Vinay Kola
Realme 13 series: రియల్ మీ కంపెనీ వినియోగదారులకు అందుబాటు ధరలో స్మార్ట్ ఫోన్లని లాంచ్ చేస్తుంది. మంచి ఫీచర్లని తన ఫోన్లలో అందిస్తుంది. తాజాగా మరో రెండు స్మార్ట్ ఫోన్లని విడుదల చెయ్యడానికి సిద్ధం అవుతుంది.
Realme 13 series: రియల్ మీ కంపెనీ వినియోగదారులకు అందుబాటు ధరలో స్మార్ట్ ఫోన్లని లాంచ్ చేస్తుంది. మంచి ఫీచర్లని తన ఫోన్లలో అందిస్తుంది. తాజాగా మరో రెండు స్మార్ట్ ఫోన్లని విడుదల చెయ్యడానికి సిద్ధం అవుతుంది.
Vinay Kola
రియల్ మీ నుంచి మరో రెండు స్మార్ట్ ఫోన్లు రాబోతున్నాయి. వీటి లాంచ్ డేట్ ను కంపెనీ ఇటీవల అనౌన్స్ చేసింది. ఇవి మంచి ఫీచర్లని కలిగి ఉంటాయని తెలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లని కొత్త చిప్ సెట్, 80W ఫాస్ట్ ఛార్జ్ వంటి చాలా ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకు వస్తున్నట్లు రియల్ మీ కంపెనీ చెబుతోంది. రియల్ మీ 13 సిరీస్లో ఈ 5జి స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. అందులో ఒకటి రియల్ మీ 13 ప్రో కాగా, ఇంకోటి రియల్ మీ 13 ప్రో ప్లస్. ఇవి ఆగస్టు 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానున్నాయి. వీటిని ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లు మీడియాటిక్ 7300 ఎనర్జీ ప్రాసెసర్ తో పని చేస్తాయి. ఈ ప్రాసెసర్ ఒప్పో రెనో 12 ప్రోలో కూడా ఉంది.
ఈ ప్రాసెసర్ విషయానికి వస్తే.. దీనికి ఎక్కువ పవర్ ఉంటుంది. ఈ చిప్ సెట్ 7,50,000 పైగా AnTuTu స్కోర్ అందిస్తుందని రియల్ మీ కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లలో 26 GB ర్యామ్, 256 GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. ఈ ఫోన్స్ గేమింగ్ కి సూపర్ గా ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్లలో 90fps స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ గేమింగ్ కి చాలా బాగుంటుంది. ఇక వీటి బ్యాటరీ విషయానికి వస్తే.. అత్యంత వేగంగా స్మార్ట్ ఫోన్ ను ఛార్జ్ చేయగల 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వీటిలో ఉంటుంది. ఈ ఫోన్లలో 5000 mAh పవర్ ఫుల్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ల డిజైన్ విషయానికి వస్తే.. వీటిని స్లీక్ డిజైన్లో తయారు చేశారు. అందువల్ల ఈ స్మార్ట్ ఫోన్లు చూడటానికి ఎంతో స్టైలిష్ గా కనిపిస్తాయి.
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల డిస్ప్లే విషయానికి వస్తే.. ఇవి 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి వున్నాయి. అంతేగాక ఇవి 120Hz రిఫ్రెష్ రేట్ ఇంకా 2000 నిట్‌ల బ్రైట్నెస్ కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్లు స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 5G చిప్‌సెట్ తో పవర్ ఫుల్ గా పని చేస్తాయి. అంతేగాకా వీటిలో మరో సూపర్ ఫీచర్ కూడా ఉంది. ఇవి 9-లేయర్ 3D వీసీ కూలింగ్ సిస్టమ్‌తో పని చేస్తాయి. అందువల్ల ఈ ఫోన్స్ ఎక్కువగా హీట్ అయ్యే ఛాన్స్ ఉండదు. రియల్ మీ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్ల కెమెరా విషయానికి వస్తే.. ఇవి 50 MP + 2 MP బ్యాక్ కెమెరా కలిగి ఉంటాయి. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే.. 16 MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటాయి. ఇవి అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరాలు. మరి మార్కెట్లోకి విడుదలయ్యాకా ఈ ఫోన్లు ఏ విధంగా ఆకట్టుకుంటాయో చూడాలి.