్నాలజీతో పాటు క్వాంటం HDR 100 కలర్ వాల్యూం కలిగి ఉంది. ఇలాంటి ఫీచర్స్ ఇందులో ఇంకా చాలా ఉన్నాయి అవి ఇప్పుడు చూద్దాం. సామ్‌సంగ్ 2024 QLED 4K టీవీలు 4K అప్‌స్కేలింగ్‌ను కూడా అందిస్తాయి. ఇది విషువల్ రిజల్యూషన్‌ను బాగా చూపిస్తుంది. క్యూ-సింఫనీ సౌండ్ టెక్నాలజీ తో మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. డ్యూయల్ ఎల్ఈడీ, గేమ్స్ అదెప్పుడు స్మూత్ గా ఉండడం కోసం మోషన్ యాక్సలేటర్, ట్రూ కలర్స్ కనిపించేలా పాన్‌టోన్ వాలిడేషన్ టెక్నాలజీ ని అమర్చారు. 2024 QLED 4K సిరీస్ డిజైన్ అందరినీ ఆకర్షిస్తుంది.
ఎయిర్‌స్లిమ్ డిజైన్‌తో చాలా సన్నగా ఉంటాయి. స్క్రీన్ కి ఎలాంటి బోర్దెర్స్ లేదా ప్యానల్ ఉండదు, టీవీకి ముందు భాగం కనిపించేది మొత్తం కూడా స్క్రీన్ మాత్రమే ఉంటుంది. హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సెటప్‌ను కూడా ఇన్ బిల్ట్ ఇవ్వడంతో సౌండ్ ని హోం థియేటర్ లా కూడా అద్జుస్త్ చేసుకోవచ్చు. అలాగే వీటి బిల్డ్ క్వాలిటీ కూడా ఇంతకముందు టీవీల కన్నా చాలా బలంగా ఉంటాయి. అలాగే మతి మాటికి బాటరీ అయిపోతుంది అనే బాధ లేకుండా రిమోట్ కి సోలార్ సెల్ ని అమర్చారు. అలాగే ఎంత పవర్ అవసరమో అంతే తీసుకునేలా ఏఐ ఎనర్జీ మోడ్ ని కూడా ఇందలో ఉంచారు. ఇవి ఈ టీవీ లో యునీక్ ఫీచర్స్ అని చెప్పొచ్చు.
అలాగే 2024 QLED 4K సిరీస్‌లో క్యూ సింఫనీ, ఓటీఎస్ లైట్, అడాప్టివ్ సౌండ్ ఫీచర్‌లు ఉన్నాయి.ఇవి లేటేన్సీ లేకుండా విషువల్ ని రియల్ టైములో చూపిస్తుంది. అలాగే 3D సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్‌ను కూడా క్రీయెట్ చేస్తుంది. గేమర్‌లను మోషన్ ఎక్స్‌సెలరేటర్, ‘ఆటో లో లాటెన్సీ’ మోడ్ మంచి ఎక్స్పీరియన్స్ ని అందిస్తాయి. స్క్రీన్ మోషన్ స్మూత్‌నెస్‌ని ఇంకా స్మోత్ గా చేస్తాయి. అలాగే తక్కువ డిలేతో వేగవంతమైన ఫ్రేమ్ ట్రాన్సిషన్‌లను అందిస్తాయి. కొత్త టీవీలు సామ్‌సంగ్‌కు సంబంధించిన టీవీ ప్లస్ సర్వీస్‌తో పాటు 100కి పైగా ఉచిత ఛానెల్‌లను అందిస్తుంది కుడా. ఇంటర్నల్ మల్టీ వాయిస్ అసిస్టెంట్ ద్వారా మంచి కనెక్టవిటీను కూడా అందిస్తుంది. మరి ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ టీవీ సేల్స్ కూడా స్పీడ్ గా నే ఉన్నాయి. మీకు ఈ ఫీచర్స్ నచ్చితే త్వరగా బుక్ చేసుకాకపోతే అవుట్ అఫ్ స్టాక్ కి వెళ్లిపోవచ్చు.