Arjun Suravaram
Unlimited 5G Data: 5జీ వినియోగదారులకు షాకిచ్చేందుకు దేశీయ టెలికాం సంస్థలు సిద్ధమవుతున్నాయి. అపరమిత 5జీ సేవలను కీలక నిర్ణయం తీసుకోనున్నాయని తెలుస్తోంది. దిగ్గజ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ 5జీ సేవలపై ఓ ప్లాన్ సిద్ధం చేస్తున్నాయట.
Unlimited 5G Data: 5జీ వినియోగదారులకు షాకిచ్చేందుకు దేశీయ టెలికాం సంస్థలు సిద్ధమవుతున్నాయి. అపరమిత 5జీ సేవలను కీలక నిర్ణయం తీసుకోనున్నాయని తెలుస్తోంది. దిగ్గజ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ 5జీ సేవలపై ఓ ప్లాన్ సిద్ధం చేస్తున్నాయట.
Arjun Suravaram
ప్రస్తుత ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ తప్పని సరిగా ఉంటుంది. ఇక టెలికాం సంస్థలు కూడా వినియోదారుల అవసరాలకు తగ్గట్లు అనేక ఆఫర్లను ప్రకటిస్తూ..ఆకర్షిస్తున్నాయి. అలానే టెలికాలం రంగంలో 2జీ,3జీ,4జీ సేవలు అనేవి ఉండేవి. 2022 అక్టోబర్ లో భారత్ లో 5 జీ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. దేశంలో టాప్ 2 టెలికాం ఆపరేటర్లుగా ఉన్న రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మాత్రమే తమ వినియోగదారులకు 5జీ సేవలను అందిస్తున్నాయి. కొన్ని ప్లాన్లపై అన్ లిమిటెడ్ 5జీ డేటాను కూడా సదరు సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. అయితే తాజాగా 5జీ యూజర్లకు ఎయిర్ టెల్, జియో షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ టెలికాం సంస్థలు 2022 అక్టోబర్ నుంచి భారత దేశంలో 5జీ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే . ప్రస్తుత 4 జీ రేట్లతోనే అన్ లిమిటేడ్ 5జీ సేవలను కూడా అందిస్తున్నాయి. అయితే ఈ 2024 ద్వితీయార్థం నుంచి ఆ సేవలకు ఛార్జీలు వసూలు చేసే ఆలోచనలో ఉన్నాయంట. 4జీతో పోల్చుకుంటే 5 నుంచి 10 శాతం అధిక ధరతో 5జీ టారిఫ్‌ను వసూలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి కొన్ని ప్లాన్లపై అన్ లిమిటెడ్ 5జీ డేటాను ఆఫర్ చేస్తున్నాయి. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాల్లోని యూజర్లకు మాత్రమే దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఉచితంగా అదనపు డేటాను ఆస్వాదిస్తున్నారు. 5జీ వినియోగదారులు పెరుగుతున్న తరుణంలో రేట్లు పెంచి ప్రయోజనం పొందాలని ఈ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్ కంపెనీలకు సంయుక్తంగా 12.5 కోట్లకు పైగా 5జీ వినియోగదారులు ఉన్నారు.
ఈ ఏడాది చివరి నాటికి ఆ సంఖ్య 20 కోట్లు దాటుతుందని టెలికాం రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరందరూ కొన్ని ప్లాన్లపై అన్ లిమిటెడ్ 5జీ డేటాను పొందుతున్నారు. రేట్లు పెంచిన తర్వాత వీరంతా ఇలాగే కొనుసాగుతారో లేదో అనేది తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు వేచి చూడాలి. 4జీ వినియోగదారులు 5జీ కి అప్ గ్రేడ్ అయ్యేలా ఆకర్షించేందుకు ఈ రెండు టెలికాం ఆపరేటర్లు 2022 నుంచి 5జీ సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. ఒక్క రూపాయి కూడా అదనంగా చెల్లించనవసరం లేకుండా 5జీ సేవలను ఆఫర్ చేశాయి.
ఈ సంస్థలు ఇచ్చని ఆఫర్లతో 12.5 కోట్ల మంది వినియోగదారులు 5జీకి అప్ గ్రేడ్ అయి ఈ సేవలను ఉపయోగించుకుంటున్నారు. అపరిమిత 5జీ డేటాను ఆస్వాదిస్తున్నారు. వీరి సంఖ్య 20 కోట్లకు పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలనే తమ లాభాలను పెంచుకునేందుకు టెలికాం ఆపరేటర్లు సిద్ధమవుతున్నారు. అందుకే 2024 ఏడాది మధ్యలో నుంచి అపరిమిత 5జీ సేవలకు స్వస్తి చెప్పి అధిక చార్జీలను వసూలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మరి..5జీ విషయంలో ఎయిర్ టెల్, జీయో తీసుకొనున్నా ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.