P Venkatesh
Jio tag air: మీ వస్తువులను ఎక్కడో పెట్టి మర్చిపోతున్నారా? ఇక నుంచి ఆ బెంగ అక్కర్లేదు. రిలయన్స్ జియో మరో స్మార్ట్ పరికరాన్ని తీసుకొచ్చింది. జియో ట్యాగ్ ఎయిర్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఇది మీ వద్ద ఉంటే వస్తువులు మిస్ కావు.
Jio tag air: మీ వస్తువులను ఎక్కడో పెట్టి మర్చిపోతున్నారా? ఇక నుంచి ఆ బెంగ అక్కర్లేదు. రిలయన్స్ జియో మరో స్మార్ట్ పరికరాన్ని తీసుకొచ్చింది. జియో ట్యాగ్ ఎయిర్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఇది మీ వద్ద ఉంటే వస్తువులు మిస్ కావు.
P Venkatesh
ప్రస్తుత రోజుల్లో అంతా బిజీ లైఫ్ కి అలవాటు పడిపోయారు. స్ట్రెస్ తో కూడిన జాబ్స్.. కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కలగలుపుకుని మతిమరుపుకు లోనవుతుంటారు. దీని కారణంగా ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులను సైతం మర్చిపోతుంటారు. మతిమరుపుతో వారు నిత్యం యూజ్ చేసే వస్తువులను కూడా ఎక్కడో ఓ చోట పెట్టి మర్చిపోతుంటారు. ఆ తర్వాత చూసుకుని వెతకడం ప్రారంభిస్తారు. సినిమాకు వెళ్లినప్పుడు, హోటల్స్, ఆఫీసుల్లో, ఇంట్లో కూడా వస్తువులను మర్చిపోతుంటారు. ఇలాంటి సమయాల్లో మర్చిపోయిన వస్తువులను వెతికేందుకు ఏదైనా పరికరం ఉంటే బాగుండని ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. మీ వస్తువులను వెతికి పెట్టే పరికరం అందుబాటులోకి వచ్చింది. రిలయన్స్ జియో మరో స్మార్ట్ పరికరాన్ని తీసుకొచ్చింది. జియో ట్యాగ్ ఎయిర్‌ను తాజాగా లాంచ్ చేసింది.
మతిమరుపు అనేది సహజం. చాలా మంది మతిమరుపుతో విలువైన వస్తువులను పోగొట్టుకుంటుంటారు. మరి మీకు కూడా మీ వస్తువులను ఎక్కడో పెట్టి మర్చిపోతున్నారా? ఇక మీ సమస్య తీరినట్టే. ఈ పరికరం మీ వద్ద ఉంటే చాలు మీ వస్తువులు అస్సలు మిస్ కావు. రిలయన్స్ జియో తీసుకొచ్చిన జియో ట్యాగ్ ఎయిర్ తో మర్చిపోయిన వస్తువులను ఎక్కడున్నా గుర్తించొచ్చు. ఇళ్లు, బైక్ తాళాలు, లగేజీ, వాలెట్, పెంపుడు జంతువులు.. ఇలా ఏ వస్తువులైనా మిస్ అవ్వకుండా ఉండేందుకు ఈ స్మార్ట్ డివైజ్ పనికొస్తుంది. దీనిలోని ఫైండ్ డివైజ్ ఫీచర్ ద్వారా వస్తువులను ఎక్కడున్నా కనిపెట్టొచ్చు. మీ వస్తువులకు జియో ట్యాగ్‌ను అటాచ్ చేయడం ద్వారా మీరు మర్చిపోయిన వస్తువులకు అలర్ట్స్ పొందొచ్చు. వస్తువు చివరి డిస్కనెక్షన్ను సులువుగా తెలుసుకోవచ్చు.
జియో ట్యాగ్ ఎయిర్ రెండు రకాల ట్రాకింగ్ యాప్స్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు జియో థింగ్స్ యాప్‌తో దీన్ని వాడుకోవచ్చు. యాపిల్ యూజర్లు ఫైండ్ మై నెట్‌వర్క్ యాప్ ద్వారా ఈ డివైజ్‌ను యూజ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 9, ఐఓఎస్ 14, ఆపై ఓఎస్‌తో ఫోన్లలో ఈ యాప్ పనిచేస్తుంది. ఈ ట్రాకర్ బ్లూటూత్ 5.3తో పనిచేస్తుంది. బిల్ట్ ఇన్ స్పీకర్ కూడా ఉంటుంది. ఇది 90-120డీబీ రేంజ్‌తో శబ్దం చేయగలదు. ఇందులోని బ్యాటరీ 12 నెలల పాటు పనిచేస్తుంది. జియోట్యాగ్ ఎయిర్ ధరను ప్రారంభ ఆఫర్ కింద రూ.1,499గా నిర్ణయించింది కంపెనీ.