Vinay Kola
Redmi: రెడ్ మీ కంపెనీ 10 వేల లోపు బడ్జెట్ లో కొత్త 5జి స్మార్ట్ ఫోన్ ని పరిచయం చేసింది. ఈ ఫోన్లో మంచి కెమెరాతో పాటు ఇంకా ఎన్నో క్రేజీ ఫీచర్లు కూడా ఉంటాయి.
Redmi: రెడ్ మీ కంపెనీ 10 వేల లోపు బడ్జెట్ లో కొత్త 5జి స్మార్ట్ ఫోన్ ని పరిచయం చేసింది. ఈ ఫోన్లో మంచి కెమెరాతో పాటు ఇంకా ఎన్నో క్రేజీ ఫీచర్లు కూడా ఉంటాయి.
Vinay Kola
రెడ్‌మీ ఫోన్లకు మార్కెట్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెడ్ మీ నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చిందంటే హాట్ కేకుల్లా అమ్మకాలు జరుగుతాయి. ఎందుకంటే రెడ్ మీ ఫోన్లు మధ్య తరగతి ప్రజలకు హాట్ ఫేవరెట్. ఇవి బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లని అందిస్తాయి. మిగతా కంపెనీలతో పోలిస్తే రెడ్ మీ ఫోన్ల రేట్లు చాలా తక్కువ. మరి అంత తక్కువ బడ్జెట్ లో క్రేజీ ఫీచర్స్ ఇస్తుంటే జనాలు ఊరుకుంటారా ? ఎగబడి కొనరు. ఇప్పటికే లోకాస్ట్ లో ఎన్నో ఫోన్లు తీసుకొచ్చిన రెడ్ మీ తాజాగా ఇండియన్ మార్కెట్లోకి మరో క్రేజీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర కేవలం 10 వేల కంటే తక్కువ ధరలోనే ఉంటుంది. కానీ ఫీచర్లు మాత్రం ప్రీమియం రేంజిలో ఉంటాయి. పైగా ఇది 5జి ఫోన్. అంత తక్కువ బడ్జెట్ లో 5జి ఫోన్ రావడం అంటే చాలా బెస్ట్ అనే చెప్పాలి. ఇక ఈ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు వస్తాయి? దీని స్పెసిఫికేషన్స్ ఏంటి ? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రెడ్‌మీ తాజాగా తీసుకొచ్చిన ఈ మోడల్ పేరు రెడ్ మీ A4. దీనిలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. ఈ సూపర్ 5జి స్మార్ట్ ఫోన్ ఏకంగా స్నాప్‌డ్రాన్ 4ఎస్ జెన్2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌తో ఇండియన్ మార్కెట్లో వస్తున్న ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే అని కంపెనీ చెబుతోంది. అది కూడా 10 వేల ధరలోనే కావడం విశేషం. మామూలుగా మనకి మంచి కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్ కావాలంటే కచ్చితంగా మినిమం 20 వేల బడ్జెట్ అయిన పెట్టాల్సిందే. అంత కాస్ట్ పెట్టి కొంటె గాని మనకు మంచి కెమెరా ఫోన్ రాదు. కానీ ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కెమెరా ఎన్ని మెగా పిక్సలో తెలుసా ? తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోవడం పక్క. రెడ్ మీ ఏ4 ఏకంగా 50 మెగా పిక్సల్ బ్యాక్ కెమెరాతో వస్తుంది. ఇంత తక్కువ ధరలో 50 మెగా పిక్సల్ కెమెరా అంటే నిజంగా మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ లో 8 మెగా పిక్సల్ కెమెరా ఉంటుందని తెలుస్తుంది. ఈ కెమెరా సెటప్ మీకు మంచి క్వాలిటి ఫోటోలు, వీడియోలని ఇస్తుందని రెడ్ మీ తెలుపుతుంది.
అంతేగాక ఈ ఫోన్లో ఇంకా మరిన్ని క్రేజీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 3.5 mm ఆడియో జాక్ ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే.. దీనికి ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 6.25 ఇంచెస్ ఉంటుంది. ఈ స్క్రీన్ 90 HZ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 12 bit ISP కెమెరాకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 MAH బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను బ్లాక్, వైట్ కలర్‌లో తీసుకొచ్చారు. దీని ఫస్ట్ సేల్ ఎప్పటి నుంచి ఉంటుందో కంపెనీ ఇప్పటి ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ అతి త్వరలో దీని సేల్ కి సంబంధించిన వివరాలని రియల్ మీ తెలపనుంది. ఇది సంగతి. ఇక 10 వేల బడ్జెట్ లో వస్తున్న ఈ రెడ్ మీ A4 5జి స్మార్ట్ ఫోన్ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.